Suryaa.co.in

Andhra Pradesh

మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు

విజయవాడ: రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని పాఠశాల విద్యా శాఖ నిర్ణయించింది.. వారం రోజుల నుంచి రాష్ట్రం లోని చాలా ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. దీంతో మార్చి మొదటి వారం నుంచే ఒంటిపూట బడుల నిర్వహణకు అనుమతి ఇవ్వాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. దీనిపై విద్యా శాఖ ఎలా స్పందిస్తుందో చూడాలి.

LEAVE A RESPONSE