Suryaa.co.in

Andhra Pradesh

లక్షా నలభై తొమ్మిది వేల ఓట్ల అభ్యంతరాలకు అవకాశం లేదా?

-తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఉచ్చి భువనేశ్వరి ప్రసాద్

నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని తిక్కన భవన్ లో ఓటర్ల జాబితాలు పరిశీలనకు వచ్చిన పరిశీలకులు పోలా భాస్కర్ తో జరిగిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఉచ్చి భువనేశ్వరి ప్రసాద్ మాట్లాడుతూ జిల్లాలో డ్రాఫ్ట్ జాబితా పబ్లికేషన్ చేసే నాటికి ఫార్మ్ 6,7,8 లు విచారణ చేయకుండా పెండింగ్ లో లక్షా నలభై తొమ్మిది వేల అర్జీలు ఉన్నాయని, అర్జీల విచారణ తేదీ ముందుకు జరిపినందున అవి డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో ప్రచురణ కాకుండా నేరుగా ఫైనల్ జాబితాలోకి వస్తాయని కలెక్టర్ తెలియచేస్తున్నారు. వాటిపై అభ్యంతరాలు ఉంటే తెలియచేయడానికి ఫైనల్ జాబితాలో అవకాశం వుండదు కాబట్టి, పెండింగ్ అప్లికేషన్లపై అభ్యంతరాలకు ఫైనల్ జాబితా ప్రచురణ లోపుగా మరో అవకాశం ఇవ్వాలని ఉచ్చి కోరారు.

ఈ విషయమై స్పందించిన పరిశీలకులు, ఈ విషయం కేంద్ర ఎన్నికల సంఘం పరిధిలోనిదని మీ డిమాండ్ ను మినిట్స్ లో రికార్డ్ చేసి కేంద్ర ఎన్నికల సంఘానికి పంపుతామని తెలిపారు. అదే విధంగా నెల్లూరు నగరంలో ఓటర్ వెరిఫికేషన్ చేస్తున్న కార్యకర్తలను పోలీసులు స్టేషన్లకు తీసుకువచ్చి కేసులు పెడుతున్నారని, ఓటరు వెరిఫికేషన్ బి ఎల్ ఏ లు మాత్రమే చేయాలని పోలీసులు కేసులు పెడుతున్నారని, సాధారణ పౌరుడికి వెరిఫికేషన్ చేసే హక్కు లేదా అని అడుగగా ఓటరు వెరిఫికేషన్ రాజకేయ పార్టీ కార్యకర్త ఎవరైనా చేసుకోవచ్చని తెలిపారు.

సమావేశంలో కావలి నియోజకవర్గానికి చెందిన డూప్లికేట్ ఓటర్లకు సంబంధించిన సమస్యపై పరిశీలకునికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ తరపున జలదంకి సుధాకర్, రసూల్ పాల్గొని సమస్యలు వివరించారు.

LEAVE A RESPONSE