– ఈమె అరాచకాలు చూసి చంద్రగిరి తల్లి వేదన గుర్తుకు వచ్చింది!
– చెత్త ఏరుకునే పిల్లలను చేరదీసి వాళ్లతోనే గంజాయి అమ్మకాలు…
– ఇది దందా కాదు
– విద్యార్థుల భవిష్యత్తుపై దాడి!
కాలేజీలు, స్కూళ్లు టార్గెట్ – పుస్తకాలతో భవిష్యత్తు నిర్మించుకోవాల్సిన విద్యార్థులు, కామాక్షి గంజాయి ఉచ్చులో పడిపోయారు. 14 విద్యాసంస్థల చుట్టూ వ్యాపారం – ఇంజినీరింగ్, జూనియర్ కాలేజీలు, స్కూళ్ల గేట్ల దగ్గరే గంజాయి ప్యాకెట్లు. వందలాది విద్యార్థులు బలి – వారి భవిష్యత్తును వ్యాపారంగా చేసుకున్న గంజాయి కామాక్షి.
పోలీసుల విచారణలో బయటపడిన అరాచకాలు – ఒక్కొక్క లేయర్ తీయగానే, కామాక్షి గ్యాంగ్ కొత్త కొత్త నేరాలు బయటపడుతున్నాయి. పెంచలయ్యను చంపక ముందు నాకూ చదువుకునే పిల్లలు ఉన్నారు అంటూ సెంటిమెంట్ నంగనాచి కబుర్లు చెప్పింది కామాక్షి. కానీ 14 సరస్వతీ నిలయాల దగ్గర లోకల్ బిజినెస్, పొరుగు జిల్లాలకు కూడా కిలోకు 5000 లాభం పెట్టుకుని అమ్మిన గతం ఆమె ఘనత. టీడీపీ హయాంలో పెంచలయ్య ఫిర్యాదుతో ఆ బిజినెస్ ఆగిపోయిందని అల్లాడిపోతూ.. నెల్లూరు నీలి నీలాంబరి రగిలిపోయింది. పాపం పండి దొరికింది.
జనం వెళ్లి ఇల్లు కూల్చేశారు అంటే.. ఇన్నేళ్లుగా ఎంత వేదన అనుభవించారో వైకాపా అండ చూసుకొని, దళిత జేఏసీ జాక్ ముసుగులో.. ఈమె ఎంత దడిపించిందో మనం అర్థం చేసుకోవచ్చు. వైకాపా హయాంలో చెవిరెడ్డి ఎమ్మెల్యేగా చంద్రగిరిలో కూడా ఇదే గంజాయి గ్యాంగ్ పద్ధతిలో.. స్కూలు విద్యార్థినికి గంజాయి అలవాటు చేసారు. శారీరకంగా కూడా తన కూతురును చెరిపిన దుర్మార్గులను చూసి ఏడుస్తూ.. లోకేశ్ ను కలిసి కాపాడండి లేదా నా కూతురిని చంపెయ్యాక తప్పని దుస్థితి అని ప్రాధేయపడిన తల్లి పడిన వేదన గుర్తుకు వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా వేలాదిమంది గంజాయి బాధితులు ఉన్నారు. రాష్ట్ర సామాజిక సమస్యగా మార్చింది నీలి విష పాలన. ఓ వైపు అరికట్టాలి, మరో వైపు అలవాట్లను మానిపించాలి. ప్రభుత్వం, పౌరులు కలిసి సహకరిస్తూ.. చేస్తేనే ఇది సాధ్యం. వైకాపా కామాక్షికి పడే శిక్షతో గంజాయి స్మగ్లర్లకు భయం పుట్టాలి. గంజాయి మత్తులో రఫ్ఫా రఫ్ఫా అంటూ స్వైరవిహారం చేసే వారి వెన్నులో వణుకు పుట్టాలి.