నిరీక్షణకు తెరదించరా..?

ఇటీవల తమిళ్ చిత్రం …జైభీమ్ ..అన్ని వర్గాల వారిని ఆలోచింప చేస్తుంది.అండ దండ లేని అణగారిన వర్గాల మీద పెత్తందార్లు..పోలీసుల దాష్టీకం ..!ఎత్తుకుపోయి ..చంపి..మసిపూసి మాయం చెయ్యటం.నికార్సయిన న్యాయవాది..పట్టుదల గా బాధితులకు అండగా నిలిస్తే..న్యాయవ్యవస్ధ తన ఔచిత్యాన్ని ప్రదర్శిస్తే…సత్యమే గెలుస్తుందన్నది ముగింపు..!బాధితులు కూడా ప్రలోభాలకు పరిహారాలకు లొంగకుండా ..దోషులకు శిక్షపడేవరకు నిలబడటం..మేలుకొలుపు..ఆచరణీయం..!
పాతికేళ్ళనాడు కడలూరు ఘటన సంచలనం..!
జస్టిస్ చంద్రు న్యాయం జరిగేలా చూసారు..!
హెబియస్ కార్పస్ పిటిషన్ ఎంత పవర్ ఫుల్లో ఈ సినిమా చూపిస్తుంది.
ఇప్పటికీ ఏమి మారింది..!?
ఒక యంపీ…!
అదీ అధికారపార్టీ కి చెందిన వారు..!
ప్రజల తరపున స్పందించేవారు..!
పాలకులను ప్రశ్నించేవారు..!
ప్రజావ్యతిరేక నిర్ణయాలను తూర్పార పట్టేవారు..!
కేంద్ర బలగాల రక్షణలో ఉన్న ఆయన్ని ఎత్తుకెళ్ళి..హింసించారు.
రాజ్యం తన పైశాచికత్వాన్ని చూపించింది.
అధికార గణం వత్తాసు పలికింది.
హింస ఆనవాళ్ళు చెరిపేయటానికి చూసారు..!
మేనేజ్ మెంట్ స్కిల్స్ ప్రదర్శించారు..!
ఎలాగో బయటపడ్డారు..!
కాని చట్టాన్ని…రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన వారి మీద చర్యలేవి..!?
ఎవర్ని అడగాలి..!?
ఎవరు బాధ్యులు..!?
సమస్య న్యాయస్ధానాల పరిధిలోకి వచ్చింది.
నెలలు గడుస్తున్నాయి..విచారణ చేసి పిశాచాలను సీసాల్లో బంధించకపోతే ఎలా..!?
న్యాయం కోసం నిరీక్షణ …!
ఈ దేశంలో ఇప్పుడు న్యాయస్ధానాలు తప్ప వేరే ఏ వ్యవస్ధ కూడా తనపని తాను చెయ్యటం లేదు.
ప్రతి ఒక్కరు ప్రశ్నించండి..!
న్యాయదేవతను వేడుకోండి..!
సత్వరం దోషులను శిక్షించమని..!
నిరీక్షణకు తెరదించాలి.హింసకు గురయిన రఘురామకృష్ణం రాజు గారికి న్యాయం జరగాలి.

– అడుసుమిల్లి శ్రీనివాసరావు