నాగార్జునా… లోకేశ్ పాదయాత్రలో ఈగ వాలినా టీడీపీ సత్తా ఏంటో చూపిస్తాం

Spread the love

• జగన్ రెడ్డి ప్రభుత్వంలో దగాపడిన దళితజాతిని అన్నలా అదుకుంటున్నందుకు లోకేశ్ ముక్కు నేలకు రాయాలా?
• మీపార్టీ ఎమ్మెల్సీ దళితుణ్ణి చంపి, శవాన్ని డోర్ డెలివరీ చేస్తే, నోరెత్తలేని చవట సన్నాసులు దళితమంత్రులు, వైసీపీ దళితప్రజాప్రతినిధులు.
• దళితుల సంక్షేమానికి దళితద్రోహి జగన్ రెడ్డి ఏంచేశాడో నాగార్జునతో బహిరంగచర్చకు నేను సిద్ధం.
• యువగళం పాదయాత్ర ఆగితే జగన్ రెడ్డే బాధ్యత వహించాలి.
– టీడీపీ ఎస్సీసెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్.ఎస్.రాజు

లోకేశ్ పాదయాత్ర గురించి టీడీపీ రాష్ట్రఅధ్యక్షులు అచ్చెన్నాయుడు ప్రకటించగానే వైసీపీనేతల్లో వణుకు మొదలైంది. యువగళం పేరు వినగానే తాడేపల్లి ప్యాలెస్ పునాదులు కదిలాయి. లోకేశ్ అంబేద్కర్ విగ్రహంవద్ద ముక్కునేలకు రాసి, తరువాతే పాదయాత్ర చేయాలని, చంద్రబాబు దళితులకు క్షమాపణ చెప్పాలని మంత్రి మేరుగ నాగార్జున అంటున్నాడు.చంద్రబాబు, లోకేశ్ లు ఆపని ఎందుకుచేయాలో నాగార్జున చెప్పాలి. జగన్ ప్రభుత్వంలో దగాపడిన దళితులకు అన్నలా అండగా నిలుస్తున్నందుకు లోకేశ్ ముక్కు నేలకు రాయాలా?వైసీపీఎమ్మెల్సీ దారుణంగా చంపిన దళిత డ్రైవర్ కుటుంబానికి రూ.5లక్షలు ఇచ్చినందుకు లోకేశ్ ముక్కు నేలకు రాయాలా?

వైసీపీకి ఓటేసిన దళితకార్యకర్త కావలిలో ప్రభుత్వవేధింపులతో చనిపోతున్నానని లేఖరాసి చనిపోతే, అతనికుటుంబానికి ఉన్న అప్పుతీర్చినందుకు నేలకురాయాలా?అనంతపురంలో అత్యాచారానికి గురై చనిపోయిన దళితయువతి స్నేహలత కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకున్నందుకు లోకేశ్ ముక్కునేలకు రాయాలా? దళిత వైద్యురాలు డాక్టర్ అనితారాణి బట్టలుమార్చుకునే వీడియోలు వైసీపీనేతలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తే నాగార్జున ఎక్కడ పడుకున్నాడు? 27దళిత సంక్షేమ పథకాల్ని జగన్ రెడ్డి రద్దుచేస్తే నోరుతెరవలేని పిరికి సన్నాసి సాంఘికసంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున.దళితవాడల్లో వసతుల కల్పనకు వెచ్చించాల్సిన ఎస్సీఎస్టీ సబ్ ప్లాన్ నిధుల్ని జగన్ రెడ్డి దారి మళ్లిస్తే నోరెత్తలేని ముండమోపి వెధవ నాగార్జున.వైసీపీఎమ్మెల్సీ దళితుణ్ణి చంపి డోర్ డెలివరీచేస్తే, నాగార్జున ఎవరివి పీకాడు?తనశాఖకు సంబంధించి ముఖ్యమంత్రి జీవోలు ఇస్తుంటే చేతులు కట్టుకొని కూర్చునే చవటసన్నాసి నాగార్జున.

పులివెందులలో నాగమ్మ అనేదళిత మహిళపై అత్యాచారంచేసి, హత్యచేస్తే మానవత్వంగా కూడా స్పందించని మీ ముఖ్యమంత్రి ముక్కునేలకు రాయాలి మేరుగ. అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వ సలహాదారులుగా మేథావులే పనికొస్తారని దళితుల్ని అవమానించిన జగన్ రెడ్డే దళితజాతికి బహిరంగ క్షమాపణచెప్పాలి. లోకేశ్ , చంద్రబాబులగురించి అవాకులు, చవాకులు పేలితే దళితజాతి చిహ్నాలతో నాగార్జున లాంటివాళ్ల దవడలు పగలగొడతాం.

దళితుడిని చంపి, జైలుకెళ్లి వచ్చినవాడికి గజమాలలు, ఊరేగింపులతో స్వాగతం పలుకుతారా? దళితుల్లో అత్యధికశాతం పేదరికంలో ఉంటారు..ఎవరూ కావాలని పేదరికంలో పుట్టాలనుకోరన్న చంద్రబాబు నిజమైన వ్యాఖ్యలు నీ చెవులకు ఎక్కలేదా నాగార్జునా?ఎన్నిరోజులు తప్పుడు ప్రచారంతో దళితుల్ని మీ స్వార్థానికి వాడుకుంటారు? దళితబిడ్డకు పోలీస్ స్టేషన్లో శిరోముండనం చేస్తే మాట్లాడలేని దళితమంత్రులు ఉండటం సిగ్గుచేటు.దళిత ఆడబిడ్డలపై అత్యాచారాలు జరుగుతుంటే నోరెత్తలేని మీరు దళితులకు ప్రతినిధులా? లోకేశ్ పాదయాత్ర గురించి మాట్లాడే వైసీపీనేతల్ని హెచ్చరిస్తున్నా. పాదయాత్రలో తొలిఅడుగు పడకముందే వైసీపీనేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి. పాదయాత్ర మొత్తం పూర్తైతే వైసీపీ రాజకీయంగా సమాధికావడం ఖాయం.

మా నాయకుడి పాదయాత్ర వద్ద ఈగవాలినా, చీమచిటుక్కుమన్నా, తెలుగుదేశం నేతల సత్తా ఏంటో చూస్తారు.హోల్ కేబినెట్ మొత్తం కట్టకట్టుకు వచ్చినా లోకేశ్ అడుగు ముందుకే పడుతుందని గుర్తుంచుకోండి.మీలాంటి పిరికిసన్నాసులు ఉడతఊపులకు భయపడే స్థితిలో తెలుగుదేశం కార్యకర్తలు లేరు.సవాల్ చేసి చెబుతున్నా… యువగళం పాదయాత్ర ఆపేదమ్ము మీకుంటే, తరువాత జరిగే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. పాదయాత్ర ఆగితే అందుకు బాధ్యత వహించాల్సింది జగన్ రెడ్డే. కుప్పం నుంచి పాదయాత్రను ప్రారంభించి, చెప్పిన విధంగా లోకేశ్ గారు 4వేలకిలోమీటర్లు వీరోచితంగా ముందుకు సాగుతారు.దళిత సంక్షేమానికి టీడీపీప్రభుత్వం ఏంచేసిందో, దళితద్రోహి జగన్ రెడ్డి ఏంచేశాడో నాగార్జునతో బహిరంగ చర్చకు నేను సిద్ధం.

Leave a Reply