మన మోడీకి నోబెల్ శాంతి బహుమతి?

అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందిన నేతల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఖ్యాతి నోబెల్ ప్రైజ్ కమిటీకి కూడాs చేరింది.ఇటీవల నోబెల్ బహుమతి కమిటీ భారత్‌లో పర్యటించింది.

ఈ నేపథ్యంలో నార్వే నోబెల్ కమిటీ సభ్యులు ప్రధాని మోడీపై ప్రశసంల జల్లులు కురిపించడం నోబెల్ శాంతి బహుమతిపై ఆశలు రేకెత్తిస్తున్నాయి. నోబెల్ శాంతి బహుమతి విజేతను నిర్ణయించే ఈ కమిటీ డిప్యూటీ ఛైర్మన్ వ్యాఖ్యలతో రేసులో ప్రధాని మోడీ గట్టి పోటీ ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది.

నోబెల్ కమిటీ డిప్యూటీ లీడర్ అస్లే టోజే బుధవారం ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ప్రధాని మోడీకి తాను గొప్ప అభిమానినని వెల్లడించారు. నోబెల్ శాంతి బహుమతికి అతిపెద్ద పోటీదారు మోడీయేనని చెప్పారు. ప్రధాని మోడీ లాంటి శక్తివంతమైన నేతకు ప్రపంచంలో శాంతిని నెలకొల్పే అద్భుతమైన సామర్థ్యం ఉందని కితాబిచ్చారు.

పెద్ద యుద్ధాలను సైతం మోడీ తన నాయకత్వ ప్రతిభ, విశ్వసనీయతతో ఆపడానికి ప్రయత్నిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. దాంతో నోబెల్ శాంతి బహుమతి రేసులో ప్రధాని మోడీ గట్టిపోటీ ఇస్తారన్న వాదన మొదలైంది.

యుద్ధం ముఖ్యం కాదని భవిష్యత్తు అంతా శాంతితో ఉండాలని రష్యా, అమెరికా, చైనా లాంటి దేశాల అధినేతలతో ప్రధాని మోడీ చర్చలు జరిపారని అస్లే టోజే గుర్తుచేశారు. ప్రపంచంలో శాంతిని నెలకొల్పడానికి భారత్ చేస్తున్న ప్రయత్నాలను అభినందించారు. భారత్‌ను చూసి ప్రపంచదేశాలు ఎంతో నేర్చుకోవాలని, త్వరలోనే భారత్ సూపర్ పవర్‌గా అవతరించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అస్లే టోజే వ్యాఖ్యలతో నోబెల్ శాంతి బహుమతి ప్రధానికి దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.