Home » మెరుగైన సమాజం కోసం కాదు.. మెరుగైన సంపద కోసమే టీవీ-9 రజనీకాంత్ జగన్ రెడ్డికి బానిసత్వం చేస్తున్నాడు

మెరుగైన సమాజం కోసం కాదు.. మెరుగైన సంపద కోసమే టీవీ-9 రజనీకాంత్ జగన్ రెడ్డికి బానిసత్వం చేస్తున్నాడు

• టీవీ-9 ముసుగులో రజనీకాంత్.. చంద్రబాబు, లోకేశ్ లను, వారికుటుంబాన్ని బదనాం చేస్తుంటే.. మహాసేన రాజేశ్ ఆ తప్పుడు ప్రచారాన్ని వాస్తవాలతో ఖండించాడని అతనిపై తప్పుడు కేసులు పెట్టారు
• జగన్ రెడ్డి లాంటి విషసర్పాలతో పోరాడుతున్న టీడీపీ రజనీకాంత్ లాంటి పిల్లపాములకు భయపడుతుందా?
– టీడీపీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు

ప్రజలపై… తెలుగుదేశం పార్టీ నేతలపై తప్పుడు కేసులు పెట్టడం జగన్ రెడ్డికి.. అతని ప్రభుత్వానికి పరిపాటిగా మారిందని, సైకోరెడ్డి బాటలోనే కొన్ని మీడియాసంస్థలు.. ముఖ్యంగా హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తూ జగన్ రెడ్డికి ఊడిగం చేస్తున్న టీవీ-9 రజనీకాంత్ లాంటి వారు నడుస్తున్నారని టీడీపీ అధికారప్రతినిధి పిల్లి మాణిక్యరావు తెలిపారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే …

“ గతంలో టీవీ-9 తెలుగు న్యూస్ ఛానల్ ప్రజలపక్షాన నిలిచి, ప్రజల గొంతుకగా మారితే, నేడు జగన్ రెడ్డి గొంతుకగా పనిచేస్తోంది. 2019లో ముఖ్యమంత్రి అయిన వెంటనే జగన్ రెడ్డి పనితనం.. ఆయన ప్రభుత్వ పనితీరు నెలరోజల్లోనే ఏపీప్రజలకు అర్థమైంది. ప్రజలు గ్రహించిన వాస్తవాల లోతుల్లోకి వెళ్లి ప్రజల మనస్సాక్షిగా మారాల్సిన టీవీ-9 ఛానల్ సాక్షి-2 గా మారింది. ఏపీలో అధికారం తనకే వచ్చినట్టు ఫీలైపోయిన రజనీకాంత్.. వైసీపీ పెంపుడు కుక్కలకంటే అధికంగా ప్రజలపైనే మొరగడం మొదలెట్టాడు.

జగన్ అవినీతి ఛానల్, విషపు పత్రిక సాక్షిలో వైఎస్ చిత్రం కనిపిస్తుంది. సాక్షి మీడియా వాస్తవాలను కప్పిపుచ్చి ప్రజల్ని ఏమార్చేలా దుష్ప్రచారం చేయడంలో మంచి పేరుప్రఖ్యాతులు పొందిందనే నిజం ప్రపంచానికే అర్థమైంది. మంచిని దాచి చెడుని ప్రచారం చేయడం.. జగన్ రెడ్డి దుర్మార్గాలు దాచి, అతనో గొప్ప నాయకుడన్నట్టు చిత్రీకరించడంలో సాక్షి మీడియా రాటు తేలిపోయింది. అలాంటి సాక్షి మీడియాకు తామేమీ తీసి పోము.. సాక్షికంటే రెండాకులు ఎక్కువే చదివాము అన్నట్టు టీవీ-9 వ్యవహరిస్తోంది.

జగన్ రెడ్డి ప్రభుత్వంలో దళితులు..ఇతర వర్గాలపై జరుగుతున్న దారుణాలు, దుర్మార్గాలపై రజనీకాంత్ ఏనాడూ స్పందించలేదు

రాష్ట్రంలో జగన్ రెడ్డి ప్రభుత్వంలో జరుగుతున్న హత్యలు.. అత్యాచారాలు.. అవినీతి.. దోపిడీ టీవీ-9 రజనీకాంత్ కు ఎందుకు కనిపించడం లేదు? ఏపీలో జరుగుతున్న దారుణాలపై ఏనాడైనా టీబీ-9 రజనీ కాంత్ మాట్లాడారా? డాక్టర్ సుధాకర్ని పిచ్చివాడిని చేసి చంపేసినప్పుడు, డాక్టర్ అచ్చెన్నను వైసీపీనేతలు వేధించి, హింసించి చివరకు అతను ఆత్మహత్యకు పాల్పడేట్టు చేసినప్పుడు.. టీవీ-9 ఎందుకు వాస్తవాలు ప్రజల ముందు ఉంచలేదు? ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ప్రభుత్వంలో దళితులపై జరిగిన దారుణాలు.. దుర్మార్గాలు అనేకం.. కానీ ఏనాడూ ఏ ఒక్క ఘటనపై కూడా టీవీ-9 మానవతా ధృక్ఫ థంతో స్పందించలేదు. జగన్ రెడ్డి అండతో అతని కార్యకర్తలు.. అతని సామాజికవర్గం ఆఖరికి దళితులపై మూత్రం పోస్తున్నా టీవీ-9 రజనీకాంత్ లో జగన్ పై ఉన్న ఆత్రం తగ్గలేదు.

పేరుకే మెరుగైన సమాజం కోసం.. చేసే పని మొత్తం మెరుగైన సంపదకోసమే
టీవీ-9 ఛానల్ క్యాప్షన్ మెరుగైన సమాజం కోసం అని ఉంటుంది. కానీ ఆ ఛానల్ మెరుగైన సంపద కోసం.. మొరిగే కుక్కల్లా జగన్ కోసం పనిచేస్తోంది. భారతదేశ చరిత్రలో ఎన్నడూ చూడని రాజకీయ కక్షలు, కుట్రరాజకీయాలు రాష్ట్రంలో జరుగుతుంటే అవేవీ నాలుగున్నరేళ్లలో టీవీ – 9కు కనిపించలేదు. నిరంతరం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు.. నేతలపై దాడులు.. ఆఖరికి టీడీపీ ప్రధాన కార్యాలయంపై.. ప్రధాన ప్రతిపక్షనేత చంద్రబాబుపై వైసీపీ నేతలు దాడిచేసినా రజనీకాంత్ కు అవేవీ అధికారపార్టీ దుశ్చర్యలుగా కనిపించలేదు. తన అవినీతితో రాష్ట్రాన్ని నాశనంచేసినా… ప్రజలు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడేలా చేసినా జగన్ రెడ్డి నిజస్వరూపం రజనీకాంత్ కు కనిపించలేదు.

రజనీకాంత్ టీవీ-9 ముసుగులో చంద్రబాబుని.. లోకేశ్ ని.. వారికుటుంబాన్ని బదనాం చేస్తుంటే.. మహాసేన రాజేశ్ ఆ తప్పుడు ప్రచారాన్ని వాస్తవాలతో ఖండించాడని అతనిపై తప్పుడు కేసులు పెట్టారు.

మహాసేన రాజేశ్ పై టీవీ-9 రజనీకాంత్ ఎందుకు తప్పుడు కేసు పెట్టారంటే…. టీవీ-9 ముసుగులో రజనీకాంత్ చేసిన..చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని వాస్తవాలతో రాజేశ్ ఖండిస్తున్నాడని. మీడియా సంస్థ ముసుగులో చంద్రబాబుని.. ఆయన కుటుంబాన్ని.. లోకేశ్ ను రజనీకాంత్ బదనాం చేస్తుంటే, వారిపై విషప్రచారం చేస్తుంటే టీడీపీ నాయకుడిగా.. మహాసేన మీడియా ప్రతినిధిగా రాజేశ్ స్పందించకూడదా? టీడీపీలో చంద్రబాబు తర్వాత ఆయన భార్య.. కుమారుడేనా.. ఎస్సీ.. బీసీ నేతలు లేరా అని పార్టీనేతల మధ్య చిచ్చుపెట్టేలా టీవీ-9 ద్వారా రజనీకాంత్ విషప్రచారం చేయడం తప్పుకాదు గానీ, ఆ విషప్రచారాన్ని ఖండించడం రాజేశ్ చేసిన తప్పా?

రాజేశ్ పై తప్పుడు కేసులు పెట్టి.. హైదరాబాద్ పోలీసులతో అతనికి ఫోన్లు చేసి బెదిరించినంత మాత్రాన నిజం, అబద్ధమైపోదని రజనీకాంత్ గ్రహించాలి. రాజేశ్ పై టీవీ-9 రజనీకాంత్ తప్ప్పుడు కేసు పెడితే.. అతనిపై మేం కేసులు పెట్టలేమా? విషసర్పంలో ఉండే విషం కంటే ఎక్కువ విషం టీవీ-9 రజనీకాంత్ కు ఉందని అర్థమైంది. ఏపీలో నాలుగున్నరేళ్లలో జగన్ రెడ్డి దుర్మార్గాలను ఎదుర్కొన్న మాకు.. మా పార్టీనేతలకు రజనీకాంత్ లాంటి పిల్ల పాముల్ని ఎదుర్కోవడం లెక్కకాదు. రజనీ కాంత్ టీవీ-9 ముసుగులో మెరుగైన సమాజం కోసమని రజనీకాంత్ కలరింగ్ ఇవ్వకుండా, సాక్షి మీడియాలానే నేరుగా జగన్ రెడ్డి బానిసగా ప్రజల్లోకి రావాలి.

టీవీ-9 ఛానల్ నిజమైన మీడియా సంస్థే అయితే.. మీడియా విలువలకు కట్టుబడితే తాము ఎవరిపక్షమో తక్షణమే తేల్చాలి. బరితెగించి రోడ్డెక్కే రజనీకాంత్ లాంటి వారికి ఎలా బుద్ధిచెప్పాలో టీడీపీకి బాగా తెలుసు. ఏపీలో జరిగే అరాచకాలు, దుర్మార్గాలపై టీవీ-9 స్పందించని ప్రతిసారి మేం ఆ ఛానల్ ను తప్పుపడుతూనే ఉంటాం. సాక్షి -2 గా మారిన టీవీ-9 నిజంగా ఏపీలో బాధితుల పక్షాన నిలిచి, బాధించే జగన్ రెడ్డిపై పోరాడితే మేం కూడా స్వాగతిస్తాం. అలా కాదు మేం జగన్ రెడ్డి బానిసగానే పనిచేస్తామని రజనీకాంత్ నిర్ణయించుకంటే.. తక్షణమే ఆయన మహాసేన రాజేశ్ కు క్షమాపణ చెప్పాలి.” అని మాణిక్యరావు డిమాండ్ చేశారు.

Leave a Reply