Suryaa.co.in

National

విదేశాల్లో ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ సంబరాలు

– ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ ముఖ్యనగరాలలో ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు
– పాల్గొంటున్న టి.డి.జనార్థన్‌, నందమూరి రామకృష్ణ, సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి తదితరులు

న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియాలోని ముఖ్య నగరాలలో జరిగే 75 సంవత్సరాల ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవం, సిబిఎన్‌ 75 ఇయర్స్‌ వేడుకల ఉమ్మడి కార్యక్రమాలలో ముఖ్య అతిధిగా పాల్గొనడానికి ఎన్టీఆర్‌ లిటరేచర్‌ కమిటీ చైర్మన్‌, మాజీ ఎమ్మెల్సీ, తెలుగుదేశం పొలిట్‌బ్యూరో సభ్యులు టి.డి.జనార్ధన్‌, ప్రత్యేక అతిధి ఎన్టీఆర్‌ కుమారుడు నందమూరి రామకృష్ణ పయనమై వెళ్లారు.

ఎన్నారై టీడీపీ మరియు తెలుగు సంఘాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాలలో మొదటిది జూన్‌ 6న న్యూజిలాండ్‌ రాజధాని అక్‌లాండ్‌లో జరుగుతున్నది. దీనికి తెలుగుదేశం శాసనసభ్యులు బోడే ప్రసాద్‌, ఎన్టీఆర్‌ లిటరేచర్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ అశ్విన్‌ అట్లూరి పాల్గొంటున్నారు. ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణంరాజు జూమ్‌ ద్వారా పాల్గొంటున్నారు.

జూన్‌ 7న మెల్బోర్న్‌లో జరిగే కార్యక్రమంలో ముఖ్య అతిధి శ్రీ టి.డి.జనార్ధన్‌తోపాటు నందమూరి రామకృష్ణ, సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి, బోడే ప్రసాద్‌, అశ్విన్‌ అట్లూరి పాల్గొంటున్నారు. జూమ్‌ ద్వారా రఘురామ కృష్ణంరాజు తమ సందేశాన్ని ఇస్తారు.

జూన్‌ 8న అడిలైడ్‌ నగరంలో జరిగే 75 సంవత్సరాల ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవం, సిబిఎన్‌ 75వ జన్మదినం వేడుకలలో ముఖ్య అతిధులుగా టి.డి.జనార్ధన్‌, నందమూరి రామకృష్ణ, బోడే ప్రసాద్‌, నారా రోహిత్‌, అశ్విన్‌ అట్లూరి, నన్నూరి నర్సిరెడ్డి పాల్గొంటున్నారు.

జూన్‌ 9న సిడ్నీ నగరంలో జరిగే కార్యక్రమంలో టి.డి. జనార్ధన్‌, నందమూరి రామకృష్ణ, సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి, బోడే ప్రసాద్‌, అశ్విన్‌ అట్లూరిలతోపాటు ప్రముఖ సినీ యువనటుడు నారా రోహిత్‌, తెలుగుదేశం సీనియర్‌ నేతచ టిటిడి సభ్యుడు నర్సిరెడ్డి పాల్గొంటారు.

జూన్‌ 11న బ్రిస్బేన్‌ నగరంలో జరిగే మినీమహానాడు, ఎన్టీఆర్‌ సినీవజ్రోత్సవ కార్యక్రమాల్లో టి.డి.జనార్ధన్‌, నందమూరి రామకృష్ణ, సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి, బోడె ప్రసాద్‌, నారా రోహిత్‌, అశ్విన్‌ అట్లూరి, నన్నూరి నర్సిరెడ్డి ముఖ్య అతిధులుగా పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమాలలో స్థానికంగా ఉన్న తెలుగు సంఘాల ఆధ్వర్యంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తాయి.

LEAVE A RESPONSE