విశ్వగురు స్థాయికి మన జెండా..

75 వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నాం… సంబరాలు చేసుకున్నంత మాత్రాన సరిపొతుంద అని ప్రశ్నలు …
స్వాతంత్య్ర విలువ తెలిసిన వారికి ఈ ప్రశ్న అడగడం అంత సులభం కాదు..
ఈ రోజున స్స్వేచ్ఛ , స్వయంపరిపాలన, స్వీయ నిర్ణయాధికారాల ను సాధించడం కోసం పోరాడిన లక్షలాది స్వాతంత్రోద్యమ తరాన్ని వందేమాతరం అంటూ స్మరించు కోవడం తో పాటు, 75 సంవత్సరాలలో సాధించిన అభివృద్ధిని, భవిష్యత్తులో సాధించాల్సిన పురోగతిని ఒక భారతీయ పౌరుడిగా చర్చంచుకోవలసిన ఆవశ్యకత ఉంది.

1947 ఆగస్ట్ 15 న భారతదేశం స్వాతంత్య్రం పొందినట్లు నాటి వలస పాలకులు ప్రకటించారు. దేశమంతా సంబరాలు చేసుకుంది. అయితే స్వాతంత్య్రం అంటే అధికారం కాదు భాద్యత అని కొన్ని రోజులలోనే నాటి నెహ్రూ ప్రభుత్వానికి అర్ధం అయింది.
ఆహార కొరత తో ప్రజలు అలాంటిస్తుంటే అమెరికా, మెక్సికో లాంటి దేశాల పై ఆధారపడాల్సి స్థితి .
ఉద్యోగ కల్పన కు ముఖ్యమైన భారీ పరిశ్రమలేవి ఏర్పాటు చేయక పోవడం తో తీవ్రమైన నిరుద్యోగ సమస్య,
దేశ విభజన వలన వలసలు, మత విద్వేషాలు, కాశ్మీర్ యుద్ధం వలన పెరిగిన
హింస. పేదరికం, అంటు వ్యాధులు ప్రబలడం, నిరక్షరాస్యత వల్ల మూఢనమ్మకాలు, శాస్త్రీయ దృక్పధం లేకపోవడం.

రాజకీయం గా హైద్రాబాద్, జునఘర్, కాశ్మీర్ వంటి సంస్థనాలు దేశం లో కలకపోవడం
ఇలాంటి పరిస్థితులనుంచి మన దేశం ఈ 75 సంవత్సరాలలో ఒక్కో మెట్టు ఎక్కుతూ నేడు నేను భారతీయున్ని అని సగర్వంగా చెప్పుకునేలా అన్ని రంగాలలో ప్రపంచదేశాల తో పోటీ పడుతుండడం నిజంగా ఒక గొప్ప ఘనవిజయమే…
నేడు మనం ఆహారాధాన్యాలను విదేశాలకు ఎగుమతి చేస్తున్నాం.
సైన్స్ అండ్ టెక్నాలజీ లో మార్స్ మీదకి రాకెట్ పంపే స్థాయికి ఎదిగాం, చంద్రుని అందుకున్నాం.
మన పై దాడి చేయాలంటే భయపడే స్థాయికి మన సైన్యం నేడు ఉంది.
ఆర్థిక రంగం లో అమెరికా, చైనా తరువాత మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ గా ఎదిగాం.
పేదరికాన్ని 80 శాతం నుంచి 20 శాతానికి తగ్గించగలిగం.
కులం, మతం,ప్రాంతం,లింగం అనే తేడాలు లేకుండా అందరికి అన్ని రంగాలలో సమాన అవకాశాలు కల్పిస్తున్నాం.
ప్రతి గ్రామంలో గుడి తో పాటు నేడు పాఠశాల, ఆసుపత్రి ని ఏర్పాటు చేయగలిగాము.

ఇన్ని విజయాలు ఒక్క రోజులో సాధ్యపడలేదు. 75 సంవత్సరాలు కాలం, ఎన్నో ప్రభుత్వాలు, ప్రధాన మంత్రులు ,ఎందరో నాయకులు, అధికారుల తో పాటు ప్రతి ఒక్క భారతీయుడు ఈ విజయానికి కారణం.ఇందుకు చేసుకుంటున్న సంబరాలు….
రానున్న కాలం మన దేశానికి చాలా కీలకం. మరొక 3,4 ఏళ్లలో ప్రపంచం లో అత్యధిక జనాభా కల దేశం గా అవిర్భవించబోతోంది. కాబట్టి దేశం జనాభాలో నే కాదు ఆర్ధికంగా , టెక్నాలజీ పరం గా , అన్ని రంగాలలో మొదటి స్థానంలో నిలపవల్సిన భాద్యత మనందరి మీద ముఖ్యంగా యువత మీద ఉన్నది.
ఇందుకోసం మనమందరం జాడ్యం వీడి స్వాతంత్య్ర సమరయోధుల స్ఫూర్తిని నింపుకుని భాద్యతగా దేశ అభివృద్ధికి దేశాన్ని మరల విశ్వ గురువుగా నిలబెట్టడానికి పాటుపడాలని…
వీలైతే అన్ని దరిద్రాలకు కారణమై దేశాన్ని పట్టి పీడిస్తున్న అవినీతిపై తమవంతు పోరాటం చేద్దామని
దేశం నాకేమి ఇచ్చిందని కాక నేను దేశానికి ఏమి ఇచ్చాను అనేవిధంగా ఈ నేలలొ పుట్టినందున ఈ మట్టి కి పునరంకితమవుతూ చేసుకుందాం..

(గల్ఫ్ నుంచి వాసు)

Leave a Reply