తెలుగు భాష అభివృద్ధికి మండలి బుద్ధప్రసాద్ చేసిన కృషి అనన్య సామాన్యం
ఇప్పుడు మనం ఫోనులో వాట్సాప్ యాప్ లో కంపోజ్ చేసుకుంటున్న తెలుగు ఫాంట్ ఒకప్పుడు లేవు.
ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పుడు ఐటీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య దృష్టిలోకి మండలి బుద్ధప్రసాద్ ఈ విషయం తీసుకెళ్లారు.
బుద్ధప్రసాద్ అప్పటి ప్రభుత్వానికి తెలుగు మహాసభ ద్వారా చేసిన ప్రతిపాదనలు :
1.ఇంగ్లీష్ ఫాంట్స్ ఉన్నట్లుగానే తెలుగు ఫాంట్స్ కూడా రావాలి.
2. తెలుగు ఫాంట్స్ కు స్పెల్ చెకర్ కూడా కలిపి అప్లికేషన్ డెవలప్ చేయాలి.
3. తెలుగు ఫాంట్స్ రూపొందించే క్రమంలో దాదాపు మూడు నుంచి ఐదు తెలుగు ఫాంట్స్ రావాలి.
అని ఇలాంటి కొన్ని ప్రతిపాదనలు ప్రభుత్వం ముందు ఉంచారు.
అప్పటి ప్రభుత్వం సహకారంతో మన మండలి బుద్ధప్రసాద్ కోరుకుంటున్న తెలుగు ఫాంట్స్ అందుబాటులోకి వచ్చాయి.
స్పెల్ చెకర్ కూడా వచ్చింది.
తెలుగు ఫాంట్స్ రకరకాలు వచ్చాయి.
భవిష్యత్ తెలుగు అవసరాలు దృష్టిలో ఉంచుకుని బుద్ధప్రసాద్ తెలుగు భాష పరిరక్షణ కోసం ఆధునిక డిజిటల్ యుగానికి తగిన స్థాయి ఆలోచనలతో చేసిన కృషి ఫలితంగా , నేడు మనం ప్రతి యాప్ లోనూ తెలుగు ఫాంట్స్ కంపోజ్ చేసుకుని మన పనులు వేగవంతం చేసుకుంటున్నాము.
తెలుగు భాషపై ప్రేమతో మండలి బుద్ధప్రసాద్ చేస్తున్న నిరంతర కృషి తెలుగు భాషకే వరం అని నిస్సందేహంగా చెప్పవచ్చు.
– సుబ్బారావు యర్రంశెట్టి