-సింగరేణికి కేటాయించమని అడుగుతున్నాం
-అఖిలపక్షం ద్వారా ప్రధానమంత్రిని మేము వేడుకోవటానికి సిద్ధం
-మాకు భేషజాలు లేవు
-నాటి టిఆర్ఎస్ ప్రభుత్వం ఆరో, అవంతిక సంస్థలకు -కోయగూడెం సత్తుపల్లి బ్లాకులు దక్కే విధంగా ఏర్పాటు చేసింది
-అవంతిక, ప్రతిమ రెండు కంపెనీల కాంట్రాక్టు రద్దు చేస్తాం
-బిఆర్ఎస్ కూడా కలిసి రండి…గతంలో లాగా కుట్ర లు చేయవద్దు
-కేసీఆర్, కేటిఆర్ మాట్లాడతానంటే ఆధారాలు తో సహా నేను చర్చకు సిద్దం
-ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు
ఖమ్మం: సింగరేణి సంస్థ పరిధిలో ఉన్న అన్ని బొగ్గుబ్లాకులను సింగరేణి సంస్థకే కేటాయించమని కోరుతున్నాం. రేపు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ని కలిసి ఇదే విషయం విన్నవించబోతున్నాం. తెలంగాణ ప్రాంతంలో ఉన్న అతి ముఖ్యమైన, కొంగు బంగారం అయిన సింగరేణి సంస్థ భవిష్యత్తు కొనసాగాలంటే కొత్త గనులు రావడం తప్పనిసరి.
ఈ గనులను వేలంపాట ద్వారా కాక నేరుగా ప్రభుత్వ సంస్థ అయిన సింగరేణికి కేటాయించమని అడుగుతున్నాం. కిషన్ రెడ్డి తెలంగాణ కి చెందినవారు కనుక ప్రత్యేక చొరవ తీసుకోవాలని ,అవసరమైతే ప్రధానమంత్రి తో అఖిలపక్షం ద్వారా కలవడానికి సహకరించాలని కోరుతున్నాం. అఖిలపక్షం ద్వారా ప్రధానమంత్రిని మేము వేడుకోవటానికి సిద్ధంగా ఉన్నాం.
మా ప్రాంతంగనులు మాకు ఇవ్వండి అని అడగడానికి మాకు ఎటువంటి భేషజాలు లేవు. ఇటీవల వేలం పాటలో పెట్టిన సత్తుపల్లి కోయగూడెం ఓపెన్ కాస్ట్ గనుల వేలంపాటదారులు ఇప్పటివరకు ఆ గనులను చేపట్ట లేదు కనుక వాటిని సింగరేణి సంస్థకు కేటాయించాలని కోరుతున్నాం.
2015లోమైన్స్ అండ్ మినరల్స్ ఆక్ట్ కు సవరణ చేసినప్పుడు నాటి టిఆర్ఎస్ ప్రభుత్వం మద్దతు ఇచ్చిందని, ఇప్పుడు దానికి భిన్నంగా వేలం పాటలు నిర్వహించకూడదు అంటున్నారని ఇది చాలా విడ్డూరం గా ఉందన్నారు. వేలంపాటలో పాల్గొనకూడదు అని ఒకపక్క నిర్ణయం తీసుకొని, సింగరేణిని పక్కకు ఉంచిన నాటి టిఆర్ఎస్ ప్రభుత్వం నాయకులు, తమకు అత్యంత సన్నిహిత మైన ఆరో, అవంతిక సంస్థలకు కోయగూడెం సత్తుపల్లి బ్లాకులు దక్కే విధంగా ఏర్పాటు చేశారు అన్నారు .
ఇక్కడ వేలంపాటలో పాల్గొనకూడదని నిర్ణయం తీసుకొని ఒడిస్సాలో మాత్రం వేలంపాటలో పాల్గొనాలని నిర్ణయించడం ఆశ్చర్యకరంగా ఉందన్నారు. టిఆర్ఎస్ నాయకులు తప్పుడు ప్రచారం ఇకనైనామానుకోవాలని , వారి పాలనలో సింగరేణి విధ్వంశానికి గురైందని, గనులు మూతపడ్డాయని కొత్త గనులు రాలేదని కార్మికుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది అన్నారు.
సింగరేణి సంస్థను, సింగరేణి ఆస్తులను, సింగరేణి ప్రాంత కొత్త గనులను కాపాడుకోవడం కోసం తాము పూర్తిస్థాయిలో కృషి చేస్తామని ,ఇప్పటికే గత ప్రభుత్వ బొ గ్గు శాఖ మంత్రి నీ తాను కలిసానని, ఇప్పుడు కూడా ప్రస్తుత బొగ్గు శాఖ మంత్రి నీ అవసరమైతే ప్రధానినీ కలవడానికి వేడుకోవడానికిసిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.
42 వేల మంది 22 వేల మంది కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్, మరో 50 వేల మంది ఉపాధి పొందుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే సింగరేణి పరిసర ప్రాంతాల బొగ్గు గనులు సింగరేణి కి ఇవ్వాలని కేంద్రాన్ని కోరాం. తెలంగాణ రాష్ట్రం మీద ప్రేమ ఉందని మాట్లాడుతున్నారు కేంద్ర మంత్రి. శ్రావణి పల్లి బొగ్గు గనుల వేలం పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ని కలుస్తాం.వేలం వేయవద్దు అని కోరుతాం.
తెలంగాణ రాష్ట్ర ఆస్తులు , సింగరేణి అస్తులను కాపాడాలని కోరతాం. తెలంగాణ తెచ్చుకుందే ఉద్యోగాలు కోసం సింగరేణి కాలరీస్ యూనియన్లు వినతులు ఇచ్చారు. బిఆర్ఎస్ కూడా కలిసి రండి…గతంలో లాగా కుట్ర లు చేయవద్దు. వేలం లో పాల్గొన్న అవంతిక, ప్రతిమ రెండు కంపెనీ లు నిర్ణీత గడువు లోపు ప్రారంభ చేయ లేదు కాబట్టి కాంట్రాక్టు రద్దు చేస్తాం.
రెండు బ్లాక్ లు సింగరేణి కి ఇవ్వాలని మంత్రి కిషన్ రెడ్డి ని కోరుతాం. ఆ కంపెనీలు లో ఎవరు ఎవరున్నారో త్వరలోనే పేర్లు చెబుతాం. బిఆర్ఎస్ నాయకులు కేసీఆర్, కేటిఆర్ మాట్లాడతానంటే చర్చకు సిద్దం…ఆధారాలు తో సహా నేను సిద్దం.