– పక్కదారి పట్టిన ఈఎస్‌ఐ సొమ్ము
– సొంత ఖర్చులకు వాడుకున్న ఔట్ సోర్సింగ్ సంస్థ
అమరావతి: గుంటూరులోని ఆచార్య నాగార్జున వర్సిటీకి జప్తు నోటీసు వెళ్ళింది. ఈ నోటీసును ఈఎస్‍ఐ జారీ చేసింది. ఉద్యోగుల ఈఎస్‍ఐ సొమ్ము దారిమళ్లడంపై ఇందుకు ఉపక్రమించింది. ఉద్యోగుల ఈఎస్‍ఐ సొమ్మును ఔట్ సోర్సింగ్ సంస్థ వాడుకుంది. ఔట్ సోర్సింగ్ సంస్థ ఆ సొమ్మును వాడుతున్నా వర్సిటీ అధికారులు పట్టించుకోలేదు. రూ.28 లక్షలు చెల్లించాలని డిమాండ్ నోటీసులు అధికారులకు అందినా నిర్లక్ష్యంగా ఉండడంతో పలువురు విమర్శిస్తున్నారు.