న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో మరింత స్పష్టత అవసరం

రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్

శాతవాహన యూనివర్సిటీలో ” హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్ ద ఎన్.ఇ.పి 2020 — ఎమర్జింగ్ చాలెంజెస్ అండ్ పర్స్పెక్టివ్స్ ఆన్ ఇంప్లిమెంటేషన్ ” అనే అంశంపై జాతీయ సెమినార్. కేంద్ర ప్రభుత్వ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ( N.E.P ) మరింత స్పష్టత రావాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు.

సోమవారం కరీంనగర్ లోని శాతవాహన యూనివర్సిటీలో ” హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్ ద ఎన్.ఇ.పి 2020 — ఎమర్జింగ్ చాలెంజెస్ అండ్ పర్స్పెక్టివ్స్ ఆన్ ఇంప్లిమెంటేషన్ ” అనే అంశంపై జరిగిన జాతీయ సెమినార్ లో వినోద్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ న్యూ ఎడ్యుకేషన్ పాలసీను యధాతతంగా అమలు చేసే పరిస్థితి లేదని ఉన్నారు.

అందులో అనేక అనుమానాలు ఉన్నాయని, వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వ విద్యా శాఖకు ఉందని వినోద్ కుమార్ పేర్కొన్నారు. నాలుగు సంవత్సరాల డిగ్రీ కోర్సు, క్రెడిట్ బేస్డ్ సిస్టం, క్లస్టర్స్ ఇన్స్టిట్యూషన్స్, ఇంటర్ డిసిప్లినరీ కోర్సెస్, టీచింగ్ మెథడ్స్, టెక్నాలజీ బేస్డ్ టీచింగ్ అండ్ లెర్నింగ్, అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్, ప్రైవేట్ అండ్ పబ్లిక్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, క్లస్టర్ అప్రోచ్, సెంటర్లజేషన్ ఆఫ్ రెగ్యులేటరీ ఫ్రేమ్ వర్క్, ఇంప్రూవింగ్ ఆఫ్ క్వాలిటీ ఎడ్యుకేషన్, రీసెర్చ్ యూనివర్సిటీస్ వంటి అంశాలపై వివిధ రాష్ట్రాలకు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య విభిన్న అభిప్రాయాలు ఉన్నాయని, ఈ అనుమానాలను, అభిప్రాయాలపై సమగ్రంగా క్లారిటీ ఇచ్చి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని అమలు చేయాలని వినోద్ కుమార్ పేర్కొన్నారు.

ప్రాంతీయ భాషలైన తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ వంటి భాషల అభివృద్ధి కోసం గానీ, ఆయా భాషల అభివృద్ధికి బడ్జెట్ కేటాయింపు విషయంలో కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేయాల్సిన అవసరం ఉందని వినోద్ కుమార్ అభిప్రాయపడ్డారు.

విద్యార్థులకు సామాజిక అంశాలపై సంపూర్ణ అవగాహన ఉండాల్సిన అవసరం ఉందని వినోద్ కుమార్ అన్నారు. సమాజ పరిస్థితులపై పట్టు సాధించేందుకు సోషల్ సైన్స్ వంటి సబ్జెక్టు విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందని వినోద్ కుమార్ అన్నారు. ఈ సెమినార్ లో శాతవాహన యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ మల్లేశం, మానియా యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ చెన్న బసవయ్య, తదితరులు పాల్గొన్నారు.