Suryaa.co.in

Editorial

ఒక్కడు…దూకుడు.. ఆగడు!

– చంద్రబాబా? మజాకా?
– కుర్రాళ్లతో పోటీ పడుతున్న ‘ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ’
– బాబు జంప్ ఫొటోలకు లక్షల లైకులు
– గతంలో రెండుగంటల 50 నిమిషాల్లోనే తిరుమల మెట్లు ఎక్కిన రికార్డు
– ఇప్పుడు కాలువను అలవోకగా దూకిన ‘యూత్ బాబు’
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఒక్కడు.. దూకుడు.. ఆగడు.. ఇవేంటి? మహేష్ సినిమా టైటిల్స్ ముచ్చట్లేమిటని హాశ్చర్యపోతున్నారా? యస్. ఇవి సినిమా టైటిల్సే! బట్.. టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడు తాజాగా నర్సరావుపేట జిల్లాలో చేసిన ఫీట్ పిక్చర్స్ చూస్తే.. ఒక్కడు..దూకుడు..ఆగడు సినిమా టైటిల్స్ గుర్తు చేసుకోక తప్పదు. ఇక పల్నాడుకు వెళదాం.

నరసరావుపేట జిల్లాలో పర్యటించిన చంద్రబాబునాయుడు, అక్కడి రైతులతో మాట్లాడారు. వ్యవసాయం మంచి చెడ్డల గురించి రైతులతో ముచ్చటించారు. సర్కారీ సాయాన్ని వాకబు చేశారు. పంటలు పరిశీలించారు. ఇదంతా బాగే ఉంది. కానీ, ఆయన ముందుకెళ్లడానికి ఒక చిన్న కాలువ అడ్డంగా ఉంది.image-3 మామూలుగా మనలాంటివాళ్లయితే కిందకు దిగి వెళతాం. కాబట్టి ఆయన కూడా అలాగే వెళతారనుకున్నారంతా. ఏజ్ కూడా ఏడుపదులు కాబట్టి, పెద్దాయన నెమ్మదిగా కిందకు దిగి నడిచి వెళతారనుకున్నారు. బట్ ఆయన బాబు కదా? అందరిలా వెళితే ఆయన బాబెందుకవుతారు?

అంతా అలాగే అనుకుంటున్న సమయంలో.. బాబు తన ఒక కాలిని ముందు పెట్టి, మరోకాలిపై నుంచి అవతలకు జంప్ చేసి, అందరినీ ఆశ్చర్యపరిచారు. అసలాయన ఏజేంటీ? ఆ ఫోర్సేందీ? ఆ ఎనర్జీ ఏంటి? ఈ వయసులో ఆ జంపింగేంటి?.. ఇప్పుడు ఇవీ చంద్రబాబు జంపు చేస్తున్న ఫొటోల కింద, సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్న ఆశ్చర్యార్ధక ప్రశ్నలు. లక్షలమంది నెటిజన్లు ఆ ‘పిక్’కు లైకులు కొడుతున్నారు.

అన్నట్లు ఆయన ఆరుపదుల వయసు దాటిన తర్వాత తిరుమల కొండపైకి సరిగ్గా 2 గంటల 50 నిమిషాల్లో చకచకా ఎక్కేసి అందరినీ అబ్బురపరిచారు. ఆయనతో నడిచిన వారంతా ఆపసోపాలు పడుతూ, కాసేపు
కూర్చుని మళ్లీ నడిస్తే.. బాబు మాత్రం నిటారుగా నిలబడి, కేవలం రెండుసార్లు మంచినీళ్లు మాత్రమే తాగి, అలవోకగా 2 గంటల 50 నిమిషాల్లో తిరుమల పైకి కాలినడక చేరారు. అప్పట్లో అదొక అబ్బురం. ఎందుకంటేప్పుడాయన వయసు ఆరుపదులు దాటాయి మరి!

కుర్రాళ్లు మూడుగంటల్లో కొండెక్కడం రొటీనయితే.. ఆరుపదులు దాటిన వ్యక్తి కూడా, పదినిమిషాల తక్కువ మూడుగంటల్లో చెంగు చెంగున కొండెక్కడం మాత్రం రొటీన్‌కు భిన్నమే కదా? అప్పుడా ఫీటు.. ఇప్పుడీ ఫీటు! ఏదేమైనా బాబు రూటే వేరప్పా!! ఎనర్జీ విషయంలో కుర్రాళ్లతో పోటీ పడుతున్న బాబుimage ఓపికకు హేట్సాఫ్ చెప్పాల్సిందే. రాజకీయాల్లో ఆయన సమకాలీకులంతా ఇప్పుడు దాదాపు రిటైరయిపోగా, మరికొందరు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. మామూలుగా ఆయన వయసున్న వాళ్లంతా ఇంటిపట్టునే ఉంటూ, మనవడూ-మనవరాళ్లతో కాలక్షేపం చేస్తుంటారు. కానీ బాబు మాత్రం.. ఇంకా ‘ట్వంటీస్’ మాదిరిగా, యమా ఎనర్జిటిక్‌గా పనిచేయడమే వింత.

కొద్దిగా వెనక్కి వెళితే…
ముసలాయన ఇక రాజకీయాల నుంచి రిటైరయితే బాగుంటుంది..
దేవాన్షుతో కాలక్షేపం చేసుకోక ఇంకా ఎందుకీ రాజకీయాలు?
వయసుమీద పడిన చంద్రబాబు పనయిపోయింది..
బాబుకు పార్టీని నడిపే ఓపిక, వయసు అయిపోయింది. ఇప్పుడు టీడీపీ ముసలిపార్టీ..
ఇప్పటివరకూ చంద్రబాబు వయసుపై, ‘ఆరుపదుల వయసు దాటిన’’ అధికార పార్టీ ఎంపీలు రెగ్యులర్‌గా చేసే విమర్శలూ, ట్వీట్లివి. అయినా ఇప్పటివరకూ ఆయన దానిపై స్పందించలేదు. తన వయసు-ఓపికపై విమర్శలు చేసే వారికి, బహుశా ఈ ఒక్క ఫొటోనే బాబు జవాబు కావచ్చు.

LEAVE A RESPONSE