Suryaa.co.in

Andhra Pradesh

బాధ్యులెవరైనా వదిలిపెట్టేది లేదు

మంత్రి కొల్లు రవీంద్ర

కళాశాల యాజమాన్యంపై తమకు నమ్మకం లేదని, గత మూడు రోజులుగా ఈ సంఘటన తెలిసినప్పటికీ యాజమాన్యం నొక్కి పెడుతూ ఉందని, ఈ సంఘటన విషయమై వారు ఫిర్యాదు చేస్తే వారిపై చర్యలు వుంటాయని కళాశాల యాజమాన్యం బెదిరించారని విద్యార్థులు మంత్రి దృష్టికి తెచ్చారు. తమకు ఎట్టి పరిస్థితుల్లో న్యాయం జరగాలని అంతవరకు కళాశాలకు వెళ్ళమని విద్యార్థులందరూ ముక్తకంఠంతో నినాదాలు చేశారు.

ఈ సంఘటనలో వాస్తవాలు వెలికితీసి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని గనులు భూగర్భ వనరులు ఆప్కారి శాఖ మంత్రి కొల్లు రవీంద్ర విద్యార్థులకు హామీ ఇచ్చారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ విషయం చాలా తీవ్రంగా పరిగణిస్తున్నారని, బాధ్యులైన వారు ఎంతటి వారైనా సరే వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు.

కళాశాల విద్యార్థినులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి సంరక్షణ కల్పిస్తామని అందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకుంటుంది అన్నారు.

ఈ సంఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వసతి గృహం వార్డెన్ గాని, కళాశాల యాజమాన్యం పైన గాని క్రమశిక్షణ చర్యలు తప్పనిసరిగా తీసుకుంటామని మంత్రి ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

ఆడబిడ్డలపై అకృత్యాలకు పాల్పడే ఎవరినైనా సరే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని, మరలా ఇటువంటి సంఘటనలు జరగకుండా భయపడే విధంగా చట్టపరంగా తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి ఈ సందర్భంగా విద్యార్థులకు హామీ ఇచ్చారు.

LEAVE A RESPONSE