– కేంద్ర బడ్జెట్ లో “ఏపీకి అరచేతిలో వైకుంఠం”
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాటలు ఆంధ్ర ప్రదేశ్ పట్ల “నీళ్ల మూటలుగా” మిగిలాయి!ఏపీ ఆర్థిక లోటు భర్తీ ప్రస్తావన లేదు,పోలవరం ప్రాజెక్టు కు నిధులు లేవు,రాజధాని నిర్మాణానికి “చిల్లిగవ్వ” లేదు!
కరోనా విపత్తులో దేశ ప్రజలకు,రైతులకు నిరుద్యోగులకు వ్యాపారస్తులకు అండగా నిలవాల్సిన కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కాస్తూ బడ్జెట్ ప్రవేశపెట్టడం దుర్మార్గం!
బిజెపి ప్రభుత్వం అత్యంత ఘోరమైన విద్యుత్ పాలసీని తీసుకొస్తున్నారు రాష్ట్రంలో విద్యుత్ సంస్కరణల పేరుతో రాష్ట్ర ప్రజలకు అంటకడుతున్న విద్యుత్ మీటర్లు రైతుల,ప్రజల మెడకు “ఉరితాడుగా” మారబోతున్నాయి,ఒక ఇంటికి ఒక మీటర్ మాత్రమే ఉండాలి అని చాపకింద నీరులా ఏపీ ప్రభుత్వం ప్రయోగాత్మకంగా నివేదికలు తయారు చేస్తుంది!
ఏపీ రాష్ట్ర పార్లమెంటు సభ్యులు రాజ్యసభ సభ్యులు “ఉత్సవ” విగ్రహాలుగా మారారు!
ఏపీ సీఎం,ఆర్థిక మంత్రి బడ్జెట్ ముందు ఢిల్లీ బిజెపి పెద్దల చుట్టూ “ప్రదక్షిణలు” చేసినా రాష్ట్ర అభివృద్ధికి చిల్లిగవ్వ ఇవ్వకపోవడం సిగ్గుచేటు!ఏపీ ప్రభుత్వ పెద్దల బలహీనతలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి “శాపంగా” మారడం శోచనీయం!
కేంద్ర ప్రభుత్వానికి ఏపీ ప్రజలు “పన్నులు ఎందుకు కట్టాలి” ఆర్థిక సంక్షోభంలో రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందా లేదా!
బీజేపీ పాలిత రాష్ట్రాల పై కన్న తల్లి ప్రేమ చూపిస్తూ బీజేపీయేతర రాష్ట్రాలపై “సవతి తల్లి” ప్రేమ చూపడం అన్యాయం!
బిజెపి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలయిన టెలికాం,ఎల్ఐసి,పోస్టల్,రైల్వేస్ లాంటి దేశ ప్రజల సంపదను “తూకం” వేసి అమ్మడం తప్ప దేశ సంపదను పెంచాలనే ఆలోచన చేయకపోవడం శోచనీయం
కేంద్ర ప్రభుత్వ తీరు మారకుంటే ఏపీ నుంచి కేంద్ర ప్రభుత్వానికి చెల్లిస్తున్న పన్నులను నిలుపుదల చేస్తామని ఏపీ ఎంపీలు బిజెపి ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేయాలి,ఏపీ అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసి కేంద్రానికి పంపాలి అని డిమాండ్ చేస్తున్నాను.
నవీన్ కుమార్ రెడ్డి
కాంగ్రెస్ నేత
రాయలసీమ పోరాట సమితి కన్వీనర్