Suryaa.co.in

Telangana

ఏ పంట వేసినా ఒక్క గుంట కూడా వృధా గా ఉంచద్దు

– రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది
– ఎల్లారెడ్డి నియోజకవర్గం మీసాన్ పల్లి గ్రామంలో రైతూ వేదిక లో రైతు నేస్తం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్
– 9 రోజుల్లో 9 వేల కోట్ల రూపాయలు రైతు భరోసా కింద ప్రభుత్వం రైతుల ఖాతాల్లో పెట్టుబడి సహాయం కింద వేయడంతో సంబరాల్లో రైతులు
– మీసాన్ పల్లి రైతు నేస్తం కార్యక్రమంలో రైతు వేదిక లో రైతులకు స్వీట్లు తినిపించి సంబరాల్లో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్

ఎల్లారెడ్డి : ప్రజా పాలన ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 9 రోజుల్లో 9 వేల కోట్లు రైతు భరోసా కింద పంట పెట్టుబడి సహాయం రైతుల ఖాతాలో వేసింది. లక్షలాది మంది ఈరోజు రైతులు సంబరాలు చేసుకుంటున్నారు. తెలంగాణ ప్రజా పాలన ప్రభుత్వం మీ ఆశీర్వాదంతో ఏర్పడింది. రైతాంగానికి పెద్దపీట వేస్తుంది. రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది. ఎద్దు ఏడ్చిన వ్యవసాయ రైతు ఏడ్చిన రాజ్యం బాగుండదు

రైతుల సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం పని చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ రైతులకు అండగా ఉంటుంది. రైతులకు సంబంధించి వారి అభివృద్ధికి ఏ ఆలోచన ఉన్న మా ప్రభుత్వం అమలు చేస్తుందని ముఖ్యమంత్రి చెప్పారు. రైతులకు వ్యవసాయం చేసిన అనుభవం ఉంది. మీరు మొక్కజొన్న, పత్తి ,ఆయిల్ ఫామ్ కూరగాయలు ఏ పంట వేసినా ఒక్క గుంట కూడా వృధా గా ఉంచద్దు. పంట సహకారం పొందిన ఎల్లారెడ్డి నియోజకవర్గ లక్షా 10 వేల మంది రైతులు 100 కోట్ల రూపాయలు పొందారు. వారికి శుభాకాంక్షలు.

LEAVE A RESPONSE