Suryaa.co.in

Andhra Pradesh

రికార్డు స్థాయిలో రాష్ట్ర ఆహార, ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులు

ఎంపీ విజయసాయి రెడ్డి

విశాఖపట్నం, నవంబర్ 28: ఆహార ఉత్పత్తుల ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ దూసుకుపోతోందని రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా సోమవారం పలు అంశాలు వెల్లడించారు. 2018-19లో రాష్ట్రం నుంచి 31.48 లక్షల టన్నుల ఆహార ఉత్పత్తులు ఎగుమతి జరిగితే.. 2020-21లో 52.88 లక్షల టన్నులు, 2021-22లో ఏకంగా 79.33 లక్షల టన్నుల ఎగుమతులు జరిగాయని తెలిపారు. ఇది అరుదైన రికార్డుగా వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి సంస్థ వెల్లడించిందని అన్నారు. ఇక ఈ ఏడాది తొలి అర్ధ సంవత్సరంలోనే 35.90 లక్షల టన్నుల ఆహార ఉత్పత్తులు ఎగుమతయ్యాయని తెలిపారు.

రైతన్నకు తోడుగా జగన్ ప్రభుత్వం
రైతన్నలకు ప్రతి కష్టంలోనూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తోడుగా నిలుస్తోందని విజయసాయి రెడ్డి అన్నారు. రబీ 2020-21, ఖరీఫ్ 2021 సీజన్లకు సంబంధించిన వైఎస్సార్ సున్నా వడ్డీ రాయితీ, ఖరీఫ్ 2022 సీజన్ లో దెబ్బతిన్న పంటలకు ఇన్ పుట్ సబ్సిడీ మొత్తం రూ.199.94 కోట్లను సీఎం జగన్ రైతుల ఖాతాల్లో జమ చేశారని అన్నారు.

ఫైబర్ నెట్ స్కాంలో లోకేష్ జైలుకెళ్లడం ఖాయం
321 కోట్ల ఫైబర్ నెట్ స్కామ్ లో నారా లోకేష్ జైలుకు వెళ్లడం ఖాయమని, ఇంటింటికీ టెలిఫోన్, ఇంటర్నెట్ సర్వీసులివ్వమని కేంద్ర ప్రభుత్వం నిధులిస్తే స్వాహా చేశారని అన్నారు. వేమూరి హరికృష్ణ చౌదరి అన్ని విషయాలు కక్కుతాడని అన్నారు.

చిత్తూరులో చంద్రబాబుకు మూడినట్లే
 పేదల ఇళ్ల నిర్మాణంలో చంద్రబాబు సోంత జిల్లా చిత్తూరు 82 శాతం ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకొని రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచిందని విజయసాయి రెడ్డి తెలిపారు. పేదలకు ఇళ్లేంటని అడ్డగోలుగా వాదించిన చంద్రబాబు ఇప్పుడు ముఖం ఎక్కడ పెట్టుకుంటారని, ఇక చిత్తూరులో చద్రబాబుకు మూడినట్లేనని అన్నారు.

LEAVE A RESPONSE