ఇందిరా పార్క్ లో కాదు.. మొదట మోడీ ఇంటి ముందు ధర్నా చెయ్ సంజయ్

2

– రెడ్కో చైర్మన్ వై.సతీష్ రెడ్డి

నిరుద్యోగ మహాధర్నా పేరుతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రేపు చేపట్టబోతున్న మహాధర్నా ఓ పొలిటికల్ స్టంట్ మాత్రమే. యువత దృష్టి మరల్చి,దాని ద్వారా తాము లబ్ది పొందాలనే నీచపు ఆలోచన తప్ప ఇందులో ఏమీ లేదు. అసలు ఉద్యోగాల గురించి, యువత గురించి మాట్లాడే హక్కు బీజేపీకి లేదు. బండి సంజయ్ కి అసలే లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇస్తే.. అది బీజేపీకి యువతను దూరం చేసే కుట్ర అన్నది ఇదే బండి సంజయ్. యువత, ఉద్యోగులు చదువులు, ఉద్యోగాలు పక్కన పెట్టి బీజేపీ కోసం రాజకీయం చేయాలని రోడ్లెక్కాలని పిలుపునిచ్చి.. వారి జీవితాలతో చెలగాటమాడుతున్నది ఇదే బండి సంజయ్.

అలాంటి నువ్వా ఉద్యోగాల గురించి, యువత గురించి మాట్లాడేది.? నీది నోరా.. డ్రైనేజా..?. నోటిఫికేషన్లు కుట్ర అన్నావ్. ఉద్యోగాల భర్తీ జరగకుండా అడ్డుకున్నావ్. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలో ఉన్నది కూడా మీ బీజేపీ కార్యకర్తే. అయినా దొంగే.. దొంగా.. దొంగా.. అని అరిచినట్టు ఇప్పుడు దొంగ ధర్నాలకు రెడీ అవుతున్నావ్. బీజేపీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వనన్ని ఉద్యోగాలు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది. రాష్ట్రం ఏర్పడిన మొదటి ఐదేళ్లలో లక్షా 35 వేల ఉద్యోగాలు కల్పించింది. ఈ మధ్యే 91 వేలకు పైగా ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చింది. ఆ భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వ కృషితో వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ప్రయివేటు రంగంలో 20 లక్షలకు పైగా ఉద్యోగాల కల్పన జరిగింది. కానీ మీ బీజేపీ నేతల్లాగే టీఎస్పీఎస్సీలో కొందరు ఉద్యోగులు అత్యాశకు పోయి, డబ్బులకు ఆశపడి చేసిన తప్పిదం వల్ల పేపర్ లీక్ అయ్యింది. ఈ ఇష్యూలో ప్రభుత్వం ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. 12 నిందితులను అరెస్ట్ చేసింది. ఇంకా ఎవరున్నారనే దానిపైనా ఎంక్వైరీ కొనసాగుతోంది. పేపర్ లీకేజీతో సంబంధం ఉన్న ఏ ఒక్కరిని వదిలేది లేదు.

బండి సంజయ్ గారూ.. మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారన్న విషయం మరిచిపోయారేమో. అసలు మీ కేంద్ర ప్రభుత్వం యువతకు చేసిన ఒక్క మంచి పని చెప్పండి. మీరు అధికారంలోకి వచ్చాక ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు.? కేంద్ర ప్రభుత్వంలో ఇప్పటి వరకు 10 లక్షల వరకు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. వాటి భర్తీ సంగతి ఏమైంది.? ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేసి.. యువతను ఉద్యోగాలకు, దళిత,బహుజన బిడ్డలను రిజర్వేషన్లకు దూరం చేసింది మోడీ సర్కారు. దేశ సేవ చేయాలనుకునే యువతకు అగ్నిపథ్ పేరుతో ఓ అడ్డుగోడ నిర్మించారు. ఇన్ని రోజులు ఆర్మీలో ఉద్యోగం అంటే భరోసా ఉండేది. కానీ ఇప్పుడు మోడీ పాలనలో జవాన్ల ప్రాణాలకే కాదు.. వారి భవిష్యత్ కు భరోసా లేకుండా చేశారు. కాబట్టి బండి సంజయ్ గారు మొదట మీరు ఢిల్లీ వెళ్లి మోడీకి వ్యతిరేకంగా మోడీ ఇంటి ముందు ధర్నా చేయండి.

ఈ సమస్యలు పరిష్కరించండి. మీ పదవుల కోసం యువత జీవితాలను పణంగా పెడుతున్న పకోడాగాళ్లు మీరు. మీ రెచ్చగొట్టే మాటలతో యువత, నిరుద్యోగుల ప్రాణాలతో చెలగాటమాడకండి. ప్రజలు త్వరలోనే మీ ఉద్యోగాలు మీకు ఇవ్వడం పక్కా. గతంలో మాదిరి ఇళ్లలో ఖాళీగా కూర్చునే రోజులు మీకు దగ్గర్లోనే ఉన్నాయి.