ఆస్కారం

( ప్రతాప్ రాజుల పల్లి)

భారతీయ చిత్రాల కథాగమనం ప్రతి 15-20 ని.లకు 3-5 నిమిషాల పాటు వచ్చే పాటల వల్ల ఆగిపోతుందని ఓ సారి ఈసడించాడు ఆల్ఫ్రెడ్ హిచ్ కాక్. కానీ ఆట,పాట ప్రపంచ చలనచిత్ర సీమకే భరతసీమ కానుకన్నది వారి కనిపించలేదు. ఒకానొక నాడు ఆ ఆటకు, పాటకే భాషాతీతంగా ప్రపంచమంతా పరువెళ్ళెత్తి, పరవశంతో కదను తొక్కుతుందని వారి హ్రస్వ దృష్టి కగుపించలేదు.

వాణిజ్యచిత్రాలంటే పెదవి విరిచే వారికందరికీ ఇదో కనువిప్పు (ప్యారిస్ లో గామౌంట్ లో అభిమానుల వీరంగంతో తెలుగు వారి పరువు అంతర్జాతీయంగా మంట కలుస్తుందేమోని భయపడ్డ నాకు కూడా). దమ్ముంటే రొమ్ము విరుచుకొని అకాడెమీ ‘ఎర్ర తివాచీ’ని సైతం వెర్రెక్కించ వచ్చని చాటిన ‘చిరు పులుల’ కు, ‘చిరుత’లకు, గుసగుసలాడే ఏనుగులకు (ద ఎలిఫెంట్ విస్పరర్స్) మప్పితాలు (దిష్టి తగిలేనని పొగడ్తలకు ఆనకట్ట).

ప్రతిభకు ప్రపంచమంతటా ‘ఆస్కార’మే! నానాటికి నాడునాడున కీర్తి శిఖరాల నధిగమిస్తున్న నా నాటి “నాటు నాటు”ఘాటు, తెనుగు ‘వాడి’ వేటు,పోటు. జాను తెనుగు నాది; జాణ తెనుగు నాది. (కాని చంద్రబోస్ పట్ల గర్వంతో కలగలిసిన “ఈర్ష్య” నాది)

Leave a Reply