Suryaa.co.in

Telangana

దోచుకోవడం, దాచుకోవడమే… కేటీఆర్ చెబుతున్న ‘గోల్డెన్ తెలంగాణ మోడల్’

– అమెరికాలోని అబద్దాల యూనివర్సిటీలో అన్నా, చెల్లెలు డాక్టరేట్ చేసి వచ్చారు
-అబద్దాలలో ఆస్కార్ అవార్డు ఎవరికైనా ఇవ్వాలి అంటే.. అది కేటీఆర్ కే
– బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్ వి సుభాష్

గుజరాత్ మోడల్ ఏంటో దేశ ప్రజలకు తెలుసు… కేటీఆర్ చెప్పాల్సిన అవసరం లేదు.అకాల వర్షాలతో పంట నష్టపోయి తెలంగాణ రైతాంగం ఏడుస్తుంటే… అయ్యా ఔరంగబాద్ సభ అంటాడు… కొడుకు మినీ ప్లీనరీల పేరుతో చిందులు వేయిస్తున్నారు.ఓవైపు రైతులు కన్నీళ్లు కారుస్తుంటే… మహారాష్ట్రలో బీఆర్ఎస్ సభల పేరుతో, వందల కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఎవరి సొమ్మును, ఎవడు ఖర్చు చేస్తున్నాడో ప్రజలు ఆలోచించాలి. బ్రెయిన్ లేని వాడు కాబట్టే… ‘బంటి’ జపం చేస్తున్నాడు.ఎవరి బ్రెయిన్ ఏంటో, త్వరలో ప్రజలే తేలుస్తారు. అమెరికాలోని అబద్దాల యూనివర్సిటీలో అన్నా, చెల్లెలు డాక్టరేట్ చేసి వచ్చారు. నోరు తెరిస్తే చాలు… అన్నీ అబద్ధాలే. అబద్దాలలో ఆస్కార్ అవార్డు ఎవరికైనా ఇవ్వాలి అంటే.. అది కేటీఆర్ కే.

కేసీఆర్, కేటీఆర్ సహా బిఆర్ఎస్ నేతలు ప్రధాని మోదీ, బండి సంజయ్, బిజెపిపై చేస్తున్న విమర్శలకు, వచ్చే ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెబుతారు ‘బందిపోట్ల రాష్ట్ర సమితి’ సంగతి బరాబర్ చూస్తాం. కనీస అర్హత, స్థాయిలేని బీఆర్ఎస్ నేతలు సైతం ప్రధాని మోదీని విమర్శిస్తుండడం చూస్తుంటే… విడ్డూరంగా ఉంది
ప్రపంచంలోనే అత్యంత ప్రజాదారణ కలిగిన వ్యక్తి, మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ. మోదీని విమర్శించడం అంటే… సూర్యుడిపై ఉమ్మి వేసినట్టే అని బీఆర్ఎస్ నేతలు గుర్తుంచుకోవాలి. ప్రతిపక్ష నేతలు కుక్కల్లా మొరుగుతున్నారని అంటున్న కేటీఆర్ కు… కేంద్రంలోని బిజెపిపై విమర్శలు చేస్తున్నప్పుడు ఆ విషయం గుర్తుకు రాకపోవడం శోచనీయం. లీకేజీలు, ప్యాకేజీల ప్రభుత్వానికి కౌంటర్ డౌన్ స్టార్ట్ అయింది. వచ్చే ఎన్నికల్లో టిఆర్ఎస్ కు ఇక వీఆర్స్సే

LEAVE A RESPONSE