-సీఎం జగన్ ఉద్యోగులకు చేసిందేంటి?
-మీ స్వార్దం కోసం లక్షలాది మంది ఉద్యోగుల్ని మోసం చేయడానికి సిగ్గనిపించటం లేదా?
– టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ
ఉద్యోగులకు అనేక హామీలిచ్చి మోసం చేసిన సీఎం జగన్ ని ఉద్యోగ సంఘ నాయకులు కీర్తించటం సిగ్గుచేటని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సయ్యధ్ రఫీ మండిపడ్డారు. శనివారం నాడు మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…… ఉద్యోగ సంఘ నాయకులు భజన బృందంగా మారారు, ఉద్యోగులకు ఏం మేలు చేశారని సీఎంని ఉద్యోగ సంఘ నాయకులు కీర్తిస్తున్నారు. 23 శాతం ఫిట్ మెంట్ ఇవ్వటం గొప్పా?
10 వ తేదీ దాటినా జీతాలు, ఫించన్లు ఇచ్చే పరిస్థితి లేదు. మీ స్వార్దం కోసం లక్షలాది మంది ఉద్యోగుల్ని మోసం చేయడానికి సిగ్గనిపించటం లేదా? ఉద్యోగ సంఘ నాయకులతో తీరును ప్రజలు అసహ్యించుకుంటున్నారు. గతంలో ప్రకటించిన డీఎ కార్యరూపం దాల్చలేదు, నాలుగేళ్లకు 16 విడతలుగా ఎరియర్స్ ఇస్తామంటే నమ్మి సీఎంని పొగుడుతున్నారంటే, పాలాభిషేకాలు చేస్తున్నారంటే చూడడానికి మాకే సిగ్గుగా ఉంది, ఉద్యోగ సంఘ నాయకులకు సిగ్గనిపించటం లేదా?
సీపీఎస్ కి బదులు ఓపీఎస్ తప్ప జీపీఎస్ వద్దన్నవాళ్లు దాని గురించి ఎందుకు మాట్లాడటం లేదు? ఇన్ని డబ్బులు ఎక్కడ నుంచి తీసుకొస్తున్నారో అర్దం కావటం లేదంటూ బండి శ్రీనివాసరావు సీఎంని పొగుడుతున్నారు. మద్యంపై వచ్చే ఆదాయం, ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టి రుణాలు తెస్తున్న సంగతి వీళ్లకి తెలియదా? జీపీఎస్ నిధులు రూ. 2 వేల కోట్లు లాక్కున్నారని ఉద్యోగ సంఘ నాయకులే చెప్పారు.
నాడు పెడబొబ్బలు పెట్టిన బొప్పరాజు నేడు భజన చేయటం సిగ్గుచేటు. సీఎం ఏ చేసినా వెంకట్రామిరెడ్డి పెద్ద భజన చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు 43 శాతం ఫిట్ మెంట్ ఇస్తే ఏం గొప్ప అన్న సూర్యనారాయణ ఇప్పుడు నోరు మెదపటం లేదు, బయటకు ఎందుకు రావటం లేదు? 23 శాతం ఫిటెమెంట్ ఆయన ఎందుకు మాట్లాడటం లేదు? వాళ్ల పొగడ్తలు చూసి ముఖ్యమంత్రి సైతం సిగ్గుపడుతున్నారు, ఎందుకంటే ఉద్యోగులకు తాను చేసిందేమీ లేదని ఆయనకూ తెలుసు.
ఎన్నికల ముందు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందర్నీ రెగ్యులైజ్ చేస్తామని నేడు కేవలం 10 వేల మందినే రెగ్యులైజ్ చేయటం ఏంటి? మిగిలిన వాళ్లు ఏం పాపం చేశారు? 12 వ పీర్సీ ఇస్తామన్నందుకు చంకలు గుద్దుకుంటున్నారు. 11 వ పీర్సీ రిపోర్ట్ చూపించమని ఆందోళన చేసినా ఇంతవరకు ప్రభుత్వం దాన్ని బయటపెట్టలేదు. నాడు చంద్రబాబు నాయుడు 64 జీవోలిచ్చి ఉద్యోగులు ఏం అడిగితే అది చేశారు.
కానీ నేడు వైసీపీ పాలనలో ఉద్యోగులకు ఒక్క రూపాయి అదనపు ప్రయోజనం జరిగిందా? రెగ్యులైజ్, కాంట్రాక్టు ఉద్యోగులకు రూ. 35 కోట్లు బకాయిలు చెల్లించాలి. ఇళ్ల స్ధలాలు ఇస్తామని ఒక్కరికైనా ఒక్క సెంటు భూమి ఇచ్చారా? తోటి ఉద్యోగుల్ని జైల్లో పెడితే సంతోషిస్తున్నారు. నాడు నేడు పేరుతో కమీషన్లు దండుకోవటం జరిగిన అభివృద్ది శూన్యం. ప్రవీణ్ ప్రకాశ్ లాంటి వ్యక్తులు టీచర్లను వేధిస్తున్నారు.
ఈ ఏడాది 2 లక్షల మంది విద్యార్దులు డ్రాప్ అవుట్ అయ్యారు. చంద్రబాబు నాయుడు పాలన జగన్ పాలన ఉద్యోగులు బేరీజు వేసుకోవాలి. ఉద్యోగ సంఘ నాయకులు ప్రభుత్వ పెద్దలు ఇచ్చే టీ బిస్కెట్లు తిని తాగి జీహుజూర్ అనటం సిగ్గుచేటు. అసలు ఉద్యోగ సంఘ నాయకులుగా చెప్పుకోవడానికి మీకు అర్హత ఉందా?
CPS, GPS, OPS ప్రధాన వ్యత్యాసాలు
Content CPS GPS OPS
పెన్షన్ నిర్ణయించేది షేర్ మార్కెట్ చెప్పలేము ప్రభుత్వం
పెన్షన్ గ్యారెంటీ ఉండదు ఉండదు ఉంటుంది
మానసిక, భౌతిక విగలాంగులు, విడో పిల్లాలకు పెన్షన్ ఉండదు ఉండదు ఉంటుంది
పీఆర్సీ ఉండదు ఉండదు వర్తించును
డీఏ సౌకర్యం ఉండదు ఉండదు వర్తించును
హెల్త్ కార్డు ఉండదు ఉండదు వర్తించును
క్వాంటమ్ పెన్షన్ ఉండదు ఉండదు వర్తించును
ఉద్యోగి దామాషా పెన్షన్ చెల్లించాలి చెల్లించాలి అవసరం లేదు
ఫీ.ఎఫ్ అర్హత, లోన్ సౌకర్యం అవకాశం అవకాశం లేదు అవకాశం ఉంది.
కమ్ముటేషన్ ఉండదు ఉండదు ఉంటుంది
మంత్లీ పెన్షన్ అమౌంట్ చెప్పలేము ఫిక్సిడ్ అమౌంట్ బేసిక్ లో 50%
రిటైర్మెంట్ బెనిఫిట్స్ పై ఆదాయపన్ను 30% IT+సర్ ఛార్జ్ 30% IT+సర్ ఛార్జ్ No Tax
అంత్యక్రియల ఖర్చులు ఉండదు ఉండదు రూ.25,000
ఇప్పటికైనా బీరాలు పలకటం మాని తమ చేతకాని తనాన్ని ఉద్యోగ సంఘ నాయకులు ఒప్పుకోవాలని సయ్యధ్ రఫీ అన్నారు.