Suryaa.co.in

Telangana

రాజోలి మండల రైతులపై రౌడీయిజం దారుణం

■ అధికార పార్టీ ముఖ్య నేతల అండతోనే ఇథనాల్ ఫ్యాక్టరీ యాజమాన్య అరాచకం
■పోలీసులు అదుపులోకి తీసుకున్న రైతులను వెంటనే విడుదల చేయాలి
◆రైతుల పోరాటానికి అన్ని వర్గాలు అండగా నిలవాలి:రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ మాజీ ఛైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్

పెద్ద ధన్వాడలో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు వ్యతిరేకంగా మండలంలోని రైతాంగం మొత్తం పోరాడుతున్నా,యాజమాన్యం యధేచ్చగా పనులను మొదలుపెట్టడం వెనక అధికార పార్టీ పెద్దల అండదండలే కారణమని రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ మాజీ ఛైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్ ఆరోపించారు

రైతుల ఆవేదనను ఇప్పటికైనా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకొని, తక్షణమే ఇథనాల్ ఫ్యాక్టరీ రద్దు పై స్పష్టమైన అధికారిక ఉత్తర్వులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. రైతులతో చెలగాటమాడి లగచర్లలో చేతులు కాల్చుకున్నా రేవంత్ సర్కార్ లో మార్పు రాకపోవడం దారుణమన్నారు.

ఇప్పటికైనా రైతుల పట్ల కాంగ్రెస్ సర్కార్ తన వైఖరి మార్చుకోవాలని, నేడు పోలీసులు అదుపులోకి తీసుకున్న రైతులను వెంటనే విడుదల చేయాలని,రైతుల మనోభావాలను గాయపరిచిన ఇథనాల్ ఫ్యాక్టరీ యాజమాన్యం పై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. రాజోలి మండల రైతులకు నడిగడ్డలోని అన్ని వర్గాలు అండగా నిలవాలని ఆంజనేయ గౌడ్ విజ్ఞప్తి చేశారు.

LEAVE A RESPONSE