– ప్రజల కోసం కాపలా కుక్కలా ఉంటా
-ఆపేసే చరిత్ర వాళ్లది..పనులు చేసే చరిత్ర మాది
-కార్యకర్తల సమావేశంలో కడియం పై మండిపడ్డ జనగామ ఎమ్మెల్యే పల్లా
జనగామ: స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పై జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జనగామ మండల కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు..“పక్కన ఉన్న వాళ్లేమీ చేయలేదు. ఉన్న పనులన్నీ ఆపేశారు,” అంటూ ఘాటుగా విమర్శలు గుప్పించారు..
ఘన్‌పూర్‌కు మున్సిపాలిటీ వస్తే ఆపేసారు, డిగ్రీ కాలేజీ ఆపేసారు, లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేసారు, 100 పడకల ఆస్పత్రిని ఆపేశారు. నవాబ్‌పేటకు లైనింగ్ వస్తే దాన్ని కూడా ఆపేశారు. ఆపేసే చరిత్ర వాళ్లది.. పనులు చేయడమనే చరిత్ర మనది,” అంటూ మండిపడ్డారు. ఇటీవల తనను “బొచ్చు కుక్క” అనేలా మాట్లాడిన కడియంను పల్లా గట్టిగానే తిప్పికొట్టారు. “అవును నేను కుక్కనే..నా ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే, వారిని కాపాడేందుకు కాపలా కుక్కగా ఉంటాను. నీలాగా గుంట నక్కను మాత్రం కాదు,” అని పల్లా స్పష్టంగా చెప్పారు.
అటవీ భూములపై జరుగుతున్న ఆక్రమణల గురించి కూడా స్పందించారు.ముసలితనానికి అటవీ భూముల మీద కన్నేస్తున్నారు. ఒకరిపై 25 ఎకరాలు, మరొకరిపై మరో 25 ఎకరాలు ఆ భూములను కాపాడటానికి నేను రేసు కుక్కలా ఉంటానానని హెచ్చరించారు. కేసీఆర్ కి, బీఆర్ఎస్ పార్టీకి విశ్వాసం ఉన్న కుక్కను. ప్రజలను కాపాడటంలో ఎప్పుడూ ముందుండే లక్షణాలు నాకు ఉన్నాయి. నిన్ను ఎదుర్కొనే గుణాలు కూడా నా వద్ద ఉన్నాయంటూ చివర్లో కడియంకు గట్టి హెచ్చరిక చేశారు. ఎవరు ఏమి చేస్తున్నారో ప్రజలకు బాగా తెలుసు. ప్రజల పక్షాన అడుగడుగునా నేనున్నా,” అని పల్లా స్పష్టం చేశారు.