నేతన్నలకు నేతన్న నేస్తం చేతోడు వాదోడుగా నిలుస్తుంది

రామచంద్రాపురం,: నిరంతరం ఎండ తెలియక కాళ్లు చేతులు ఆడిస్తూ శ్రమించే నేతన్నలకు నేతన్న నేస్తం చేతోడు వాదోడుగా నిలుస్తుందని రాష్ట్ర బీసీ సంక్షేమం, సమాచార పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖామాత్యులు చెల్లు బోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ తెలిపారు. శనివారం రామచంద్రపురం( చోడవరం) విజయ ఫంక్షన్ హాల్ లో నేతన్నల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రితో పాటు కే గంగవరం, కాజులూరు, రామచంద్రాపురం మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు, నేతన్న నేస్తం లబ్ధిదారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆకలి వేసినప్పుడు పస్తులు వుండి ఆత్మాభిమానం తో బ్రతికే నేతన్నల కష్టనష్టాలను సుదీర్ఘ పాదయాత్రలో గుర్తించి ముఖ్యమంత్రి అయిన తర్వాత నేతన్న నేస్తం పథకం ద్వారా వారి ఆకలి కేకలు తీర్చిన నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దక్కిందని తెలిపారు. మార్పు ద్వారా భద్రత , భరోసా కల్పించడం ప్రభుత్వ లక్ష్యమని ఆ తరహాలో సచివాలయ, వాలంటరీ వ్యవస్థ ద్వారా ఎక్కడ మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు వెళ్లడం గొప్ప విషయమన్నారు.

జీవన స్థిరత్వానికి పునాది వేసిన ఘనత ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి దక్కుతుందన్నారు. జీవన రక్షణకు ఇండ్లు, పిల్లల చదువులకు అమ్మఒడి విద్యా దీవెన వసతి దీవెన ఆరోగ్యశ్రీ తోపాటు రైతు భరోసా ఆసరా 45 సంవత్సరాలు దాటిన వారికి పెన్షన్ లు ఇస్తున్న ఘనత రాష్ట్ర ప్రభుత్వానికే దక్కిందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో జరుగుతున్న పాలనకు మనం సాక్షులుగా నిలుస్తామని మంత్రి పేర్కొన్నారు.

రామచంద్రపురం నియోజకవర్గ పరిధిలోని చేనేత వర్గాలు ఒకే తరహాలో దుప్పట్లు వేస్తున్నారని, నూతన ఒరవడి లతో ముందుకు రావాలని తన వంతు కృషి చేస్తానని మంత్రి తెలిపారు. ఇటీవల గడపగడపకు మన ప్రభుత్వం లో భాగంగా అద్దం పల్లి వంటి గ్రామాల్లో పర్యటన సందర్భంగా చేనేత వస్త్రాలు బకాయిల గురించి పలువురు తన దృష్టికి తీసుకొని వచ్చారన్నారు. దీనిపై ఉన్నతాధికారులతో మాట్లాడి రావలసిన బకాయిలు ఆయా సొసైటీలకు సుమారు ఏడు కోట్ల రూపాయలు వచ్చే విధంగా కృషి చేయడం జరిగిందన్నారు బకాయిలు పొందిన సొసైటీ వర్గాలు ఎంతో ఆనందం వ్యక్తం చేశారని మంత్రి తెలిపారు.

నేతన్న నేస్తంలో భాగంగా నాలుగో విడత గా రామచంద్రపురం నియోజకవర్గం లోని రామచంద్రపురం మండలానికి 343 కే గన్నవరం 204, కాజులూరు 90 మొత్తం 637 మంది చేనేత కార్మికులకు ఒక్కొక్కరికి 24 వేల రూపాయల చొప్పున ఒక కోటిఇరవై రెండు లక్షల రూపాయలు వారి ఖాతలకు బదిలీ అయ్యాయని మంత్రి వెల్లడించారు.

ఈ సందర్భంగా పలువురు ప్రజా ప్రతినిధులు, చేనేత సంఘం నాయకులు ప్రభుత్వం నేతన్న హస్తం వల్ల జరుగుతున్న ప్రయోజనం, బకాయిలు విడుదల చేస్తూ ఉండడంతో చేస్తున్న చొరవను ప్రత్యేకంగా ప్రశంసించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి లబ్ధిదారులు పాలాభిషేకం చేశారు.

Leave a Reply