– పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డి టీ మాచన రఘునందన్
పాల్వాయి: రైస్ మిల్లర్ లు లెవీని త్వరితగతిన పూర్తి చేయాలని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తాశిల్దార్ మాచన రఘునందన్ స్పష్టం చేశారు. ఆయన పాల్వాయి లో ఉన్న రైస్ మిల్లు ను తనిఖీ చేశారు.ఈ సందర్భంగా రఘునందన్ ధాన్యం తాలూకు వివరాలను,మిల్లు లో నిల్వ ల ను పరిశీలించారు.
ధాన్యం సేకరణ లో నే గాక, లెవీని త్వరిత గతిన పూర్తి చేయడం లో నల్గొండ జిల్లా ను రాష్టం లో నే ప్రధమ స్థానంలో ఉండేలా కృషి చేయాలన్నారు.
భారత ఆహార సంస్థ గిడ్డంగి లో కూడా సరిపడా నిల్వ స్థలం వెంటనే లభ్యమయ్యేలా ఎఫ్ సి ఐ తో మాట్లాడి లెవీ త్వరిత గతిన పూర్తి అయ్యేలా కృషి చేస్తానన్నారు. లెవీ త్వరిత గతిన పూర్తి చేయడం లో మిల్లర్ లు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని రఘునందన్ సూచించారు.