Suryaa.co.in

Andhra Pradesh

నాకు లాస్ట్ చాన్స్ కాదు….రాష్ట్రానికి లాస్ట్ చాన్స్

– ఇప్పుడు కూడా మీరు నా మాట వినకపోతే రాష్ట్రానికి ఇదే ఆఖరి చాన్స్
– జగన్ ఏంటో అర్ధం కావడం లేదు….ప్రతి దానికీ నవ్వుతాడు.
– కష్టంలో ఉన్న వారి దగ్గరా నవ్వుతాడు…..చనిపోయిన దగ్గరకు వెళ్లి నవ్వుతాడు
– ఇలాంటి వ్యక్తి కి సీఎం స్థానంలో ఉండే అర్హత ఉందా? ఏంటి ఈ ఖర్మ మన రాష్ట్రానికి?
– పోలవరం, అమరావతి ఆపేస్తాడు అని ఆ నాడే చెప్పాను. కానీ నామాట వినలేదు
– ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం విజయరాయిలో ప్రారంభించిన టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు
– విజయరాయి గ్రామంలో పలువురి ఇళ్లకు వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకున్న చంద్రబాబు నాయుడు
– ఏలూరు జిల్లా పర్యటనకు వచ్చిన పార్టీ అధినేతకు అడుగడుగునా ఘన స్వాగతం పలికిన కార్యకర్తలు, ప్రజలు
– తనకు ఘనమైన స్వాగతం పలికిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన చంద్రబాబు

రోడ్ షోలో చంద్రబాబు నాయుడు ఇంకా ఏమన్నారంటే..

•స్థానిక ఎమ్మెల్యే ను లండన్ బాబు అంటూ విమర్శలతో ప్రసంగం మొదలు పెట్టిన చంద్రబాబు
• తన పర్యటనకు అడ్డంకులు సృష్టించేందుకు ప్రయత్నించారంటూ దెందులూరు ఎమ్మెల్యేపై చంద్రబాబు విమర్శలు
•ఇలాంటి వేషాలు వేస్తే లండన్ బాబును మళ్లీ లండన్ పంపుతాము అంటూ చంద్రబాబు వ్యాఖ్యలు
•ధరల పెరుగుదలపై బాదుడే బాదుడు నిర్వహించాం…ఇప్పుడు ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమం ప్రారంభించాం
• జగన్ మోహన్ రెడ్డి పెద్ద అబద్దాల కోరు.
• వివేకా హత్య ను గుండెపోటు అని డ్రామాలు అడాడు. తరువాత నేను చంపాను అని చెప్పాడు.
• జగన్ సిఎం అయిన తరువాత వివేక హత్యపై సీబీఐ వద్దు అని కోర్టును కోరాడు.
• తండ్రి హత్య పోరాడుతున్న సునీతారెడ్డిని చాలా ఇబ్బంది పెట్టారు.
• వివేకా హత్య కేసులో సిబిఐ విచారణను తీవ్రంగా అడ్డుకున్నారు. దీంతో సునీత రెడ్డి సుప్రీం కోర్టుకు వెళ్లింది
• సునీత పోరాటంతో వివేక కేసును సుప్రీం కోర్టు తెలంగాణ రాష్ట్రానికి పంపింది.
• వైసిపి నేతలు కూడా ఇలా బాబాయ్ లను చంపేస్తారా…..స్థానిక ఎమ్మెల్యే విద్యావంతుడే కదా…సమాధానం చెప్పాలి
• సుప్రీం కోర్టు తీర్పు జగన్ కు చెంప పెట్టు. సిఎం దీనికి సమాధానం చెప్పాలా వద్దా….?
• రాష్ట్రాన్ని పరిపాలించడానికి అర్హత ఉందా….సమధానం చెప్పలేకపోతే సిఎం పదవికి రాజీనామా చెయ్యి!babu1• ఇలాంటి వ్యక్తి కి సీఎం స్థానంలో ఉండే అర్హత ఉందా….ఏంటి ఈ ఖర్మ మన రాష్ట్రానికి!
• పోలవరం, అమరావతి ఆపేస్తాడు అని ఆ నాడే చెప్పాను. కానీ నామాట వినలేదు.
• జగన్ ను నమ్మి నాడు ఓట్లు వేశారు.
• ఇప్పుడు కూడా మీరు నా మాట వినకపోతే రాష్ట్రానికి ఇదే ఆఖరి చాన్స్.
• నాకు లాస్ట్ చాన్స్ కాదు….రాష్ట్రానికి లాస్ట్ చాన్స్.
నాకు ముఖ్యమంత్రి, ఎమ్మేల్యే పదవులు కొత్త కాదు
• 16 లక్షల మంది ఇచ్చే పథకాన్ని 10 లక్షలకు కుదించి విద్యా దీవెన అని జగన్ పెద్ద సభ పెట్టాడు. దానికి అందరినీ తరలించి హడావుడి చేస్తున్నారు.
• తెలుగు దేశం మీటింగ్ కు వెళితే పథకాలు ఆపేస్తాము అని ప్రజలను బెదిరిస్తున్నారు.
• టిడిపి సభకు వెళితే తనకు ఇచ్చిన ఇంటి స్థలం తీసేస్తా అని చెప్పి బెదిరించినా… ఓ మహిళ నేను చంద్రన్న సభకు వస్తాను అని చెప్పి మరీ వచ్చింది. అదీ తెగువ.
అందరిలో అలాంటి తెగింపు రావాలి.
• పట్టిసీమ ద్వారా 130 టిఎంసిల నీరు కృష్ణా డెల్టాకు ఇచ్చాము
• పోలవరం పనులు 72 శాతం పూర్తి చేశాము
• కొత్తగా ఇరిగేషన్ శాఖకు వచ్చిన మంత్రికి పోలవరం డయాఫ్రం వాల్ ఎక్కడ ఉంటుందో తెలియదు.
• ప్రతినెలా పోలవరం వచ్చాను…ప్రతి వారం రివ్యూ చేశాను. 72 శాతం పూర్తి చేశాను.
• రివర్స్ టెండర్ అని పోలవరాన్ని గోదావరిలో ముంచేశారు.
• డబ్బుల కోసం కాంట్రాక్టర్లను మార్చారు.
• మూడున్నరేళ్లు అయ్యింది….ఇప్పటికి ప్రాజెక్టు పరిస్థితి ఏంటో చెప్పలేని స్థితిలో ప్రభుత్వం ఉంది.
•పోలవరం నిర్వాసితులకు పునరావాసం ఇవ్వలేదు…..ప్యాకేజీ ఇవ్వలేదు
• రాష్ట్రానికి ఇదేం ఖర్మ అని అందుకే అడుగుతున్నా….
• రాష్ట్రంలో అన్ని సమస్యలకు నేనే కారణం అంటున్నారు…అసత్యాలు చెపుతున్నారు.
• ఇంట్లో భార్యా భర్తలు కాపురం చెయ్యకపోయినా నేనే కారణం అంటున్నారు.
• నేను వైసిపి నేతల్లా బూతులు మాట్లాడలేను.
• ఇక్కడ ఉండే ఎమ్మెల్యే లండన్ బాబు ఎందుకు చింతల పూడి ప్రాజెక్టు గురించి తమ సిఎంను అడగరు.
• అదే స్థానంలో చింతమనేని ఉండి ఉంటే ప్రాజెక్టు కోసం నన్ను అడిగేవారు
• పామాయిల్ ను ప్రోత్సహించింది…మద్దతు ధర ఇచ్చింది తెలుగు దేశం పార్టీ నే
• జగన్ సిఎం అయ్యాక ఒక్క సారి అయినా ఒక్క పొలంలోకి వచ్చాడా….ఒక్క రైతుతో మాట్లాడారా
• గోదావరిలో రెండు పంటలకు నీళ్లు ఇచ్చిన ఘనత ఎన్టీర్ కే దక్కుతుంది.
• పోలవరం, చింతలపూడి పూర్తి చేసి నీటి ఎద్దడి లేకుండా చేసే ప్రయత్నం చేశాము
• ధాన్యం రైతులకు మద్దతు ధర లభించడం లేదు.
• సాగు కష్టాలతో రాష్ట్రంలో ఒక్కో రైతుపై రూ.2.74 లక్షల రూపాయాలు అప్పు పేరుకుపోయింది.
• రైతుల మోటార్లకు మీటర్లుపెడితే ఎందుకు సహించాలి…మీటర్లు రైతుల మెడకు ఉరితాళ్లు
• చింతమనేని ప్రభాకర్ పై 29 కేసులు….అందులో 15 అట్రాసిటీ కేసులు పెట్టారు.
• నేను అనుకుని ఉంటే వైసిపి వాళ్లు తిరగగలరా!
• జగన్ కు పోలీసులు ఉంటే నాకు ప్రజలు ఉన్నారు.
• మీరు ఒక్క దెబ్బ వెయ్యాలి అనుకుంటే…..ప్రజలు మీ బట్టలు విప్పేస్తారు.
• రాష్ట్రంలో అభివృద్ది పూర్తిగా ఆగిపోయింది.
• విద్యార్థులకు స్కాలర్ షిప్ లు ఇవ్వడం అనేది సాదారణం…దాన్ని కూడా పథకంలా జగన్ ప్రచారం చేసుకుంటున్నాడు
• సాక్షిలో వీటికి కూడా ప్రకటనలు ఇచ్చుకుంటున్నాడు.
• నాడు నేడు అని రంగులు కొట్టాడు కానీ పిల్లలకు చదువులు చెప్పాలి అనే ఆలోచన లేదు. ప్రమాణాలు పడిపోయాయి.
• రాష్ట్రంలో 6 వేల స్కూళ్లు మూసేసారు….అందుకే ఇదేం ఖర్మ రాష్ట్రానికి అంటున్నాను.
• నాడు నేను ఐటీ రంగం లో వేసిన ఫౌండేషన్ తో రైతు బిడ్డ లు ప్రపంచం అంతా విస్తరించారు.
• జగన్ వాలంటీర్ ఉద్యోగం ఇచ్చాడు. చదువుకున్న పిల్లలు మటన్ కొట్లో, ఫిష్ మార్కెట్ లో ఉద్యోగం చెయ్యడం ఖర్మ కాదా?
• రాష్ట్రంలో ఉపయోగపడని ఆరోగ్య శ్రీని తగలబెట్టమని జగన్ కు సూచిస్తున్నా?
• ప్రజల జీవన ప్రమాణాలు దారుణంగా పడిపోయాయి.
• జగన్ ఇచ్చేది 10 రూపాయాలు దోచేది 100 రూపాయాలు
• మంచి పరిపాలన అంటే మీ జీవితాలు బాగుండాలి కదా…ఆదాయం పెరిగిందా? ఖర్చులు పెరిగాయా?
• ప్రజల ఆదాయం పెరగలేదు కానీ….అప్పులు పెరిగాయి
• జగన్ మోహన్ రెడ్డిది దరిద్రమైన పాలన. విభజన కంటే ఎక్కువ నష్టం చేసిన పాలన జగన్ రెడ్డిది
• పోలవరం పూర్తి చేస్తే రైతులు బాగుపడితే అదీ అభివృద్ది…
• పంటకు మద్దతు ధర వస్తే అదీ అభివృద్ది.
• గిరిజన కుటుంబాలకు విద్యా ఆరోగ్యం లభిస్తే అదీ అభివృద్ది.
• దళితుల పిల్లలకు ఇక్కడే ఉద్యోగాలు ఇప్పిస్తే అదీ అభివృద్ది
• అమరావతి నిర్మించి పెట్టుబడులు తీసుకువస్తే అభివృద్ది
• సోషల్ మీడియాలో పోస్టు పెడితే పోలీసులు గోడలు దూకి ఇంట్లోకి వస్తారు.
• కానీ బాబాయి హత్య కేసులో మాత్రం పోలీసులు పని చెయ్యరు.
• దొంగ చేతికి తాళం ఇచ్చినట్లు….నేరస్తుడి చేతికి రాష్ట్రాన్ని ఇచ్చారు.
• కొందరు పోలీసులు తప్పుడు మార్గం పట్టారు. ఒత్తిళ్లకు తలొగ్గి వారు తప్పులు చేస్తున్నారు.
• మాట వినని పోలీసులను బదిలీ చేస్తున్నారు. దీంతో మనసు చంపుకుని పోలీసులు పని చేస్తున్నారు.
• అందుకే ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అని అడుగుతున్నా
• రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు. ఆస్తులు తాకట్టు పెట్టి అప్పులు తెస్తున్నారు.
• రాష్ట్రంలో ఇసుక దొరుకుతుందా..ఇసుక ఎటుపోతుంది
• ఇక్కడ ఎమ్మెల్యే లండన్ బాబు ఏం చెప్పాడు..అందరికీ ఐటీ ఉద్యోగాలు ఇప్పిస్తా అన్నాడు.
• కానీ ఆయన, ఆయన తండ్రి కలిసి ఇసుక దొంగ వ్యాపారం చేసుకుంటున్నారు.
• తమ్మిలేరు లో ఇసుక, పోలవరం కాలువ గట్లలో మట్టి దోచేస్తున్నారు.
• రాష్ట్ర పరిస్థితులు చూస్తుంటే భస్మాసురుడు గుర్తువస్తున్నాడు
• భస్మాసురుడి మాటలు నమ్మి భోళా శంకరుడు భస్మాసురుడికి వరం ఇచ్చాడు
• ఆ వరాన్ని శంకరుడిపైనే ప్రయోగించే ప్రయత్నం చేశాడు భస్మాసురుడు
• అప్పుడు విష్ణుమూర్తి మోహిని వేషంలో వచ్చి భస్మాసురుడిని అంతం చేశాడు.
• నాడు మీరు కూడా అలాగే జగన్ ముద్దులకు, మాటలకు మోసపోయారు
• భస్మాసురుడులా జగన్ ఇప్పుడు అందరి నెత్తిన భస్మాసుర హస్తం పెడుతున్నాడు
• నేను వస్తే సంక్షేమ కార్యక్రమాలు ఆపేస్తాను అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
• నేను సంక్షేమం ఆపను…సంపద సృష్టించి మెరుగైన సంక్షేమం ఇస్తాను
• ప్రజలకు మంచి ఇళ్లు కట్టించి ఇస్తా.
• జగన్ 96 శాతం మ్యానిఫెస్టో హామీలు నెరవేర్చితే ప్రజలకు ఇన్ని కష్టాలు ఎందుకు?
• జగన్ నంగి నంగి మాటలు ఆపాలి.
• జగన్ ఏంటో అర్ధం కావడం లేదు….ప్రతి దానికీ నవ్వుతాడు.
• కష్టంలో ఉన్న వారి దగ్గరా నవ్వుతాడు…..చనిపోయిన దగ్గరకు వెళ్లి నవ్వుతాడు
• ఇదేమి సైకో తీరో నాకు అర్థం కావడం లేదు
• ప్రభుత్వంపై పోరాడడానికి యువత, మహిళలు, రైతులు..అన్ని వర్గాల ప్రజలు ముందుకు రావాలి
• అన్ని వర్గాలను జగన్ నాశనం చేశాడు. చివరికి సినిమా హీరోలను బెదిరించిన విలన్ జగన్
• ఇదేం ఖర్మ అనిపించే ఈ ప్రభుత్వం పోవాలి అంటే క్విట్ జగన్….సేవ్ ఆంధ్ర ప్రదేశ్ అని పోరాడాలి.

LEAVE A RESPONSE