వైసీపీని ప్రజలు సిమెంట్ వేసి మరీ కప్పెట్టే రోజు దగ్గర్లోనే ఉంది

• తండ్రి అధికారంతో లక్షలకోట్లు దోచుకొని, జైలుకెళ్లిన వ్యక్తి, మూడున్నరేళ్లనుంచి రాష్ట్రాన్ని దోచుకుంటూ, ప్రజలకు భయపడి, పరదాలు, బారికేడ్ల మాటున దాక్కుంటున్న జగన్ రెడ్డి పులా.. పిల్లా నానీ? 
• రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లక్షలకోట్లు దోచుకొని, సీబీఐ, ఈడీకేసులతో జైలుకెళ్లింది మీ జగన్ రెడ్డి కాదా?
• వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి మృతివెనక జగన్ హస్తం ఉందని ఇప్పుడు మీతోనే ఉంటున్న బొత్స, ధర్మాన, కన్నబాబులు అనలేదా బూతులనానీ?
• గతంలో పీ.వీ.నరసింహారావు, కోట్లవిజయభాస్కర్ రెడ్డిలపై చెప్పులు వేయించింది రాజశేఖర్ రెడ్డి కాదా?
• రాష్ట్రానికి పట్టిన చెత్త వైసీపీ… చెత్త నాకొడుకులంతా ఆపార్టీలోనే ఉన్నారు
యరపతినేని శ్రీనివాసరావు

బూతులమంత్రి, గుడివాడగుట్కా నానీకి, అతనిపార్టీకి చంద్రబాబు, పవన్ కల్యాణ్ ల కలయికతో తడిచిపోతోందని, మూడున్నరేళ్లలో రాష్ట్రాన్నిదోచేసి, సంక్షేమాన్ని చంక నాకిం చిన జగన్ రెడ్డి పులి అయితే, పరదాలు, బారికేడ్ల మాటున దాక్కొని భయంభయంగా ఎందుకు బతుకుతున్నాడని టీడీపీ సీనియర్ నేత, మాజీఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరా వు ప్రశ్నించారు. శుక్రవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయనమాటల్లోనే క్లుప్తంగా మీకోసం…!

“మాజీ బూతులమంత్రి, గుడివాడ గుట్కానానీ లోకేశ్, చంద్రబాబులపై పిచ్చికూతలు కూశాడు. గుట్కాల నానీ, సీఎం జగన్ పులి అయితే, ప్రజల్లోకి వచ్చినప్పుడు బారికేడ్లు,పరదాలను ఎందుకు అడ్డుపెట్టుకుంటున్నాడు? ఇచ్చిన హామీలు ఏవీ నెరవేర్చలేదు కాబట్టే జనానికి భయపడి పరదాలచాటున దాక్కుంటున్నవాడు పులికాదు పిల్లి. జగన్ రెడ్డి పులీ…సింహమని నువ్వుపెంచితే పెరగలేడు నానీ. అది గుర్తుపెట్టుకో. లోకేశ్ లాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి ఒక్కడైనా మీ పార్టీలో ఉన్నాడా నానీ? మూడున్నరేళ్ల నుంచి రాష్ట్రాన్ని దోచుకుంటున్నది ఎవరునానీ? రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లక్షలకోట్లు దోచుకొని, సీబీఐ, ఈడీకేసులతో జైలుకెళ్లింది మీ జగన్ రెడ్డికాదా? వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి మృతివెనక జగన్ హస్తం ఉందని ఇప్పుడుమీతోనే ఉంటున్న బొత్స, ధర్మాన, కన్నబాబులు అనలేదా బూతులనానీ? భారతదేశంలో అత్యంత అవినీతిపరుడైన నాయకుడుజగన్ రెడ్డి అనిధర్మాన అనలేదా? వైసీపీలో చేరాలంటే చంచల్ గూడ జైలుకు వెళ్లాలని కురసాల కన్నబాబు అనలేదా నానీ? రాజశేఖర్ రెడ్డిని బట్టలుప్పదీసి కొట్టాలని జబర్దస్త్ రోజా తిట్టలేదా? గురివింద గింజలా మీకింద తప్పులుపెట్టుకొని మా చంద్రబాబు, లోకేశ్ ల గురించి మాట్లాడతావా నానీ?

చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలిస్తే వైసీపీకి, జగన్ కు పట్టుగతులుండవు…
మద్యం పాలసీ విషయంలో గతప్రభుత్వాలు కొనసాగించిన విధానాన్నే చంద్రబాబుగారు కొనసాగించారు. జగన్ రెడ్డిలాగా రంగునీళ్లలో విషం కలిపి అమ్ముతూ, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడటంలేదునానీ! జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో మైనింగ్ మాఫియా, భూకబ్జాలు, విచ్చలవిడిగా సాగుతున్నాయి. గాలి, నీటిని కూడా వదలకుండా విశాఖపట్నాన్ని దోచుకుంటున్నది మీ పార్టీవారు కాదా నానీ? ఏపార్టీ పనికిమాలిందో చెప్పడానికి నువ్వు ఎవరు నానీ? రాజశేఖర్ రెడ్డి 2004లో ఎవరితో పొత్తుపెట్టుకున్నాడో చెప్పు. పవన్ కల్యాణ్, చంద్రబాబుకలిస్తే మీకు, మీపార్టీకి పుట్టగతులుండవని భయపడుతున్నారు. బూతులగురించి నువ్వూ, మీ నాయకుడు మాట్లాడితే ఎలానానీ? చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్ రెడ్డి ఏం మాట్లాడాడో ఒక్కసారి చెప్పు నానీ!పవన్ కల్యాణ్ ఊరికే చెప్పుచూపించి వదిలేశాడు.. వైసీపీనేతల్ని చెప్పులతో కొట్టాలి. రాష్ట్రానికి పట్టిన చెత్త వైసీపీ… చెత్తనాకొడుకులంతా ఆపార్టీలోనే ఉన్నారు. సంజనా..సుకన్యా, అరగంటా అంటూ అమ్మాయిలతో అడ్డంగా బుక్కైన అంబటిరాంబాబు, పవన్ కల్యాణ్ ని అనేంతటివాడా? సిగ్గు, ఎగ్గులేనిపనులు, నీతిమాలిన వేషాలతో అడ్డంగా బుక్కైనా సిగ్గు లేకుండా బుకాయిస్తార్రా? ఆంధ్రప్రదేశ్ ను సర్వనాశనం చేసిన మిమ్మల్ని చెప్పులతో కొట్టకుండా సత్కరించాలా?
లెజండరీ లీడర్ చంద్రబాబు ఎక్కడ… జైలుపక్షి జగన్ ఎక్కడ…?

దేశరాజకీయాల్లో లెజండరీలీడర్ చంద్రబాబుఎక్కడా.. పరదాల చాటున పోలీసులమాటున దాక్కునే జైలుపక్షి జగన్ రెడ్డి ఎక్కడా? తెలుగుదేశంపార్టీని ఎన్టీఆర్, చంద్రబాబులు 40ఏళ్ల పాటు నడిపారు. లోకేశ్ మరో 40ఏళ్లునడుపుతారు. మీకేమైనా సందేహాలుంటే వాటిని బయటకు చెప్పి నివృతిచేసుకోండి. లోకేశ్ తో పెట్టుకుంటే సింహం వేట ఎలాఉంటుందో అలాఉంటుందని గుర్తుంచుకోండి. అప్పులతో రాష్ట్రాన్ని నాశనంచేసి, వేలకోట్లు దోచేశారు. రూ.2లక్షలకోట్లకు లెక్కాపత్రంలేదు. అప్పులపై వాస్తవాలు చెబితే మీ బతుకు రోడ్డున పడుతుందని భయపడుతున్నారు. గతంలో ప్రధానిగాఉన్న పీ.వీ.నరసింహారావు, ముఖ్యమంత్రిగా ఉన్న కోట్లవిజయభాస్కర్ రెడ్డిలపై చెప్పులు వేయించింది రాజశేఖర్ రెడ్డి కాదా? పాతబస్తీలో జరిగిన మతకలహాల వెనక వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి హస్తంఉందని చెన్నారెడ్డి చెప్పలేదా? తనస్వార్థంకోసం తెలంగాణ చిచ్చురాజేసింది మీ మహామేత కాదా? పవన్, చంద్రబాబు కలిసినా ఓడిపోతారంటున్న నానీ, వారికలయికపై ఎందుకంతలా ఉలిక్కిపడుతున్నాడు? ఎవరు గెలుస్తారో, ఓడిపోతారో ప్రజలు నిర్ణయిస్తారు నానీ…. తాడేపల్లి లో కూర్చొనిస్క్రిప్ట్ రాసేవారు కాదు. ఒంటరిగా పోటీచేయమని చెప్పడానికి నానీ ఎవడు… అది మాఇష్టం. 23మంది ఎమ్మెల్యేలను చేర్చుకోవడం తప్పంటున్నారు. మరి 2009-2014మధ్యన టీడీపీఎమ్మెల్యేలు, ఎంపీలను మీరెందుకు చేర్చుకున్నారో చెప్పండి? మీరు చేస్తేఒప్పు.. మేం చేస్తే తప్పా? చేయాల్సిన తప్పులన్నీ చేసి, మాపైన దాడిచేస్తారా? ఎన్నికలకు ముందు అమరావతినే రాజధానిగా ఉంచుతాననిచెప్పిన జగన్ రెడ్డి, ప్రతిపక్షనేతగా అసెంబ్లీలో మాట్లాడుతూ రాజధానికి ఇన్నివేలఎకరాలుండాలి… ఇక్కడుం డాలని చెప్పలేదా? పాదయాత్ర చేస్తున్న మహిళారైతులపై అవమానకరరీతిలో పోస్ట్ లు పెడతారా? ఏరా మీకు అక్కచెల్లెళ్లు లేరా? చంద్రబాబునాయుడు ఆడబిడ్డలకు అన్నగా పసుపుకుంకుమ పంచితే, దాన్ని అడ్డుకుంది జగన్ రెడ్డికాదా?

బాబాయ్ ని చంపిన వ్యక్తికి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొనే అర్హతలేదు
వివేకానందరెడ్డిని ఎవరు చంపారో చెప్పండి? హత్యకేసును సీబీఐతో విచారణ జరిపించాలన్న జగన్ రెడ్డి, అధికారంలోకి రాగానే ఎందుకువద్దన్నాడు? కోర్టులో వేసిన పిటిషన్ ఎందుకు వెనక్కు తీసుకున్నాడు? అప్రూవర్ గా మారిన దస్తగిరిని చంపేవరకు వచ్చారు.. సీబీఐ అధికారుల్ని భయపెట్టే స్థాయికివచ్చారు. వివేకా కుమార్తె సునీత సుప్రీంకోర్టులో పిల్ వేస్తే, హత్యకేసు విచారణను న్యాయస్థానం వేరేరాష్ట్రానికి బదిలచేయడానికి సిద్ధమైంది. సొంత బాబాయ్ ని చంపిన జగన్ రెడ్డికి అసలు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొనే అర్హతా, హక్కుందా? జగన్ రెడ్డి చెత్తనానీలకు సమాధానంచెప్పడంకాదు, నీకే చెబుతున్నా, ప్రకృతి అనేది ఒకటుందని గుర్తుంచుకో. వివేకాహత్యకేసులో ముఖ్యమంత్రి పాత్రమిటో తేలాలి. అప్పుడే అహంకారంతో విర్రవీగుతున్న వ్యక్తి నిజస్వరూపం ప్రజలకు తెలుస్తుంది. నిండుసభలో చంద్రబాబు నాయుడిని అవమానించిన మీకు, మర్చిపోలేని సమాధానం చెబుతాం. ఎన్నికలు వచ్చిననాడు వైసీపీపీని, ఆపార్టీనేతల్ని ప్రజలు సిమెంట్ వేసి మరీ పాతరేయడానికి సిద్ధంగా ఉన్నారు. జగన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఇదే తొలిసారి… ఆఖరిసారి. జగన్ తన సంక్షేమం చూసుకుంటూ, ప్రజలసంక్షేమాన్ని రాష్ట్రభవిష్యత్ ను నాశనం చేశాడు. సేవ్ డెమోక్రసీ సేవ్ ఆంధ్రప్రదేశ్ – క్విట్ జగన్ నినాదాన్ని రాష్ట్రప్రజానీకం ఎలుగెత్తిచాటాల్సిన సమయం వచ్చింది. వైసీపీ స్క్రిప్ట్ లు ఇకపనిచేయవు. మీ సినిమాఅయిపోయింది. మీ సినిమాడబ్బాలు థియేటర్లలో బొమ్మపడ కుండానే వెనక్కువచ్చాయని గుర్తుంచుకోనానీ. సృష్టి ఉన్నంతవరకు తెలుగుదేశంపార్టీ ఉంటుందని ముఖ్యమంత్రి, వైసీపీనేతలంతా గుర్తుంచుకోండి.. ఖబడ్దార్.. జాగ్రత్త!

జగన్ రెడ్డి ప్రభుత్వంలో దగాపడిన రైతుసోదరులు, చంద్రబాబునాయుడి గారి పర్యటనను భారీస్థాయిలో విజయవంతంచేశారు. అడుగడుగునా టీడీపీ అధినేతకు బ్రహ్మరథం పట్టారు. గురజాలకు 4 గంటలు ఆలస్యంగా వచ్చినా, వర్షం పడుతున్నా వేయికళ్లతో వారి అభిమాన నాయకుడికోసం వేచిచూశారు” అని యరపతినేని తెలిపారు.

Leave a Reply