Suryaa.co.in

Telangana

నాగార్జున చేతుల మీదుగా జిఎస్టీ కమిషనర్ నరసింహారెడ్డికి కేంద్ర ప్రభుత్వ ప్రశంసాపత్రం

హైదరాబాద్ లో జరిగిన 8 వ జి.ఎస్.టి దినోత్సవ వేడుకలలో..300 వందలమంది నుంచి అవయవదాన అంగీకార పత్రాలు సేకరించిన కస్టమ్స్, జిఎస్టీ అప్పీల్స్ కమిషనర్ సాధు నరసింహారెడ్డి కి సినీ హీరో అక్కినేని నాగార్జున ప్రశంసాపత్రం అందచేశారు.

సెంట్రల్ జీఎస్టీ చీఫ్ కమిషనర్ వి.సంగీత మార్గదర్శకత్వం లో కమిషనర్ నరసింహారెడ్డి ఇటీవల అవయవదానంపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించగా 300 మంది తమ మరణాంతరం వివిధ అవయవాలను దానం చేస్తామని హామీ పత్రాలు అందజేశారు. ఇంత పెద్ద ఎత్తున అంగీకార పత్రాలు సేకరించడంతో కేంద్ర ప్రభుత్వం కమిషనర్ నరసింహారెడ్డి కి ఉత్తమ సేవా పురస్కారం ప్రకటించింది.

దీనిని హీరో నాగార్జున, కమిషనర్ కి అందచేసి మాట్లాడుతూ.. నరసింహారెడ్డి సేవలు సాటిలేనివన్నారు. అవయవ లోపాలతో ఉన్న వారికి అవయవాలు అందచేయటం గొప్ప ప్రశంసకరమన్నారు.

కమిషనర్ సాధు నరసింహారెడ్డి మాట్లాడుతూ..సమిష్టి సహకారంతోనే ఈ ఘనత సాధ్యమైందన్నారు. ప్రతి ఒక్కరూ తమ మరణాంతరం అవయవాలు దానం చేసి, మరొకరి జీవితాలలో వెలుగులు నింపాలన్నారు. భవిష్యత్ లో కూడా ఈ కార్యక్రమం ద్వారా ప్రజలను చైతన్య పరుస్తామన్నారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, ఉద్యోగులు నరసింహారెడ్డి కి అభినందనలు అందచేసారు.

LEAVE A RESPONSE