– ఈవీఎం ధ్వంసం చేసినా డేటా భద్రం
– పిన్నెల్లి పై సివియర్ సెక్షన్లు
– సీఈఓ మీనా
ఎన్నికల రోజు మాచర్లలో ఈవీఎం ధ్వంసం కావడంతో అక్కడ రీపోలింగ్ నిర్వహిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారానికి సీఈఓ మీనా చెక్ పెట్టారు. ఈవీఎం ధ్వంసం చేసినా డేటా భద్రంగా ఉందని అన్నారు. మాచర్లలో రీపోలింగ్ నిర్వహించే అవసరం లేదని స్పష్టం చేశారు.
ఎన్నికల అధికారి మీనా మాట్లాడుతూ.. “9 పోలింగ్ స్టేషన్లు లో ఈవీఎంలు ధ్వంసం చేశారు. మాచర్లలో ఏడు చోట్ల జరిగాయి. అల్లర్లు జరిగే అవకాశం ఉండటంతో మాచర్లలో వెబ్ కాస్టింగ్ కుాడా జరిగింది. బెల్ ఇంజనీర్ పరిశీలించి ఈవీఎంలలో డేటా సేఫ్ గా వుందని నిర్ధారించాక పొలింగ్ కంటిన్యూ అయింది. వెబ్ కాస్టింగ్ ద్వారా పోలీసులు విచారణ ప్రారంభించారు. సిట్ వచ్చాక నివేదికలు ఇచ్చారు. 20 వ తేదిన కోర్టులో పిన్నెల్లి రామకృష్ణ నీ A1 గా చేరుస్తూ మెమో వేశారు.
పోలీస్ ఆఫీసర్ల బదిలీల కారణంగా పిన్నెల్లి పేరు FIR లో చేర్చడం ఆలస్యం అయ్యింది. 10 సెక్షన్ల కింద మెమో ఫైల్ అయింది. ఏడేళ్ల వరకు శిక్షపడే సెక్షన్ లు కూడా పిన్నెల్లిపై పెట్టారు. పిన్నెల్లి అరెస్ట్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. వెంటనే అరెస్ట్ చెయ్యాలని ఈసీ ఆదేశాలు ఇచ్చింది. సివియర్ సెక్షన్లు పిన్నెల్లి పై పెట్టడం జరిగింది. ఈ ఘటన జరిగిన వెంటనే విచారణ ప్రారంభం అయింది. ఈసీ వెబ్ కెమెరాల ద్వారా డైరెక్ట్ ఎవిడెన్స్ సేకరించాము.
నిందితుడు గెలిచినా కోర్టు శిక్ష విధించేంత వరకు పదవిలో వుంటాడు. ఎలక్షన్ ప్రాసస్ జరుగుతుంది. కోర్టు తీర్పు ఇవ్వాల్సి ఉంటుంది. రిపోల్ కు ఆస్కారం లేదు. EVM లలో డేటా సేఫ్ గా ఉంది. అల్లర్లు జరగటానికి అవకాశం ఉన్న ప్రాంతాలను ఇప్పటికే గుర్తించాం. భారీ భద్రత నడుమ కౌంటింగ్ జరుగుతుంది. భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు జరగకుండా కేసులు పెడుతున్నాం. ఎవరిని వదిలే ప్రసక్తి లేదు పోలీసులు సీరియస్ గా పనిచేస్తున్నారు.” అని పేర్కొన్నారు.