Suryaa.co.in

Andhra Pradesh

నారా చంద్రబాబు నాయుడు అనే నేను…

విజయవాడలోని కేసరపల్లి సమీపంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో భారీ జనసందోహం మధ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ చంద్రబాబుతో ప్రమాణం చేయించారు. నారా చంద్రబాబు నాయుడు అనే నేను అనగానే.. ఆయన కుటుంబ సభ్యులంతా ఎమోషనల్ కావడం కనిపించింది. అదే సమయంలో సభకు హాజరైన వారంతా జై చంద్రబాబు నినాదాలు చేశారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయడంతో టీడీపీ శ్రేణులంతా ఆనందం వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రెండు సార్లు, విభజన ఆంధ్రప్రదేశ్‌లో ఒకసారి సీఎంగా పనిచేసిన ఆయన నాలుగో సారి సీఎంగా ఇవాళ ప్రమాణం చేశారు.

LEAVE A RESPONSE