మట్టి గణపతి ముద్దు…ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వద్దు

తిరుపతి శ్రీ వరసిద్ధి వినాయక మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన “పార్వతీపుత్ర పర్యావరణ మిత్ర” కార్యక్రమంలో మేయర్ డా” శిరీష, అలాగే నిమర్జన కమిటీ సభ్యుల చేతుల మీదుగా మట్టి విగ్రహాలు చక్కగా భక్తిశ్రద్ధలతో తయారుచేసిన బాల బాలికలకు ప్రశంసాపత్రంతో పాటు ఓ మొక్క పురాణాలకు సంబంధించిన పుస్తకాలను బహుమతిగా ఇవ్వడం జరిగింది!

ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ… పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అందులో భాగంగా వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని సుమారు నగరంలోని వివిధ పాఠశాలల నుంచి వచ్చిన 1000 మంది చిన్నారుల చేతుల మీదుగా మట్టితో తయారుచేసిన వినాయక ప్రతిమలను స్వయంగా వారే తయారు చేసి ఇంట్లో పూజించే కార్యక్రమాన్ని గత కొన్ని సంవత్సరాలుగా కమిటీ నిర్వహించడం చిన్నారులను ప్రోత్సహించడం అభినందనీయం!

పర్యావరణ పరిరక్షణలో భాగంగా చిన్నారులచే చిట్టి గణపయ్యలను మట్టితో వివిధ రూపాలలో తయారు చేయించడం కారణంగా పిల్లలలో ఉన్న సృజనాత్మకమైనటువంటి శక్తి ఆవిష్కృతమవుతుంది!

పార్వతీ పుత్ర పర్యావరణ మిత్ర కార్యక్రమం ద్వారా స్కూల్ పిల్లలు చైతన్యవంతులై ప్లాస్టిక్ వాడకం కారణంగా జరిగే నష్టాన్ని గుర్తించి భవిష్యత్తులో ప్లాస్టిక్ రహిత సమాజానికి చేయూతనిస్తారని ఆశిస్తున్నాం!

పార్వతీ పుత్ర పర్యావరణ మిత్ర కార్యక్రమానికి సహకరించిన తిరుపతి నగరపాలక సంస్థ తుడా శ్రీ వరసిద్ధి వినాయక మహోత్సవ కమిటీ బృందానికి వివిధ పాఠశాలల నుంచి వచ్చిన ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు పిల్లలకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను!
“జై బోలో గణేష్ మహరాజ్ కీ జై”

– నవీన్ కుమార్ రెడ్డి
(ఐఎన్‌టీయుసి నాయకులు)
కమిటీ సభ్యులు

Leave a Reply