సభను అడ్డుకోవడం మంచి పద్దతి కాదు

– మండలి ఛైర్మన్‌ మోషేను రాజు

టీడీపీ సభ్యులు సభను అడ్డుకోవడం మంచి పద్దతి కాదని శాసన మండలి ఛైర్మన్ మోషేన్‌ రాజు అన్నారు. జంగారెడ్డిగూడెం మరణాలపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి స్టేట్ మెంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారన్నారు. ప్రభుత్వం చెప్పింది ముందు వినాలని, ఆ తర్వాత అభ్యంతరాలుంటే తెలపాలని మండలి ఛైర్మన్‌ మోషేన్‌రాజు పదే పదే చెప్పిన టీడీపీ ఎమ్మెల్సీలు పట్టించుకోలేదు.

టీడీపీ సభ్యుల తీరును తప్పుబట్టిన మంత్రి బొత్స సత్యనారాయణ : శాసనమండలిలో సభా కార్యక్రమాలకు టీడీపీ సభ్యులు పదేపదే అడ్డుపడుతూ గందరగోళం సృష్టిస్తున్నారు. టీడీపీ సభ్యుల తీరును మంత్రి బొత్స సత్యనారాయణ తప్పుబట్టారు.

టీడీపీకి ప్రజాసమస్యలు పట్టవు : మంత్రి బొత్స సత్యనారాయణ
టీడీపీకి ప్రజా సమస్యలు పట్టవని మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనమండలిలో ఆయన మాట్లాడుతూ టీడీపీ సభ్యులు గందరగోళం సృష్టించి ప్రజా సమస్యలను పక్కదోవ పట్టిస్తున్నారని మంత్రి బొత్స మండిపడ్డారు.

సున్నా వడ్డీ పథకం ద్వారా 88,00, 626 సభ్యులకు లబ్ది: పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 98,00, 626 మంది స్వయం సహాయక సంఘాల సభ్యులు సున్నా వడ్డీ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఏపీ ప్రభుత్వం రెండు ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి(2019-20, 21-22) 9,41,088 సంఘాల్లోని 88,00,626 సభ్యుల కోసం 2354 కోట్ల 22 లక్షలను రెండు విడతల్లో ఖర్చు చేసినట్లు తెలిపారు.

వృత్తిపరమైన వర్గాలను ఆర్థికంగా ఆదుకున్నాం : చెల్లు బోయిన వేణు గోపాల కృష్ణ
వైఎస్సార్‌ నేతన్న నేస్తం, వైఎస్సార్‌ మత్స్యకార భరోసా, వైఎస్సార్‌ వాహన మిత్ర, జగనన్న చేదోడు, జగనన్న తోడు పథకాల ద్వారా వెనుకబడిన తరగతులవారికి ఆర్థిక సాయం చేస్తున్నామని బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ శాసన సభలో చెప్పారు.2019-20 ఆర్థిక సంవత్సరం నుంచి 2021-22 వరకు వృత్తిపరమైన వర్గాలకు చెందిన సుమారు 11 లక్షల 73 వేల 18 మంది లబ్దిదారులకు 2,272.31 కోట్ల రూపాయలు వినియోగించామని తెలిపారు.

బీసీలకు నవరత్నాల కింద ఆర్థిక సాయం : వెనుకడిన తరగతులు, చేతివృత్తులవారి సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం 2019-20 ఆర్థిక సంవత్సరం నుంచి నవరత్నాల కింద వివిధ ఆర్థిక సహాయ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందని బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ శాసన సభలో చెప్పారు.

ఏపీలో అమలవుతున్న పథకాలు దేశంలో ఎక్కడా లేవు : మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్
పార్టీలు, కులాలు, మతాలకతీతంగా లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ అన్నారు. ప్రతి సంక్షేమ పథకాన్ని ఇంటివద్దే ప్రభుత్వం అందిస్తోందన్నారు. ఏపీలో అమలవుతున్న పథకాలు దేశంలో ఎక్కడా లేవన్నారు. ఆరోగ్యశ్రీ వంటి పథకాలతో పేదలకు అండగా ప్రభుత్వం ఉందని మంత్రి బుగ్గన పేర్కొన్నారు.

టీడీపీ హయాంలో అన్నీ వెన్నుపోటు పథకాలే
ప్రశ్నలకు సమాధానాలు వినే ఓపిక కూడా టీడీపీ సభ్యులకు లేదని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ ధ్వజమెత్తారు. ప్రతిపక్షం లేవనెత్తే అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెబుతామని ఆయన అన్నారు. టీడీపీ హయాంలో అన్నీ వెన్నుపోటు పథకాలేనని మంత్రి బుగ్గన దుయ్యబట్టారు.

Leave a Reply