ఆరోగ్య జీవన విధానమే ప్రకృతి వైద్యం

ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలని ఎవరికి ఉండదు. మంచి ఆరోగ్య అలవాట్లు, ఆహార అలవాట్లతో పాటు ఆరోగ్యంగా ఉండడానికి పోషకాహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం, ఒత్తిడి లేకుండా హాయిగా ఉండడం మొదలైనవి అనుసరించడం వల్ల ఆరోగ్యంగా ఉండొచ్చు. మనుషులకు ఎప్పుడైతే శారీరిక శ్రమ తగ్గుతుందో, వైద్యులు ఇచ్చే సూచన నడక.

ఉదయాన్నే నడవటం వలన ప్రతి రోజు దినచర్య ఉత్సాహాన్ని చైతన్యాన్ని కలిగిస్తుంది. నడక వలన మెరుగైన రక్త ప్రసరణ జరుగుతుంది. ఎంత పని ఒత్తిడిలో ఉన్నా, మనకున్న సమయంలో ఉన్న అరగంట సమయాన్ని వాకింగ్‌కి వెచ్చిస్తే చాలా మంచిది. వాకింగ్ చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. వాకింగ్ వల్ల చాల అనారోగ్య సమస్యలకు మనం నివారించవచ్చు. శరీరం చురుకుగా ఉండటం వల్ల మెలటోనిన్ యొక్క ప్రభావాలను పెంచుతుంది ఇది నిద్రపోవడానికి సహాయపడుతుంది. బయటికి వెళ్ళి ఎక్సర్సైజ్ చెయ్యలేని వారు, జిమ్ కు వెళ్లలేని వారు చాల నిరుత్సాహానికి గురవుతుంటారు. ఇంట్లో ఏమాత్రం ఖర్చు లేకుండా కొన్ని యోగాసనాలు చేసుకొని జాగ్రత్త పడవచ్చు.

ఇది శరీరంలో శక్తిని పెంచి, ఉత్సాహాన్ని కలిగిస్తాయి. పైగా ఇది చేయడానికి పదిహేను నిమిషాల కంటే ఎక్కువ పట్టదు. ప్రతి ఆసనాన్ని రెండు మూడు నిమిషాల సేపు రోజూ వేయండి. క్రమపద్ధతిలో యోగా ఆచరిస్తే శారీరకంగా , మానసికంగా ధృడంగా మారవచ్చు. ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, గ్రహణ శక్తి పెరుగుతాయి. ఆత్మవిశ్వాసం, స్వీయక్రమశిక్షణ వంటి సులక్షణాలు అలవడతాయి. భావోద్వేగాలు నియంత్రణలో ఉంటాయి, రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జీవించి ఉండడానికి పోషకాహారము ఒక మౌలికమైన అవసరము, ఆహారంలో వైవిధ్యం జీవితాన్ని ఆహ్లాదపరిచేదే గాకుండ, పోషణ, ఆరోగ్యాలకు అతి ముఖ్యం. వేరు వేరు వర్గాలకు చెందిన పదార్థాలను చేర్చినప్పుడు ఆహారం పోషకాలను తగిన పాళ్ళలో అందిస్తుంది.

ప్రధాన గింజధాన్యాలు, చిరుధాన్యాలు, పప్పు దినుసులు చాలా పోషకాలను ఎక్కువగా కలిగి ఉంటాయి. ఆహారంలో, ముఖ్యంగా శిశువులు, పిల్లలు, స్త్రీల ఆహారంలో మంచి నాణ్యమైన మాంసకృత్తులను, కాల్షియంను అందించే పాలు తప్పకుండా వుండాలి. వంటనూనెలు, కాయలు శక్తిని అధికంగా కలిగి, ఆహారం యొక్క శక్తి సాంద్రత ఎక్కువ చేయడానికి ఉపయోగపడతాయి. గ్రుడ్లు, మాంసపదార్థాలు, చేపలను ఆహారంలో చేర్చడం వల్ల దాని నాణ్యత పెరుగుతుంది. శాకాహారులు గింజధాన్యాలు, పప్పులు, పాలు చేర్చిన ఆహారం ద్వారా దాదాపు అన్ని పోషకాలను పొందవచ్చు. విటమిన్లు, ఖనిజాలు వంటి రక్షక పదార్థాలు కూరగాయలు, పండ్లు అందిస్తాయి.

సీజనల్ గా లభించే పండ్లు తీసుకోవడం తో మానసిక ఒత్తిడి, గుండెపోటు దరిచేరవంటున్నారు నిపుణులు. ప్రకృతి వైద్య సిద్ధాంతం “ప్రకృతికి గల నివారణ శక్తిని” నమ్ముతూ సహజంగా ఉండే, తక్కువ ఇబ్బందికర పద్ధతుల పైన దృష్టి సారిస్తారు. “సంయోజిత” ఔషధం, అణుధార్మికత, పెద్ద శస్త్రచికిత్సల వంటి చికిత్సలు ఉండవు, జీవ ఔషధాల, ఆధునిక శాస్త్ర పద్ధతులని వదిలివేసి దేహం, ప్రకృతి వైవిధ్యమైన కలయికని ప్రోత్సహిస్తారు. ఒత్తిడి నివారణ,ఆరోగ్యకరమైన ఆహారపుటలవాట్లు, జీవన విధానం ద్వారా నివారణ కలిగించడాన్ని ఉద్ఘాటిస్తారు.

ప్రకృతి వైద్య అభ్యాస తత్వం ఆరు మూలాంశ విలువల ద్వారా వివరించవచ్చు. మొదట హాని చెయ్యవద్దు, అత్యంత ప్రభావవంతమైన అతి తక్కువ నష్టాన్ని కలిగించగల ఆరోగ్య చికిత్సలను అందించాలి ప్రతి మనిషిలో అనువంశికంగా ఉన్న ప్రకృతి యొక్క స్వయం నివారణ శక్తిని గుర్తించు,గౌరవించు,ప్రోత్సహించు. లక్షణాలని అణచివేసి,తొలగించే కంటే రోగం యొక్క కారణాన్ని గుర్తించి తొలగించాలి. హేతుబద్ధమైన ఆశని నేర్పించి స్ఫూర్తినివ్వాలి,ఆరోగ్యానికి సంబంధించి స్వయం బాధ్యతను ప్రోత్సహించాలి . ప్రతి వ్యక్తి వారి వ్యక్తిగత ఆరోగ్య కారణాలు,ప్రభావాలు దృష్టిలో ఉంచుకొని చికిత్స చేయాలి.

ఆరోగ్య పరిస్థితి ఉద్ఘాటించి ఆరోగ్యంగా ఉండేలా ప్రోత్సహించి ప్రతి వ్యక్తి,సమూహం,మన ప్రపంచపు వ్యాధులను నివారించాలి. మానవుడు ఎదుర్కోవడానికి ప్రకృతి మానవ శరీరానికి తగిన శక్తిని సమకూర్చింది. వ్యాధులను నయం చేయడానికి ప్రకృతి వైద్యం శాస్త్రీయ పద్ధతి అని చెబుతుంటారు. ప్రకృతి వైద్యంలో భోజన పద్దతులను మార్చుకోవడం, ఉపవాస దీక్షలు, ప్రకృతి వనరులతో చికిత్స ఇమిడి ఉంటాయి. దీనిపై ఇప్పుడిప్పుడే చైతన్యం పెరుగుతోంది.

ఆనందకర ఆరోగ్య జీవన విధానమే ప్రకృతి వైద్యం, మనము ఎలా జీవించాలి, ఏమి తినాలి అని తెలుపుతుంది. దీని ముఖ్యోద్దేశం ప్రజల ఆరోగ్యకరమైన జీవన అలవాట్లని పెంపొందించడమే. జీవనశైలి లో మార్పు, ఆహార అలవాట్లలో హేతుబద్దత కలిగి ఉంటే ప్రజల ఆరోగ్యం ప్రజల చేతుల్లో ఉంటుంది.

image
డా. యం.అఖిల మిత్ర