– ఉద్యోగసంఘాలనేతల్ని గుప్పెట్లోపెట్టుకొని ఉద్యోగులనోట్లో మట్టికొట్టడానికి ప్రభుత్వం సిద్ధమైంది.
• కేబినెట్ నిర్ణయాలతో 71డిమాండ్లు పరిష్కారమయ్యాయంటున్న బండిశ్రీనివాసరావు, ఆ డిమాండ్లు ఏమిటో చెబితే బాగుంటుంది.
• వైసీపీప్రభుత్వం ఉద్యోగులకు చెల్లించాల్సిన రూ.7 వేలకోట్లను సంవత్సరానికి నాలుగువిడతల చొప్పున 2027వరకు చెల్లిస్తామంటున్నారు. ఇలా చెప్పడానికి ప్రభుత్వానికి సిగ్గుందా?
• ఉద్యోగుల బకాయిల్ని వచ్చేప్రభుత్వం చెల్లిస్తుందని చెప్పి తప్పించుకోవడం ఎంతవరకు సరైంది? కొత్త ప్రభుత్వం ఉద్యోగులబకాయిలు చెల్లించకపోతే వారి పరిస్థితి ఏమిటి?
• సీ.పీ.ఎస్ రద్దుచేస్తానన్నహామీని నిలబెట్టుకోలేని తన అసమర్థతను అంగీకరిస్తూ జగన్ ముఖ్యమంత్రిపదవికి రాజీనామాచేస్తాడా?
• ఉద్యోగుల జీతాలు, పెన్షన్లకు రూ.70వేలకోట్లు ఖర్చుపెడుతున్నట్టు సాక్షి మీడియా నెగిటివ్ గా ఎందుకు ప్రచారంచేస్తోంది? రివర్స్ పీఆర్సీపై సాక్షిమీడియా ఎందుకు స్పందించదు?
• ఈ ప్రభుత్వం ఉద్యోగుల్ని ఓటుబ్యాంక్ గా చూసినంతకాలం వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించదు.
– టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రెగ్యులర్, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి కేబినెట్ కొన్నినిర్ణయాలు తీసుకున్ననేపథ్యంలో, ఏపీ ఎన్జీవో అధ్యక్షులు బండి శ్రీనివాసరావు 71 డిమాండ్లకు పరిష్కారం లభించిందని చెప్పడం విచిత్రంగా ఉం దని, ముందు ఆ 71 డిమాండ్లుఏమిటో చెప్పాలని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు కోరారు. మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయనమాటల్లోనే…
“ ఉద్యోగులకు సంబంధించి అత్యంతకీలకమైన అంశం సీపీఎస్ రద్దు, దానిపై ఇప్పటికే ఉద్యోగులంతా మూకుమ్మడిగా తాము సీపీఎస్ కు బదులుగా ప్రభుత్వ మిచ్చే జీ.పీ.ఎస్ వద్దని, పాత విధానమైన ఓ.పీ.ఎస్సే కావాలన్నారు. ఎన్నికల కు ముందు ఈ ముఖ్యమంత్రి రాష్ట్రంలోని కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేస్తానన్నారు. కానీ ఇప్పుడు కేబినెట్ సమావేశంలో మాత్రం 2014 జూన్ నాటికి 5 ఏళ్లకాలపరిమితి చేసుకున్నవారిని మాత్రమే రెగ్యులరైజ్ చేస్తున్నట్టు నిర్ణయం తీసుకున్నారు. డీఏ, పీఆర్సీ బకాయిలు పెద్దసమస్యగా మారాయి. ఈ ప్రభుత్వం గతంలో ఉద్యోగులకు రివర్స్ పీ.ఆర్సీ రావడమే పెద్ద మైనస్.
ఆరివర్స్ పీ.ఆర్సీలో కూడా 2020 నుంచిమాత్రమే పీ.ఆర్సీ బెనిఫిట్ వచ్చింది. 5సంవత్సరాల పీ.ఆర్సీని రెండున్నర సంవత్సరాలు కుదించారు. దాదాపు 100నెలల డీఏలు రావాల్సి ఉంది. ప్రభుత్వం నుంచిఉద్యోగులకు రావాల్సిన డీఏలు, పీఆర్సీ బకా యిలు దాదాపు రూ.7వేలకోట్లు. ఆ 7వేలకోట్లను సంవత్సరానికి నాలుగువిడత ల్లో 2027వరకు చెల్లిస్తామంటున్నారు. ఇలా చెప్పడానికి ఈప్రభుత్వానికి సిగ్గుం దా? ఈప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిల్ని వచ్చేప్రభుత్వం చెల్లించాలా?
జగన్ ప్రభుత్వం ఉద్యోగులకు పెండింగ్ పెట్టిన డీఏ, పీఆర్సీ బకాయిల్ని రాబోయే ప్రభుత్వం ఎందుకు చెల్లిస్తుంది? కొత్తప్రభుత్వం చెల్లించకపోతే ఉద్యోగుల పరిస్థితి ఏమిటి?
ఇదేప్రభుత్వం గతంలో టీడీపీప్రభుత్వం చెల్లించాల్సిన రైతురుణమాఫీ సొమ్ముని కట్టకుండా ఎగ్గొట్టింది. గతప్రభుత్వ బకాయిల్ని తాముఎందుకు చెల్లిస్తామని, అది రాజకీయనిర్ణయమని అడ్డదిడ్డంగా మాట్లాడింది. అదేవిధంగా 2024లో రాబోయే కొత్తప్రభుత్వం ఈ ప్రభుత్వ బకాయిల్ని ఎందుకు చెల్లిస్తుందని ప్రశ్నిస్తున్నాం. ఈ ముఖ్యమంత్రికి ఉద్యోగుల డీఏలు, పీఆర్సీ బకాయిలు చెల్లించకపోతే, వచ్చే ప్రభుత్వం ఎందుకు చెల్లిస్తుందని ప్రశ్నిస్తున్నాం.
ఈ ప్రభుత్వ బకాయిల్ని రాబోయే ప్రభుత్వం చెల్లించకపోతే ఉద్యోగులపరిస్థితి ఏమిటి? దీనిపై ఉద్యోగసంఘాలనేత లు ఎందుకు మాట్లాడరు? 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీప్రభుత్వం, అంతకుముందున్న ప్రభుత్వాలు ఉద్యోగులకు బకాయిపెట్టిన రూ.4వేలకోట్లను 2016లో చెల్లించింది. గతంలో టీడీపీప్రభుత్వం ఉద్యోగులకు ఇవ్వాల్సిన దాన్ని పెండింగ్ పెట్టకుండా క్లియర్ చేసింది. వైసీపీప్రభుత్వంలాగా వచ్చేప్రభుత్వాలు చెల్లి స్తాయని చెప్పి తప్పించుకోలేదు.
సీపీఎస్ రద్దుచేస్తానన్న హామీని నిలబెట్టుకోలేనందుకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిపదవికి రాజీనామాచేస్తాడా?
సీపీఎస్ రద్దుచేస్తాననిహామీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి చేతగానితనాన్ని సమర్థి స్తూ సలహాదారుసజ్జల దానిగురించి తెలియక హామీ ఇచ్చారని మాట్లాడాడు. ఇప్పుడు ప్రభుత్వం ఇస్తామంటున్న జీ.పీ.ఎస్ వల్ల ఉద్యోగులకు ఒరిగేదేం లేదు. ఉద్యోగులు అంగీకరించకుండా ఏకపక్షంగా జీ.పీ.ఎస్ విధానం అమలుచేస్తామని నిర్ణయం ఎలా తీసుకుంటారు?
ఇచ్చినహామీలు అమలుచేయకపోతే వెంటనే రాజీనామాచేయాలని గతంలో జగన్ ప్రగల్భాలు పలికాడు. మరిప్పుడు సీపీఎస్ రద్దుచేయలేని తనఅసమర్థతకు బాధ్యతవహిస్తూ ఆయన రాజీనామాచేస్తాడా? కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ విషయంలోకూడా ప్రభుత్వంఇలానే మాట తప్పింది. 1/3 వంతు కాంట్రాక్ట్ ఉద్యోగులకుమాత్రమే లబ్ధికలిగేలా నిర్ణయం ఎం దుకు తీసుకున్నారో ప్రభుత్వం సమాధానంచెప్పాలి.
ఉద్యోగుల జీతాలు, పెన్షన్లకు రూ.70వేలకోట్లు ఖర్చుపెడుతున్నట్టు చెబుతున్న సాక్షి మీడియా, ఆ అంశాన్ని నెగిటివ్ గా ఎందుకు ప్రచారంచేస్తోంది?
ఏపీలోజీతాలు, పెన్షన్ బిల్లులు ఎక్కువని వైసీపీ కరపత్రిక సాక్షిలో దుష్ప్రచారం చేస్తున్నారు. జీతాలు, పెన్షన్లకు రూ.70వేలకోట్లు ఖర్చుపెడుతున్నట్టు సాక్షి మీడియా చెబుతోంది. డీ.బీ.టీ అమల్లో ఏపీ నెంబర్-1స్థానంలో ఉందని పత్రికల్లో ప్రచారంచేసుకుంటున్నారు కదా! అలానేఉద్యోగుల జీతాలు పెన్షన్లు ఏపీలోనే ఎక్కువని, మాప్రభుత్వం మంచిజీతాలు ఇస్తోందని ఎందుకు ప్రచారంచేయడం లే దు? నెగిటివ్ గా ఎందుకు ప్రచారంచేస్తున్నారు? ఉద్యోగులకుఇచ్చిన రివర్స్ పీ. ఆర్సీ సంగతేమిటి? న్యాయమైన డిమాండ్లకోసం ఉద్యోగులు ఉద్యమంచేస్తే, ఉద్యోగ సం ఘనేతలు వారిపోరాటాన్ని సద్వినియోగంచేసుకోలేకపోయారు.
ఈ ప్రభుత్వం ఉద్యోగుల్ని ఓటుబ్యాంక్ గా చూసినంతకాలం వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించదు
ఉద్యోగుల్ని ఓటుబ్యాంకుగా చూసినంతకాలం ఈప్రభుత్వం వారిన్యాయమైన డిమాండ్లను పరిష్కరించలేదు. గ్రామసచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థను ఎవరు అడిగితే ప్రభుత్వం ఏర్పాటుచేసింది. వారికిచ్చే జీతభత్యాలతో ప్రభుత్వ చెల్లింపులు ఎక్కువైతే, దానిలో ఉద్యోగులకుఇచ్చే జీతాలు, పెన్షన్లను ఎలా లెక్కి స్తారు? ఉద్యోగుల్ని దోషులగా చూపడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే, కొన్ని మీడియాసంస్థలు ప్రభుత్వానికి ఒత్తాసుపలుకుతున్నాయి. ఇవన్నీ ప్రశ్నిస్తున్న కొందరు ఉద్యోగసంఘం నేతల్ని ప్రభుత్వం కేసులతో వేధిస్తోంది. దానికి ఉదాహర ణ ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు కే.ఆర్.సూర్యనారాయణ.
గతంలో ఇదేసూర్యనారాయణ తెలుగుదేశం ప్రభుత్వంపై పోరాడాడని, వైసీ పీ అధికారంలోకి రాగానే ఆయన్ని అక్కునచేర్చుకుంది. ఇప్పుడు ఇదే ప్రభుత్వం ఆయనపాలిట భస్మాసురహస్తంగా మారింది. కమర్షియల్ ట్యాక్సెస్ చెల్లింపుల్లో భారీగా అవకతవకలు జరుగుతున్నాయి. విజయవాడకేంద్రంగా పెద్దమాఫియా నడుస్తోంది. ఆ వ్యవహారాన్ని కట్టడిచేయలేని ప్రభుత్వం సూర్యనారాయణను అడ్డంపెట్టుకొని నాటకాలు ఆడుతోంది.
సూర్యనారాయణ నిజంగా ఎక్కడున్నాడో ప్రభుత్వానికి తెలియదా? సూర్యనారాయణ విషయంలోప్రభుత్వం నాటకాలు ఆ డుతోంది. మెహర్ అనే వ్యక్తిని గతంలో గుంటూరుకు బదిలీచేస్తే, ఈప్రభుత్వం మరలా అతన్నివిజయవాడకు ఎందుకు తీసుకొచ్చింది? ఉద్యోగుల్ని వంచించ డానికి ప్రభుత్వం కావాలనే, కొందరు భజనపరుల సాయంతో డ్రామాలు ఆడుతోం ది. రూ.7వేలకోట్ల డీఏ, పీఆర్సీ బకాయిల్లో ఈ ప్రభుత్వం చెల్లించేది ఒక్క వాయిదా సొమ్ముమాత్రమే. తరువాత వచ్చేప్రభుత్వం గతప్రభుత్వం పెట్టిన బకాయిల్ని తాము చెల్లించలేమంటే ఉద్యోగుల పరిస్థితి ఏమిటి? అంతిమంగా ఉద్యోగుల నోట్లో మట్టికొట్టడానికే ఈప్రభుత్వం సిద్ధమైంది.
కేబినెట్లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ఏ ఉద్యోగి హర్షించడంలేదు
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ఏఉద్యోగి హర్షించడంలేదు. కేవలం ఉద్యోగసం ఘాలనేతలే పాలకులకు బాకా ఊదుతున్నారు. 12వ పీఆర్సీ కమిషన్ వేస్తే ఉద్యోగులకు ఒరిగేదేమిటి? గతంలో టీడీపీప్రభుత్వం వేసిన11వ పీఆర్సీ కమిషన్ నివేదికను ఇంతవరకు ఈ ప్రభుత్వం ఎందుకు బయటపెట్టలేదు? తమ భవిష్యత్ అగమ్యగోచరంగా మారిందన్న ఆందోళనఉద్యోగులందరిలో ఉంది. కానీవారికి సరైన నాయకత్వంలేకపోవడంతో ఏంచేయాలో తెలియనిపరిస్థితిలో ఉన్నారు. ఉద్యోగసంఘాలనేతల్నిభయపెట్టి, ప్రలోభపెట్టి, తాయిలాలతో ఆకర్షించి ప్రభుత్వం నెట్టుకొస్తుందని ఉద్యోగులు ఇప్పటికే గ్రహించారు. సూర్యనారాయణ సంఘం బాగోతాలపై ప్రభుత్వం ఎప్పుడో చర్యలుతీసుకొని ఉండాల్సింది.
సంవత్సరం క్రిత మే ప్రభుత్వంస్పందించి ఉంటే వందలకోట్లు దారిమళ్లేవికావు. ఉపాధ్యాయుల బ దిలీల్లో కూడా ఈప్రభుత్వం న్యాయంచేయలేకపోతోంది. ఇన్ని అస్తవ్యస్త విధానాలు అనుసరిస్తున్న ప్రభుత్వాన్నిఇప్పుడే చూస్తున్నాం. ఉద్యోగుల్ని నెగటివ్ గా చూపే ప్రయత్నంచేస్తున్న సాక్షిమీడియా ప్రచారంపై ఉద్యోగసంఘంనేతలు నోరు విప్పాలి. ఈ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయఅవినీతి ఎక్కడాలేదు. తెలుగుదే శం ప్రభుత్వంలో ఉద్యోగులకు వ్యక్తిగతనష్టం ఎప్పుడూ జరగలేదు. 4వేలకోట్ల పీ ఆర్సీ బకాయిలు టీడీపీప్రభుత్వం ఇస్తే, జగన్మోహన్ రెడ్డి రివర్స్ పీఆర్సీ ఇచ్చాడు .
ఈ ప్రభుత్వాన్ని ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు అనడానికి ఇటీవలి ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలే నిదర్శనం. అలానే ప్రభుత్వానికి ఆదాయంవచ్చే శాఖల్లో మాఫియాలు తిష్టవేసి, ఖజానాకు రావాల్సిన ఆదాయాన్ని కాజేస్తున్నాయి. దీని పై కూడా ప్రభుత్వం ఎలాంటిచర్యలు తీసుకోవడంలేదు. ఉద్యోగసంఘం నేతలు ఇప్పటికైనా తమబానిసత్వసంకెళ్లను తెంచుకొని ఉద్యోగులతరుపున పోరాడాలి.” అని అశోక్ బాబు తేల్చిచెప్పారు.