ఏపీలో కొత్తపథకం ‘జగనన్న అన్యమత ప్రచారం’

• విశాఖలో పోలీసుల చలాన్లమీద అన్యమతప్రచార సమాచారమేంటి జగన్ రెడ్డి?
• పరమతసహనం లేని వ్యక్తి పరిపాలనకు అనర్హుడు
– తెలుగుదేశం పార్టీ వాణిజ్యవిభాగం రాష్ట్ర అధ్యక్షుడు డూండీ రాకేశ్

జగన్ రెడ్డి పాలన హిందూసమాజానికి అంధకారమే మిగిల్చింది. వినాయకచవితి మండపాలు పెట్టుకోవ డానికి, దుర్గాష్టమి నిర్వహణకు అనుమతులు తీసుకో వాలనే ఆంక్షలు విధించడం ఈ ప్రభుత్వానికే చెల్లింది. జగన్ రెడ్డి తన సంకుచిత మనస్తత్వంతో ప్రజలందరూ ఆనందోత్సాహాలతో జరుపుకునే పండుగలను కూడా కొన్నివర్గాలు,వ్యక్తులకే పరిమితంచేశాడు.

జగన్ రెడ్డి అధికారంలోకివచ్చీరాగానే ప్రపంచప్రఖ్యాత పరమపవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలని చిన్నచూపు చూశాడు. బ్రహ్మోత్సవాలవేళ సతీసమీతంగా స్వామివారికి వస్త్రాలుసమర్పించాలన్న సంప్రదాయానికి తిలోదకాలిచ్చాడు. అన్యమతప్రచారంలో పాల్గొనే వై.వీ.సుబ్బారెడ్డిని టీటీడీ ఛైర్మన్ ను చేసి, వెంకన్నభక్తుల మనోభావాల్ని మంటగలిపాడు. ఈవిధంగా తన మతమే గొప్ప, ఇతర మతాలు పనికిరానివన్నట్లు పరమత సహనం లేకుండా ప్రదర్శిస్తున్న వ్యక్తి ప్రజల్ని పాలించడానికి ముమ్మాటికీ అనర్హుడు.

జగన్ రెడ్డి పాలనలో తిరుమలక్షేత్రంలో అన్యమతార్భాటం పతాకస్థాయికి చేరిందనే చెప్పాలి. గతంలో ఇలాగే అన్యమత ప్రచారం జరిగినప్పటికీ, సదరు ఘటనలపై నేటికీ వైసీపీప్రభుత్వం తగిన చర్యలుచేపట్టి నిందితుల్ని శిక్షించకపోవడం సిగ్గుచేటు. విజయసాయిరెడ్డి కుటుంబసభ్యుల ఆధ్వర్యంలో పెద్దఎత్తున క్రైస్తవ మిషనరీలు నిర్వహించడం తోపాటు బలవంతంగా మతమార్పిడులు జరుగుతున్నాయి. ఏ2, ఆయనకుటుంబం మిషనరీల ముసుగు లో బలవంతంగా మతమార్పిడులుచేస్తున్నా, జగన్ ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తుండటం హిందువుల్ని అవమానించడం కాదా?