ఎన్నికలు కదన రంగానికి సిద్ధం కావాలి

• రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడి అవసరం ఉంది
• ప్రజా క్షేత్రంలోకి పార్టీ సిద్ధాంతాలు తీసుకువెళ్లండి
• జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులకు పార్టీ నేతల దిశానిర్ధేశం
• రెండో రోజూ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగిన క్రియాశీలక సభ్యుల కిట్ల పంపిణీ
• అత్యధిక సభ్యత్వాలు చేసిన వాలంటీర్లకు సన్మాన కార్యక్రమం

జనసేన పార్టీ చేపట్టిన క్రీయాశీలక సభ్యత్వ నమోదు కిట్ల పంపిణీ కార్యక్రమం రెండో రోజైన శనివారం సైతం రాష్ట్రవ్యాప్తంగా సమధికోత్సాహ వాతావరణంలో సాగింది. జిల్లాలవారీగా ఈ కార్యక్రమం కోసం నియమించిన సమన్వయకర్తల ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో కిట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. పార్టీలో సభ్యత్వం తీసుకున్న వారికి బీమా బాండ్లతోపాటు, గుర్తింపు కార్డు, పవన్ కళ్యాణ్ మనోగతం పుస్తకాన్ని అందజేశారు. క్రియాశీలక సభ్యత్వాలు ఎక్కువ మొత్తంలో చేయించిన వాలంటీర్లను సన్మానించారు. ఎన్నికలు కనుచూపు మేరలో ఉన్న తరుణంలో క్రియాశీలక సభ్యలంతా సిద్ధంగా ఉండాలని పార్టీ నేతలు కోరారు. పార్టీ బలోపేతం, ప్రజా క్షేత్రంలోకి పార్టీని, పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలను ఎలా తీసుకువెళ్లాలి అనే అంశాల మీద దిశా నిర్ధేశం చేశారు.

• కార్యకర్తల సంక్షమం కోసమే ప్రమాద బీమా
దేశం మొత్తం మీద సొంత డబ్బులతో కౌలు రైతులను ఆదుకుంటున్న ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ ని జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి ముత్యాల ప్రియా సౌజన్య అన్నారు. జనసైనికుల సంక్షేమం కోసం ముందు చూపుతో ప్రమాద బీమాను తీసుకొచ్చారని అన్నారు. ఉమ్మడి విజయనగరం జిల్లావ్యాప్తంగా రెండో రోజు అదే ఉత్సహంతో క్రియాశీలక సభ్యులకు సభ్యత్వ కిట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. నెలిమర్ల, చీపురుపల్లి, ఎస్. కోట, కురుపాం నియోజకవర్గాల్లో క్రియాశీలక సభ్యులకు కిట్లను అందజేశారు. ఈ కార్యక్రమానికి పార్టీ నియమించిన సమన్వయకర్తలు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్వి, రాష్ట్ర కార్యదర్శి గడసాల అప్పారావుతో పాల్గొన్నారు. ఇటు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో రాజాం, టెక్కలి, ఇచ్ఛాపురం, నర్సన్నపేట నియోజకవర్గాల్లో కిట్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. రాష్ట్ర కార్యదర్శులు బేతపూడి విజయశేఖర్, ఎ. దుర్గా ప్రశాంతి, సంయుక్త కార్యదర్శి తాడి మోహన్ సమన్వయకర్తలుగా వ్యవహరించారు.

• విశాఖలో జిల్లాలో రెండో రోజు ఘనంగా..
ఉమ్మడి విశాఖపట్నం జిల్లా అరకు నియోజకవర్గంలో జరిగిన క్రీయాశీలక సభ్యులకు కిట్ల పంపిణీ కార్యక్రమం రెండోరోజున సమన్వయకర్తలైన చేగొండి సూర్యప్రకాశ్, అమ్మిశెట్టి వాసు, ఘంటసాల వెంకటలక్ష్మీ హాజరయ్యారు. క్రియాశీలక సభ్యులకు వారి చేతుల మీదుగా కిట్ల పంపిణీ జరిగింది. అరకు నియోజకవర్గ ఇంఛార్జి అయిన వంపూరు గంగులయ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. యలమంచిలిలో సుందరపు విజయ్ కుమార్, భీమిలిలో సందీప్ పంచకర్ల, నర్సీపట్నంలో సూర్యచంద్ర ఆధ్వర్యంలో కిట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది.

• ఉభయ గోదావరి జిల్లాల్లో.. క్రియాశీలక సభ్యత్వ సంబరాలు
జనసేన పార్టీ చేపట్టిన క్రీయాశీలక సభ్యత్వ నమోదు కిట్ల పంపిణీ కార్యక్రమం రెండో రోజైన శనివారం ఉభయ గోదావరి జిల్లాల్లో అంగరంగ వైభవంగా సాగింది. పార్టీలో సభ్యత్వం తీసుకున్న వారికి బీమా బాండ్లతో పాటు, గుర్తింపుకార్డు, పవన్ కళ్యాణ్ మనోగతం పుస్తకాన్ని అందజేశారు. క్రీయాశీలక సభ్యత్వాలు భారీగా చేసిన వాలంటీర్లను ఘనంగా సన్మానించారు.

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని కరపలో జరిగిన కార్యక్రమంలో పార్టీ పీఏసీ సభ్యులు పంతం నానాజీ హాజరై సభ్యులకు కిట్లను అందజేశారు. అనంతరం వాలంటీర్లకు సన్మానం చేశారు. పి. గన్నవరం, రామచంద్రపురం, కాకినాడ సిటీ నియోజకవర్గాల్లోనూ జోరుగా రెండోరోజు కార్యక్రమాలు జరిగాయి.

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని నిడదవోలులో జరిగిన కిట్ల పంపిణీ కార్యక్రమానికి తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇంఛార్జి బొలిశెట్టి శ్రీనివాస్ హాజరయ్యారు. వాలంటీర్లకు ఆయన చేతుల మీదుగా సన్మానం చేశారు. నర్సాపురంలో రెండోరోజు జరిగిన కిట్ల పంపిణీ కార్యక్రమంలో నియోజకవర్గ పార్టీ ఇంఛార్జి, పార్టీ మత్స్యకార విభాగం ఛైర్మన్ బొమ్మిడి నాయకర్ హాజరయ్యారు. సభ్యలుకు కిట్లను పంపిణీ చేసి, పార్టీ కోసం కష్టపడాలని పిలుపునిచ్చారు. పోలవరం, దెందులూరు నియోజకవర్గాలతో పాటు పెనుమంట్ర మండలంలోనూ కిట్ల పంపిణీ కార్యక్రమాలు స్థానిక నాయకుల ఆధ్వర్యంలో వైభవంగా సాగాయి.

• ఎన్నికలు ఎంతో దూరం లేవు.. క్రియాశీలక సభ్యులు సిద్ధం కండి
కృష్ణా జిల్లా వ్యాప్తంగా రెండో రోజు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ సంబరాలు అంబరాన్ని తాకాయి. గుడివాడ నియోజకవర్గం, గుడ్లవల్లేరు మండలం, కురాడ గ్రామంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ ముఖ్యఅతిధిగా హాజరై వాలంటీర్లను సత్కరించారు. 100 మంది క్రియాశీలక సభ్యులకు బీమా పత్రాలు పంపిణీ చేశారు.. స్థానిక నాయకులు సందు పవన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల ఎన్నికల ఇంచార్జ్ బూరగడ్డ శ్రీకాంత్, జిల్లా కార్యదర్శి పేర్ని జగన్, తోట చిన్నారి, జనసేన సర్పంచ్ కొప్పినేని శేషవేణి, మండలాల అధ్యక్షులు, జనసైనికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కృష్ణా జిల్లా, మొవ్వ నియోజకవర్గంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల ఇంఛార్జ్ తాడిశెట్టి నరేష్ పాల్గొని కిట్లు ప్రధానం చేశారు. మైలవరం నియోజకవర్గం ఇబ్రహీపట్నంలో పార్టీ అధికార ప్రతినిధి అక్కల రామ్మోహనరావు ముఖ్య అతిధిగా కార్యక్రమం జరిగింది. జగ్గయ్యపేట నియోజకవర్గంలోనూ రెండో రోజు క్రియాశీలక సభ్యుల కిట్ల పంపిణీ జరిగింది.

ఎన్నికలు ఎంతో దూరం లేవు క్రియాశీలక సభ్యులంతా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కదన రంగంలో దూకేందుకు సిద్ధంగా ఉండాలని పార్టీ అధికార ప్రతినిధి, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఇంఛార్జ్ పోతిన మహేష్ పిలుపునిచ్చారు. పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రతి కార్యకర్త కంకణబద్దులై ఉండాలని కోరారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం పరిధిలో రెండో రోజు పార్టీ క్రియాశీలక సభ్యులకు సభ్యత్వ కిట్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. అత్యధిక సభ్యత్వాలు చేసిన వాలంటీర్లను సత్కరించి, క్రియాశీలక సభ్యులకు బీమాపత్రాలు అందచేశారు.

• రాష్ట్ర ప్రజలంతా మార్పు కోరుకుంటున్నారు
వైసీపీ పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా జనజీవనం అస్తవ్యస్తంగా మారిందని ఈ పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు అధికార మార్పు కోరుకుంటున్నారని జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. క్రియాశీలక సభ్యులంతా జనసేన సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి పార్టీ విజయానికి కృషి చేయాలని కోరారు, గుంటూరు నగరంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన క్రియాశీలక సభ్యుల కిట్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని వాలంటీర్లను సత్కరించారు. సభ్యులకు బీమా పత్రాలతో కూడిన బిట్లు పంపిణీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మూడున్నర లక్షల మంది సభ్యత్వం స్వీకరించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. పార్టీ నగర అధ్యక్షులు నేరెళ్ల సురేష్ ఆధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు అడపా మాణిక్యాలరావు, పార్టీ జిల్లా కార్యవర్గం సభ్యులు నారదాసు ప్రసాద్, ఆళ్ల హరి తదితరులు పాల్గొన్నారు.గుంటూరు జిల్లాలో చిలకలూరిపేట, గురజాల, బాపట్ల, వినుకొండ, పొన్నూరు నియోజకవర్గాల్లోనూ రెండో రోజు క్రియాశీలక సభ్యులకు బీమాపత్రాలు, కిట్ల పంపిణీ కార్యక్రమం వైభవోపేతంగా జరిగింది.

• ప్రకాశం జిల్లాలో..
ప్రకాశం జిల్లా, గిద్దలూరు నియోజకవర్గం పరిధిలోని గిద్దలూరు, కంభం మండలాల్లో క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. నియోజకవర్గ ఇంఛార్జ్ బెల్లంకొండ సాయిబాబు పాల్గొని క్రియాశీలక సభ్యులకు కిట్లు అందచేశారు. దర్శి నియోజకవర్గం దోనకొండ మండలంలో నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ ఇంఛార్జ్ బొటుకు రమేష్ బాబు పాల్గొని అత్యధిక సభ్యత్వాలు నమోదు చేసిన వాలంటీర్లను ఘనంగా సత్కరించారు. ఒంగోలు నియోజకవర్గం, కొత్తపట్టణం మండలంలోనూ జిల్లా, మండల కార్యవర్గం పార్టీ సంబరాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించింది. కందుకూరు నియోజకవర్గంలో ఇంఛార్జ్ పులి మల్లిఖార్జున్ పార్టీ క్రియాశీలక సభ్యత్వ సంబరాన్ని వరుసగా రెండో రోజు నిర్వహించారు.

• క్రియాశీలక సభ్యుల పాత్ర కీలకం
నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో స్థానిక నాయకులు బొబ్బేపల్లి సురేష్ బాబు ఆధ్వర్యంలో జరిగిన క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షులు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీలో క్రియాశీలక సభ్యుల పాత్రపై దిశానిర్దేశం చేశారు. అనంతరం గూడూరు నియోజకవర్గ కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని అత్యధిక సభ్యత్వాలు నమోదు చేసిన వాలంటీర్లను సత్కరించారు. తీగల చంద్రశేఖర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో క్రియాశీలక సభ్యత్వ ఆవశ్యకతను మనుక్రాంత్ రెడ్డి పార్టీ శ్రేణులకు వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా, మండల కార్యవర్గం సభ్యులు పాల్గొన్నారు. జిల్లాలో ఆత్మకూరు నియోజకవర్గంలో ఇంఛార్జ్ నలిశెట్టి శ్రీధర్ ఆధ్వర్యంలోనూ, కోవూరు పార్టీ కార్యాలయంలో పార్టీ జిల్లా, స్థానిక నాయకత్వం ఆధ్వర్యంలోనూ క్రియాశీలక సభ్యుల కిట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది.

ఉమ్మడి కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలో జరిగిన క్రీయాశీలక సభ్యులకు కిట్ల పంపిణీ కార్యక్రమం రెండో రోజున కిట్ల పంపిణీ కార్యక్రమానికి జిల్లా సమన్వయకర్తలైన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్య, రాష్ట్ర కార్యదర్శులు నయూబ్ కమల్, ఆకేపాటి సుభాషిణి హాజరయ్యారు. సభ్యులకు వారి చేతుల మీదుగా కిట్ల పంపిణీ జరిగింది. పార్టీ కోసం మరింత కష్టపడాలని పిలుపునిచ్చారు. ఎక్కువ మొత్తంలో సభ్యత్వాలు చేయించిన వాలంటీర్లను ఘనంగా సత్కరించుకున్నారు. అలూరు, నందికొట్కూరు, మంత్రాలయం, ఎమ్మిగనూరు నియోజకవర్గాల్లోనూ కిట్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా సాగింది. స్థానిక నాయకులు కిట్లను అందజేశారు. ఉమ్మడి అనంతపురం జిల్లా ఉరవకొండ, రాయదుర్గం, శింగనమల, రాప్తాడు, మడకశిర, కళ్యాణదుర్గం నియోజకవర్గాల్లో రెండో రోజు సభ్యత్వ కిట్లను క్రీయాశీలక సభ్యులకు పార్టీ నాయకులు అందజేశారు.

• రెండో రోజు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా..
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనూ క్రీయాశీలక సభ్యుల కిట్ల పంపిణీ కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంగా సాగింది. శ్రీకాళహస్తి నియోజకర్గ ఇంఛార్జి వినుత కోటా ఆధ్వర్యంలో సాగిన కిట్ల పంపిణీ కార్యక్రమానికి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ హాజరయ్యారు. ఆయన చేతుల మీదుగా పార్టీ వాలంటీర్లను సత్కరించారు. మదనపల్లెలో పార్టీ నాయకులు రాందాస్ చౌదరి ఆధ్వర్యంలో కిట్ల పంపిణీ కార్యక్రమం జోరుగా సాగింది. తిరుపతిలో జరిగిన కార్యక్రమంలో నియోజకవర్గ ఇంఛార్జి కిరణ్ రాయల్, తిరుపతి నగర అధ్యక్షులు రాజారెడ్డి పాల్గొన్నారు. చంద్రగిరి, కుప్పం నియోజకవర్గాల్లో జరిగిన కార్యక్రమాల్లో స్థానికి నాయకులు పాల్గొని కిట్లను పంపిణీ చేశారు.

ఉమ్మడి కడప జిల్లావ్యాప్తంగానూ శనివారం రెండో రోజూ క్రీయాశీలక సభ్యుల కిట్ల పంపిణీ కార్యక్రమం పండుగలా జరిగింది. కార్యక్రమానికి జిల్లా సమన్వయకర్తలుగా వ్యవహరిస్తున్న పి.విజయ్ కుమార్ రాయచోటిలోనూ, పొలసపల్లి సరోజ ప్రొద్దుటూరులోనూ, వడ్రానం మార్కండేయ బాబు చిట్వేలిలో జరిగిన కిట్ల పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సభ్యులకు కిట్లను అందజేయడంతో పాటు ఎక్కువగా సభ్యులకు చేర్పించిన వారికి సన్మానాలు చేశారు.

Leave a Reply