– సంక్షేమానికి కొత్తబాటలు వేసిన సంఘసంస్కర్త
– ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు
– పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరు చదలవాడ నాగరాణి
భీమవరం: స్వర్గీయ నందమూరి తారక రామారావు 102వ జయంతి వేడుకలు బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని పిజిఆర్ యస్ సమావేశం మందిరంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. తొలుత యన్టీఆర్ చిత్రపటానికి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా జాయింటు కలెక్టరు టి.రాహుల్ కుమార్ రెడ్డి, తదితరులు పూలమాలలు వేసి ఘననివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా కలెక్టరు చదలవాడ నాగరాణి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి ఏటా మే 28వ తేదీన మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతిని రాష్ట్ర వేడుకగా నిర్వహించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసిందన్నారు. ఎన్టీఆర్ దూరదృష్టితో కూడిన నాయకత్వంతో ఆంధ్రప్రదేశ్‌పై చెరగని ముద్రవేశారన్నారు. తద్వారా అన్ని వర్గాల ప్రజలకు ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు నిలిచారన్నారు.
భారతదేశ రాజకీయాలలో చెరగని శాశ్వత ముద్రవేశారని, తమిళనాడులో యంజిఆర్, ఆంధ్రప్రదేశ్ లో యన్టీఆర్ రాజకీయాలలో కొత్త బాటలు వేసి బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి, అభివృద్ధికి కృషి వేశారన్నారు. బడుగు, బలహీనవర్గాల ఇబ్బందులు తొలగించేందుకు కరణాల వ్యవస్థను రద్దుచేసి విఆర్వో వ్యవస్థ తీసుకువచ్చారని, మండల వ్యవస్థ ద్వారా సంక్షేమం, అభివృద్ధి ప్రజల చెంతకు తీసుకువచ్చి, ప్రజలు మెచ్చుకునే స్థాయిలో సేవలు అందించారన్నారు.
పేదవాడికి కూడు, గూడు, గుడ్డ నినాదంతో కిలో రూ.2 బియ్యం, నిరుపేదలకు ఇంటి నిర్మాణాలు, అతి చౌకగా జనతా వస్త్రాలు, పింఛన్లతో నిరుపేద వర్గాల ప్రజలకు మంచి లబ్ధిని చేకూర్చారన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మహిళల ఆర్ధిక స్వావలంబన అవసరమని భావించి ఆస్తి హక్కు తో పాటు రిజర్వేషన్లు కల్పించి రాజకీయాలు, విద్య, ఉపాధి, ఉద్యోగ, స్థానిక సంస్థలు, చట్టసభలలో సముచిత స్థానాలు అందుకునేలా చేశారన్నారు. మహిళలకు ప్రత్యేకంగా తిరుపతిలో పద్మావతి మహిళా యూనివర్సిటీ స్థాపించి విద్యకు పెద్దపీట వేశారని అన్నారు.
జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. స్వర్గీయ ఎన్టీఆర్ రైతు కుటుంబంలో జన్మించి అంచెల అంచెలుగా ఎదిగిన వ్యక్తి అన్నారు. ప్రతి ఒక్కరూ ఎన్టీఆర్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. తెలుగు ప్రజల హృదయాలలో ఎన్టీఆర్ స్థిరస్థాయిగా నిలిచిపోయరని చెప్పారు. ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశం తరవాత పేద ప్రజలు ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ప్రజలలో ధైర్యం నింపారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారు.
. యన్టీఆర్, జయప్రకాష్ నారాయణ, తదితర నాయకుల జీవిత విశేషాలను యువత అధ్యయనం వారి ఉన్నతికి ఎంతగానో దోహదపడతాయని అన్నారు. యన్టీఆర్ జయంతి సందర్భంగా జిల్లా కలెక్టరేటు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ ఫోటో ఎగ్జిబిషన్ ను జిల్లా కలెక్టర్, జాయింటు కలెక్టరు, డిఆర్వో, ఆర్డీవో, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు, విద్యార్థిని, విద్యార్థులు ఆసక్తిగా తిలకించారు. విద్యార్థిని, విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఎన్టీఆర్ జీవిత విశేషాలుపై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి యం.వెంకటేశ్వర్లు, ఆర్డీవో కె.ప్రవీణ్ కుమార్ రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఉద్యోగులు, మాజీ పురపాలక సంఘం చైర్మన్ మెరగాని నారాయణమ్మ తదితరులు పాల్గొన్నారు.