Suryaa.co.in

Andhra Pradesh

విజయవాడలో జాతీయ వైద్యుల క్రీడలు

భారతీయ వైద్య సంఘం ఆధ్వర్యంలో జాతీయస్థాయి వైద్యుల ఒలింపిక్ క్రీడలు నవంబర్ 22 నుండి 26 వరకు విజయవాడలో నిర్వహిస్తున్నట్టు ఐఎంఎ జాతీయ అధ్యక్షులు డాక్టర్ శరద్ కుమార్ అగర్వాల్ మంగళవారం విజయవాడలో జరిగిన పాత్రికేయ సమావేశంలో ప్రకటించారు.

ఐఎంఏ జాతీయ అధ్యక్షులు డాక్టర్ శరద్ కుమార్ అగర్వాల్ ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చిన సందర్భంగా విజయవాడ హోటల్ సమావేశ మందిరంలో నిర్వహించిన పాత్రికేయ సమావేశంలో ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ జి.రవికృష్ణ, జాతీయ ఉపాధ్యక్షులు డాక్టర్ శ్రీహరి రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఫణి ధర్ లతో కలిసి మాట్లాడారు.

డాక్టర్ శరద్ కుమార్ అగర్వాల్ మాట్లాడుతూ వైద్యులు నిరంతరం ఒత్తిడితో కూడినటువంటి వృత్తి జీవితంలో గడుపుతుంటారని, ఆ ఒత్తిడి నుండి బయటపడడానికి క్రీడలు ఉపకరిస్తాయనే భావనతో వైద్యులకు జాతీయ స్థాయి క్రీడలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ దేశం నలుమూలల నుండి దాదాపు రెండు వేల మంది పైగా వైద్యులు ఈ క్రీడల్లో పాల్గొనబోతున్నారని, విజయవాడ ఐఎంఏ శాఖ ఆధ్వర్యంలో ఏర్పడిన నిర్వాహక కమిటీ అవసరమైన ఏర్పాట్లు అన్ని చేస్తున్నట్టు తెలిపారు.

ఐఎంఏ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాఖ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఫణిధర్, కోశాధికారి డాక్టర్ రవీంద్రనాథ్ ,వైద్యుల క్రీడల నిర్వహణ కమిటీ చైర్మన్ డాక్టర్ పట్టాభి రామయ్య, నిర్వాహక కార్యదర్శి డాక్టర్ కార్తీక్ మాట్లాడుతూ 22 క్రీడలు 84 అంశాలలో పోటీలు నాగార్జున విశ్వవిద్యాలయం క్రీడా ప్రాంగణాలలో మరియు డాక్టర్స్ స్పోర్ట్స్ అకాడమీ మైదానంలో, నగరంలోని ఇతర క్రీడా ప్రాంగణాల్లో నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. దక్షిణ భారతదేశంలో వైద్యుల జాతీయ క్రీడలు నిర్వహించడం ఇదే మొదటి సారి అని అన్నారు.

ఈ సందర్భంగా జాతీయ అధ్యక్షులు డాక్టర్ శరద్ కుమార్ అగర్వాల్ జాతీయ వైద్యుల క్రీడల లోగోను ఆవిష్కరించి క్రీడా పోటీల వివరాల బ్రోచర్ విడుదల చేశారు.

ఈ కార్యక్రమంలో ఐఎంఏ జాతీయ ఉపాధ్యక్షులు డాక్టర్ శ్రీహరి రావు, ప్రెసిడెంట్ ఎలెక్ట్ డాక్టర్ జె సి నాయుడు రాష్ట్ర శాఖ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఫణిధర్, రాష్ట్ర కోశాధికారి డాక్టర్ రవీంద్రనాథ్, జాతీయ వైద్యుల క్రీడల నిర్వాహక కమిటీ చైర్మన్ డాక్టర్ పట్టాభి రామయ్య నిర్వాహక కార్యదర్శి డాక్టర్ కార్తీక్, ఐఎంఏ విజయవాడ శాఖ అధ్యక్షులు డాక్టర్ రెహమాన్, కార్యదర్శి డాక్టర్ దుర్గారాణి నిర్వాహక కమిటీ సభ్యులు పాల్గొన్నారు

LEAVE A RESPONSE