– బహిరంగంగా ప్రకటిస్తూ సవాల్ చేసిన వెబ్ సైట్
– పవన్ కళ్యాణ్ సినిమాకు పైరసీ గుబులు
హైదరాబాద్: ఓజీ సినిమాకు పైరసీ ఒక పెద్ద సవాల్‌గా మారింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా పైరసీ ముప్పును ఎదుర్కొంటోంది. సినిమా పైరసీకి పెట్టింది పేరైన ఐబొమ్మ (Ibomma) వెబ్సైట్ ఒక సంచలన పోస్టర్‌ను షేర్ చేసింది.
తమ సైట్లో ఓజీ సినిమా త్వరలో రాబోతోందని ప్రకటిస్తూ పవన్ కళ్యాణ్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పరిణామం సినిమా యూనిట్‌ను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. పైరసీని అరికట్టేందుకు చిత్ర బృందం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.