– మీ వెంట మేముంటాం.. జనంలోకి వెళ్లండి
– కాంగ్రెస్-బీఆర్ఎస్ను దోషులుగా నిలబెట్టండి
– మీ నిర్ణయాలకు మద్దతునిస్తాం
– తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కారు కోసం కదం తొక్కండి
– క్రమశిక్షణారాహిత్యాన్ని సహించవద్దు
– కొత్త కార్యకర్తలను తయారుచేయండి
– బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావుకు ఢిల్లీ బాసుల బాసట
– బిజెపి తెలంగాణ అధ్యక్షుడు రాంచందర్ రావు ఢిల్లీ పర్యటన విజయవంతం
ఢిల్లీ: కొత్తగా రాష్ట్ర పార్టీ పగ్గాలు చేపట్టిన ప్రముఖ న్యాయవాది ఎన్.రామచందర్‌రావు ఢిల్లీ పర్యటనలో జాతీయ నేతల మద్దతు లభించింది. తన ఆలోచనలు ఆవిష్కరించిన ఆయనకు అమిత్‌షా, నద్దా మద్దతుపలికారు. ఈ సందర్భంగా రామచందర్‌రావు, తెలంగాణలో పార్టీ అభివృద్ధి కోసం ఒక రోడ్‌మ్యాప్‌ను వారికి వివరించినట్లు తెలిసింది. దానికి వారు భుజం తట్టి తమ మద్దతునిచ్చినట్లు సమాచారం.
‘మీ నిర్ణయాలను ధైర్యంగా అమలుచేయండి. సమిష్ఠి నిర్ణయాలతో సమన్వయం చేసుకోండి. పనిచేసే కార్యకర్తలకు పదవులివ్వండి. అదే సమయంలో క్రమశిక్షణా రాహిత్యాన్ని క్షమించవద్దు. పార్టీ తర్వాతనే ఎవరైనా. రాష్ట్రంలో కాంగ్రెస్-బీఆర్ఎస్ను ప్రజల ముందు దోషులుగా నిలబెట్టండి. జనంలోకి వెళ్లండి. మీ వెంట మేముంటాం. మోదీ సర్కారు ఆయా గ్రామాలు, పట్టణాలకు అందిస్తున్న అభివృద్ధి ఫలాల గురించి చెప్పండి. కొత్త నాయకులను తయారుచేయండి. నాయకులు హైదరాబాద్‌లో కాకుండా క్షేత్రస్థాయిలోనే ఉండేలా కార్యాచరణ రూపొందించండి. తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కారు వచ్చే వరకూ విశ్రమించవద్దు’’ అని బీజేపీ నాయకత్వం రామచందర్‌రావుకు దిశానిర్దేశం చేసింది.
బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఎన్. రాంచందర్ రావు తొలిసారిగా ఢిల్లీ పర్యటన చేశారు. రెండు రోజుల పాటు కొనసాగిన ఈ పర్యటనలో బిజెపి జాతీయ నాయకత్వాన్ని మర్యాదపూర్వకంగా కలిసిన ఆయన, పార్టీని రాష్ట్రంలో బలోపేతం చేయడంపై కీలకంగా చర్చించారు.
ఈ సందర్భంగా రాంచందర్ రావు బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) సంతోష్ జీ, జాతీయ సహ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) శివప్రకాష్ జీ, బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ సునీల్ బన్సల్, జాతీయ కార్యదర్శి అర్వింద్ మీనన్ తో సమావేశమయ్యారు.
పార్టీ సంస్థాగత నిర్మాణంపై సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లే దిశగా జాతీయ నాయకులు కీలక సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రులతోనూ రాంచందర్ రావు సమావేశమయ్యారు.
కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ , కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ రు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ , కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి , కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ని కలిసిన ఆయన.. రాష్ట్ర అభివృద్ధి, కేంద్ర పథకాల అమలు వంటి ప్రజల ప్రయోజనాలను గూర్చి విశేషంగా చర్చించారు.
ఈ పర్యటనలో బిజెపి జాతీయ నాయకత్వం పూర్తి మద్దతు అందిస్తుందని స్పష్టం చేసింది. తెలంగాణలో బిజెపి ని బలోపేతం చేయడం, కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన వైఫల్యాలను ప్రజల్లో బహిర్గతం చేయడంతో పాటు ప్రజాసమస్యలపై పోరాటాలు చేసేలా స్పష్టమైన మార్గదర్శనం లభించింది.
రెండు రోజుల పర్యటన విజయవంతంగా ముగిసిన తర్వాత రాంచందర్ రావు ఢిల్లీ నుండి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం అయ్యారు. ఈ పర్యటనలో బిజెపి జాతీయ నాయకత్వం పూర్తి మద్దతు అందిస్తుందని స్పష్టం చేసింది. తెలంగాణలో బిజెపి ని బలోపేతం చేయడం, కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన వైఫల్యాలను ప్రజల్లో బహిర్గతం చేయడంతో పాటు ప్రజాసమస్యలపై పోరాటాలు చేసేలా స్పష్టమైన మార్గదర్శనం లభించింది. రెండు రోజుల పర్యటన విజయవంతంగా ముగిసిన తర్వాత రాంచందర్ రావు ఢిల్లీ నుండి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం అయ్యారు.