– ముకేష్ కుమార్ మీనాని కలిసిన మాజీ మంత్రి నక్కా ఆనందబాబు,ఎమ్మెల్సీ అశోక్ బాబు, బుచ్చి రామ్ ప్రసాద్
అమరావతి: సచివాలయంలో రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కలిసిన టిడిపి బృందం-ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్-సీఈవో) ముకేష్ కుమార్ మీనా ని కలిసిన మాజీ మంత్రి నక్కా ఆనందబాబు,ఎమ్మెల్సీ అశోక్ బాబు, బుచ్చి రామ్ ప్రసాద్. ఏపీలో జరగనున్న గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్ల అవకతవకలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన టిడిపి
అధికార పార్టీ ఓటర్లను ప్రలోభ పెట్టడంతో పాటు ఓట్లనే తారుమారు చేస్తుందని పిర్యాదు చేసిన టీడీపీ నేతలు. చీఫ్ ఎలక్ట్రోలర్ ఆఫీసర్ ముఖేష్ మీనా ని కలిసి ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఉత్తరాంధ్ర మరియు రాయలసీమ ఉపాధ్యాయ మరియు పట్టబద్రుల MLC ఎన్నికలలో అవకతవకల గురించి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కడప జిల్లాకు చెందినటువంటి అధికారి ప్రతాపరెడ్డి ఏ విధంగా చేశాడో చూసాం.
ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ TBGVD ప్రసాద్ రెడ్డి, అతనిని విసి అని అనేకంటే విజయసాయిరెడ్డి చెంచా అనటం బాగుంటుంది. మహామహులు చదివిన యూనివర్సిటీ సర్వేపల్లి రాధాకృష్ణన్ వంటి వారు వైస్ ఛాన్స్లర్ గా పని చేసిన యూనివర్సిటీని ఇప్పుడు ఈ ప్రసాద్ రెడ్డి వైసీపీ కార్యాలయంగా మార్చివేశాడు. నిన్న వైజాగ్ లో ఒక ప్రైవేట్ హోటల్లో ప్రైవేట్ కాలేజీల యజమాన్యాలతో మీటింగ్ ఏర్పాటు చేసి వైసీపీకి ఓటు వేయాలి లేకపోతే మీకు ఇబ్బందులు తప్పవు అని చెప్పేసి విసి మాట్లాడటం. వామపక్ష ప్రజా సంఘాలు ఆ హోటల్లోకి వెళ్లి వీడియో తీస్తుంటే వంట గదిలో నుంచి విసి పారిపోయాడు. ఇదే విషయం మీనా గారికి కంప్లైంట్ చేయడం జరిగింది ఆయన సనుకులంగా స్పందించారు నాకు కూడా తెలిసింది విషయం దగ్గర నుంచి రిపోర్ట్ తెప్పించుకొని తప్పకుండా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.