బ్రాహ్మణ చైతన్య వేదిక మండిపాటు
సినీనటుడు చిరంజీవి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సోదరుడు అయిన నాగేంద్ర బాబు ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి పై విమర్శలు చేస్తూ చేసిన ట్వీట్స్ పై బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు శిరిపురపు శ్రీధర్ శర్మ నిర్వహించిన 7.10.22 శుక్రవారం సమావేశంలో ఘాటుగా ఖండించారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ హైదరాబాదులో ఏర్పాటు చేసిన నిన్నటి అలయ్ బలయ్ కార్యక్రమంలో నాగబాబు తన సోదరుడు చిరంజీవి ప్రవర్తించిన హుందాతనంకు మచ్చ తెచ్చేలా ట్వీట్స్ చేయడం కరెక్ట్ కాదని, ఇలా గతంలో ప్రజారాజ్యం పార్టీ వున్నపుడు ఇలా మాట్లాడే నాగబాబు తన సామాజిక వర్గాన్ని రాజ్యాధికారంకు దూరం చేసాడని, ఇపుడు జనసేన పార్టీని కూడా తన నోటితో రాజ్యాధికారంకు దూరం చేయడంలో నాగబాబు కంకణం కట్టుకున్నట్లుగా నిన్నటి విమర్శలు స్పష్టంగా కనపడుతుంది. నిన్నటి సమావేశంలో గరికపాటి గారు తన ప్రసంగానికి చిరంజీవి గారి సెల్ఫీలు దిగడం అడ్డుపడుతుందనే ఉద్దేశంతో అసహనం వ్యక్తం చేయటం, దాన్ని వెంటనే చిరంజీవి సరి చేసుకుంటూ వచ్చి గరికపాటి గారి పక్కన కూర్చోవటం తర్వాత గరికపాటి తన ప్రసంగాన్ని కొనసాగించటం, ఆ తరువాత చిరంజీవి గారి ప్రసంగంలో గరికపాటి గారిని మంచిగా మాట్లాడటం,తన ఇంటికి ఆహ్వానించడం హుందాగా జరిగిపోతే మధ్యలో పానకంలో పుడకలాగా నాగబాబు గారి ట్వీట్స్ ఇరు సామాజిక వర్గాలను రెచ్చగొట్టేలాగా చేయటాన్ని బ్రాహ్మణ చైతన్య వేదిక తీవ్రంగా ఖండిస్తుంది.
నాగబాబు గారు మీరు ప్రస్తుతం మీ కుటుంబం రాజకీయ వ్యవస్థలో కొనసాగుతున్నారు, మీరు, మీ కుటుంబ సభ్యులు, మీ అభిమాన సంఘాలు నోటిని అదుపులో పెట్టుకుంటేనే మీకు రాజకీయాల్లో సముచిత గౌరవం లభిస్తుంది. అలాకాకుండా సినీ నటుల పోటీ మాదిరిగా మీరు ఈ సమాజంలో ప్రవర్తిస్తే ఈ సమాజం ఎప్పటికీ మిమ్మల్ని హర్షించదు. మీలో ఇప్పటికి ఇంకా సామాజికంగా చాలా మార్పు రావాల్సి ఉంది. సమాజంలో మీరు రాజకీయాల్లో కొనసాగుతూ మీ సామాజిక వర్గానికి రాజ్యాధికారం కావాలని పోరాడుతున్న సందర్భంగా ప్రతి ఒక్క కులాన్ని, మతాన్ని, ఆ వర్గాల్లో ఉన్న పెద్దలను గౌరవించేలాగా మీ ప్రవర్తన ఉండాలి. అప్పుడే మిగిలిన సామాజిక వర్గాలు మీకు దగ్గరవుతాయి. మీ దుందుడుకు ప్రవర్తనతో, మీ బెదిరింపు మాటలతో బెదిరిస్తూ ఉంటే, దాడులు చేస్తుంటే సభ్య సమాజం మిమ్మల్ని ప్రజారాజ్యం మాదిరిగానే మరలా జనసేనను దూరం పెడుతుంది. జనసేనలో ప్రముఖ బాధ్యతలు వహించే మీరు నిరంతరం ఆధ్యాత్మిక చింతనతో ప్రవచనాలు చెబుతూ హిందూ ధర్మాన్ని కాపాడుతూ ఉండే గరికపాటి గారిని మీరు వాడు వీడు అని మాట్లాడటం క్షమించరాని విషయం. మీ మాటల్ని విన్న మీ అభిమాన సంఘాలు గరికపాటి వారిని ప్రవచనాల్ని అడ్డుకుంటామని బెదిరించటం విధానం ఏదైతే ఉందో అది సభ్య సమాజంలో హర్షించే పని కాదు.
మీకు దమ్ము ధైర్యం ఉంటే, మీ అభిమాన సంఘాలకు ధైర్యం ఉంటే గరికపాటి వారి ఆధ్యాత్మిక ప్రవచనాలని అడ్డుకొని చూడండి. భక్తులు, హిందూ ధార్మిక సంఘాలు కలసి ఎగబడి మీ అభిమాన సంఘాన్ని, మిమ్మల్ని, మీ రాజకీయ పార్టీని, మళ్ళీ తరిమి కొడతారు. ఈ సమాజంలో బెదిరిస్తే బెదరటానికి ఏ సామాజిక వర్గం కూడా బెదిరే పరిస్థితి ప్రస్తుత సమాజంలో లేదు. అందువల్ల నాగబాబు మీరు రాజకీయాల్లో ఉన్నప్పుడు సభ్య సమాజంలో ఆచితూచి మాట్లాడాల్సిందిగా మీకు మీ సామాజిక వర్గానికి ఈ సభ్య సమాజంలో రాజ్యాధికారం కావాలనుకుంటే అన్ని కులాలను అన్ని మతాలను గౌరవిస్తూ కలుపుకొని పోతూ ప్రముఖులను గౌరవిస్తూ మీ ప్రవర్తన ఉండాలని లేనిపక్షంలో జనసేన మరో ప్రజారాజ్యం కాక తప్పదని శ్రీధర్ హెచ్చరించారు. ఇప్పటికైనా సరే మీరు, మీ అభిమాన సంఘాలు, మీ రాజకీయ పార్టీ సభ్య సమాజంలో తీరు మార్చుకొని ప్రవర్తించాలని, సమాజంలో ఎల్లప్పుడూ హుందాగా మాట్లాడే చిరంజీవి తన తమ్ముళ్లను తన అభిమాన సంఘాలను కట్టడి చేసుకోవాలని లేనిపక్షంలో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని శ్రీధర్ విజ్ఞప్తి చేశారు. గరికపాటి గారు మీరు కూడా అసహనం ప్రదర్శించడం మానుకోవాలని, ఆధ్యాత్మిక సభల్లో పాల్గొంటే తప్పులేదు గాని ఇలాంటి రాజకీయ సినీ సదస్సుల్లో పాల్గొని మీకు నచ్చలేదని అసహనం ప్రదర్శించే బదులు అక్కడ మౌనంగా ఉండటం మేలని లేని పక్షంలో అలాంటి సమావేశాలకు దూరంగా ఉంటే మీ గౌరవానికి, హుందాతనానికి భంగం వాటిల్లకుండా ఉంటుందని శ్రీధర్ విజ్ఞప్తి చేశారు.