రాజమహేంద్రవరం :- టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ టీడీపీ ‘‘కాంతితో క్రాంతి’’ కార్యక్రమాన్ని శనివారం చేపట్టింది. ఈ కార్యక్రమంలో నారా భువనేశ్వరి రాజమహేంద్రవరంలో పాల్గొన్నారు.
భువనేశ్వరి ప్రమిదలు వెలిగించి నిరసన లో పాల్గొన్నారు. ఆమెతో పాటు స్థానిక మహిళలు కార్యక్రమంలో పాల్గొన్నారు. మేము సైతం బాబు కోసం, బాబుతో మేము అంటూ మహిళలు నినాదాలు చేశారు.