Suryaa.co.in

Devotional

నాడి గణపతి

వినాయకుడు విఘ్నాలను నివారించే దేవుడిగా పూజలందుకుంటున్నాడు. మన హిందూ సంప్రదాయంలో సకల దేవతలకు అధిపతి వినాయకుడు. ఆయన్ని గణేశుడు, గణపతి, గణనాయకుడు, ఏకదంతుడు ఇలా అనేక రకాల పేర్లతో భక్తులు పిలుచుకుంటారు. ఆ గణపతిని పూజిస్తే సకల దేవతలని పూజించిన ఫలితం దక్కుతుందని చెబుతారు.

అందుకే ప్రతి పూజలోను ఆయనే మొదటగా పూజలందుకుంటాడు. ఇక ఈ ఆలయములో దర్శనమిచ్చే వినాయకుడు మిగతా ఆలయాల్లో కంటే భిన్నంగా దర్శమిస్తుంటాడు. మరి ఈ ఆలయంలో వినాయకుడు ఎలా దర్శనమిస్తుంటాడు? ఈ ఆలయాలంలో ఉన్న విశేషం ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

నాడి గణపతి:
తమిళనాడు రాష్ట్రం, తిరునల్వేరి జిల్లాలో కుర్తాళం ఉంది. ఇక్కడ ఉన్న గణపతిని నాడి గణపతి అని పిలుస్తారు. ఇక్కడ గణపతి దేవుడిని ప్రతిష్టించి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట చేయాలనీ భావించగా, అది తెలిసిన మద్రాస్ గవర్నర్ ఎడ్వార్డ్ రాతికి ప్రాణ ప్రతిష్ట ఏంటి అంటూ అనడంతో ఆ సిద్ద యోగి ఒక వైద్యుడిని పిలిపించమని చెప్పగా అతడు పిలిపించగా, మౌనస్వామి వైద్యుడితో విగ్రహానికి నాడి పరీక్షించమని చెప్పగా అతడు కూడా విగ్రహానికి ప్రాణం ఉండదు కదా అంటూ పరీక్షించి నాడి చప్పుడు లేదని చెప్పగా, అప్పుడు మౌనస్వామి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట చేసి ఇప్పుడు చూడండి అని చెప్పగా స్టెతస్కోప్ తో పరిశీలించగా ఆ వైద్యుడిలో ఒక ఆశ్చర్యం. గణపతి విగ్రహానికి మనిషి వలె నాడి కొట్టుకుంటుందని చెప్పాడు.

ఇలా మౌనస్వామి మహిమ తో ఇక్కడ వెలసిన గణపతి దేవుడికి నాడి గణపతి అనే పేరు వచ్చినది. అయితే ఇక్కడ స్వామివారి తొడల నుండి శబ్దం వచ్చినదని అందుకే స్వామివారి విగ్రహానికి తొడలు కనిపించకుండా ధోవతి కడతారు.

– ఎంబిఎస్ గిరధర్‌రావు

LEAVE A RESPONSE