Home » పిన్నెల్లి బ్రదర్స్ బోణీతో ‘వై నాట్’ మన పరారీ?

పిన్నెల్లి బ్రదర్స్ బోణీతో ‘వై నాట్’ మన పరారీ?

-వైసీపీ అభ్యర్ధులలో వణుకు ప్రారంభం
-పోలింగ్ వరకూ పరారీ ఆలోనలనే

మీడియా – సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అదే వార్తలు. పిన్నెల్లి బ్రదర్స్ పరారీతో, వారి భయంతో మాచర్లలో చెల్లాచెదరై తల దాచుకుంటున్న జనం, ఊర్లలోకి తిరిగి వస్తున్నారు.

పెద్ద ఎదురుబొంగుతో బొండా ఉమా , బుద్దా వెనకన్న కారు మీద దాడి చేసిన తురక కిషోర్ నుండి మొన్న పిన్నెల్లి వెంట కర్రలు, రాడ్లు పట్టుకొని స్వైర విహారం చేస్తూ పాల్గొన్న పావుల వెన్నులో చలి మొదలైంది. తాము నమ్ముకొన్న నాయకుడు ఈ సారి గెలిస్తే మంత్రి అవుతా అంటూ రెచ్చగొడితే రెచ్చిపోయాం,. తీరా ఇప్పుడు ఆయన తమ్ముడితో సహా పారిపోతే తమకెవరు దిక్కనే గుబులుతో.. తలో దిక్కు పరారవుతున్నారు.

ఇక గన్నవరం వంశీ నుండి.. ఎంతమంది చెప్పా పెట్టకుండా వెళ్లిపోయారో తెలియదు. అన్న వున్నాడా అని ఫోన్లు చేసి వాకబు చేసుకొంటూ బిక్కు బిక్కు మంటున్నారు అరాచక అనుచరగణం, రాష్ట్రం అంతా.

పెద్దిరెడ్డి నుండి జగన్ వరకు పార్టీ ఓడితే ఎంతమంది దేశం నుండి పరారవుతారో అనే అంతర్మథనం మొదలైంది వైకాపాలో. పుంగునూరులో ఈపాటికే పెద్దిరెడ్డికి పిన్నెల్లి గతి పట్టి ఉండేది. పొద్దున్నే టిడిపి ఏజెంట్లను కిడ్నాప్ చేసి, భయపెట్టాలనే మైండ్ గేము మొదలెట్టారు. అదే సమయంలో, ఏజెంట్ల భార్యలు వెళ్లి పోలింగ్ బూతులలో కూర్చొనేసరికి తెల్లబోయాడు పెద్దిరెడ్డి. ఖంగుతిని వెంటనే దూరంగా వదిలిపెట్టమని ఆదేశాలు ఇచ్చాడు.

వెబ్ క్యాస్టింగ్, గట్టిగా కూర్చున్న టిడిపి ఏజెంట్లతో.. ఏమాత్రం తన పాత ఎన్నికల పద్దతులు అమలుపరిచినా ఈపాటికి ఛేజింగ్లో వుండేవాడు. పార్టీ అధికారంలోకి రాదు, కనీసం తన పరువైనా దక్కించుకొందామని, మొట్టమొదటి సారిగా బూతు బూతూ తిరిగాడు భయంతో. కానీ పోలింగ్ ముగియగానే ఒక్క ట్రిప్పర్ గానీ, జెసిబి గానీ ఉంచకుండా చెన్నై పోర్టు ద్వారా ఆఫ్రికాకు పంపించేశాడు.

ఇక చెవిరెడ్డి తన తనయుడు చేసిన పనికి తల పట్టుకొన్నాడు. ఓడినా/గెలిచిస్మగ్లర్ విజయానందరెడ్డి సరేసరి. అటు అనంత తాడిపత్రిలో పెద్దా రెడ్డి నుండి పెద్ద జాబితా వుంది. ఇలా ఒకరా ఇద్దరా?.. అటు కుప్పం నుండి ఇటు శ్రీకాకుళం వరకు రెచ్చిపోయిన ప్రతి నాయకుడూ వైకాపా ఓటమి సరళి తెలవంగానే.. జూన్ 4న పరారవుతారు, తాము గెలిచినా ఓడినా.

బాగా సంపాయించిన అధికారులు, అనుచరులు కూడా అదే ఏర్పాట్లలో వున్నారు. సుమారు వందమందికి పైగా విదేశాలకు పరరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. విదేశాలకు వెళ్లేంత సంపాయించని వారు, దేశంలో ఏ మూలకు వెళ్లాలో.. కుటుంబాలను ఏమి చెయ్యాలో దిక్కుతోచకుండా వున్నారు. గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.

ప్రతి బాధితుడి మీదా అక్రమ కేసులు పెట్టి వేధించిన మానసిక బాధ వర్ణనాతీతం. ఆ కర్మ వదిలిపెట్టదు కదా. ఇప్పుడు వీరికి టొకెన్ వస్తుంది. అమరావతిలో అన్నదాతలను వేధించిన వారి నుండి.. వైజాగులో భూములను కొట్టేయడానికి వేధించబడిన బాధితుల వరకు పెద్ద జాబితానే వుంది.

పిన్నెల్లి బోణీతో వైనాట్ మన పరారీ అనే వణుకు మొదలైంది.

– సతీష్ మన్నేపల్లి

Leave a Reply