– ఫూలే జయంతి సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నివాళి
సమసమాజ స్థాపనకు, విద్యావ్యాప్తికి, మహిళా సాధికారతకు తన జీవితం అంకితం చేసిన తొలి సమాజ సంస్కర్త మహాత్మ జ్యోతిబా ఫూలే.
ఫూలే వంటి మహనీయుల ఆశయ స్ఫూర్తితో స్థాపించిన టిడిపి… వెనకబడిన వర్గాలలో రాజకీయ చైతన్యం కలిగించి, వారి సామాజిక, ఆర్థిక, రాజకీయ పురోగతికి 40 ఏళ్లుగా కృషిచేస్తోంది.
బిసిలది…తెలుగుదేశం పార్టీది విడదీయలేని అనుబంధం. తెలుగుదేశం DNA లోనే బీసీల అభివృద్ధి ఇమిడి ఉంది.టిడిపి అంటేనే బిసిల పార్టీ అనే వాస్తవం ఎవరూ కాదనలేనిది. రాష్ట్రంలో, దేశంలో అన్ని రాజకీయ పార్టీలు నేడు బీసీల గురించి మాట్లాడాల్సిన పరిస్థితి కల్పించిందే తెలుగుదేశం.
స్థానిక సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు 26 ఏళ్ల పాటు అమల్లో ఉన్నాయంటే దానికి కారణం తెలుగుదేశమే. రాష్ట్రంలో టిటిడి చైర్మన్ పదవితో పాటు….16 వర్శిటీల్లో 9 వర్శిటీలకు వీసీలుగా బీసీలను నియమించాం. ఆదరణ పథకంతో చేతి వృత్తిదారులకు ఉపాధినిచ్చాం. జ్యోతిబా ఫూలే జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి నివాళులు.