-ఈ రెండేళ్లయినా జనభక్షణ ఆపి, రక్షించండి
-తొత్తుల్లా, కాళ్లకు చెప్పుల్లా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను వాడుకుంటున్నారు
-ఒక కలెక్టర్ ను సీఎం లేనప్పుడు ఎందుకు పిలిపించారు?
-దీనిపై విచారణ చేపట్టాలని కోరా..
-నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు
తమ పార్టీ ప్లీనరీ అట్టర్ ఫ్లాప్ అయిందని, జిల్లాల ప్లీనరీల మాదిరిగానే ఈ ప్లీనరీ కూడా జనం లేక వెలవెలా పోయిందని నర్సాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణంరాజు అన్నారు.
ఈ ప్లీనరీకి కేవలం 25 వేల మంది మాత్రమే హాజరయ్యారని , వారు కూడా పెళ్లికి వచ్చి భోజనం చేసినట్లుగా… భోజనం చేసి వెళ్లిపోయారని చెప్పారు. ప్లీనరీ మెనూ ముందుగానే ప్రకటించక పోయి ఉండి ఉంటే, వారు కూడా వచ్చి ఉండేవారు కాదేమోనన్నా అనుమానాన్ని వ్యక్తం చేశారు. పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి,గౌరవాధ్యక్షురాలు విజయమ్మ లు పాల్గొన్న సభకే జనం రాకపోతే, తమ పార్టీ పరిస్థితి ఏమిటి, భయం వేస్తుంది అన్న ఆయన, ఇంకా తాను పార్టీలో ఉన్నానని గుర్తు చేశారు. డిస్టింక్షన్ కుర్రాడు మీటింగు పెడితే విపరీతంగా జనం వస్తారనుకున్నానని, తాను కూడా వెళ్లాలని అనుకున్నానని చెప్పారు.
అయితే ఆంధ్రాకు వెళ్లడానికి తనకు వీసా లేకపోవడంతో వెళ్లలేదని ఎద్దేవా చేశారు. ప్లీనరీ తొలి రోజు సమావేశాలలో రెండున్నర లక్షల మందికి ఏర్పాట్లు చేశామని తమ పార్టీ నాయకులు చెప్పుకున్నప్పటికీ, దాదాపు 23 వేల మంది భోజనాలు చేసినట్లుగా తెలిసిందన్నారు. తెగ జనం వచ్చినట్లుగా పబ్లిసిటీ చేసుకోవడం కాదని,ఇప్పటికైనా పార్టీ పెద్దలు ఆత్మవలోకము చేసుకోవాలని సూచించారు. ప్లీనరీ నిర్వహించిన సభా ప్రాంగణంలో వేసిన కుర్చీలు, ప్రాంగణం విస్తీర్ణం కొలతలు వేసి చూస్తే, 25 వేల మందికి మించి హాజరు కాలేదని స్పష్టం అవుతుందని చెప్పారు. గతంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను, ముగ్గురు ఎంపీలను లాగేసుకున్నదని… అందుకే దేవుడు వారికి 23 మంది ఎమ్మెల్యేలను, ముగ్గురు ఎంపీలను ఇచ్చారని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్లీనరీలో పేర్కొన్న విషయాన్ని ప్రస్తావిస్తూ, అదే లాజిక్ నిజమైతే తమ పార్టీకి రానున్న ఎన్నికల్లో నాలుగు అసెంబ్లీ స్థానాలకు మాత్రమే పరిమితమవుతుందని చెప్పారు.
లోక్ సభలో ఎవ్వరూ లేకపోతే తమ పార్టీ పరిస్థితి ఏమిటి అని ప్రశ్నించిన ఆయన, ఎలాగైనా ముగ్గురు ఎంపీలలో ఒక్కరినైనా తమ పార్టీలోకి తీసుకోవాలన్నారు. అమరావతిలో మానసిక వైద్యశాల ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై రఘురామకృష్ణంరాజు స్పందిస్తూ… కొడాలి నాని ముక్కుసూటిగా మాట్లాడే మనిషి అని, ఆయన అన్నారంటే మానసిక వైద్యశాల ఏర్పాటు చేయవలసిందే నని ఎద్దేవా చేశారు. ఒక దుష్ట చతుష్టమంటూ చేసిన విమర్శలపై… తాము 95 శాతం అమలు చేశామని హామీలను చేశామని అబద్ధాలు చెబుతుంటే, వారు 95 శాతం హామీలను అమలు చేయలేదని నిజాలను చెబుతుంటే ఎవరికైనా కడుపు మంట ఉంటుంది కదా అంటూ అపహాస్యం చేశారు. ప్రభుత్వ పాఠశాలల మాయం పై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరుగుతున్నదని , ఈ ప్రభుత్వ విధానాల వల్ల మన పార్టీ అయిపోతుందని, పార్టీ పది కాలాల పాటు ఉండాలనే ఉద్దేశంతో.. నేను చాలా మాట్లాడాలని గుర్తు చేశారు.. నన్ను కొట్టారు, సోషల్ మీడియాలో మాట్లాడుతున్న వారిని కొట్టలేదు అంతే అన్న ఆయన, ఇది పీసీ సర్కార్ ప్రభుత్వం అంటూ, 8వేల స్కూళ్లను మాయం చేశారని నెటిజన్లు మండిపడుతున్నారని చెప్పారు. వెంకయ్య నాయుడు మనవడు, చంద్రబాబు నాయుడు తనయుడు ఏ మాధ్యమంలో చదివాలన్నదానిపై రాజ్యాంగంలో ఎటువంటి నిబంధన లేదన్న ఆయన, ప్రాథమిక విద్య మాతృభాషలోనే ఉండాలన్న నిబంధన ఉన్నదని గుర్తు చేశారు.
కేబినెట్ కార్యదర్శికి లేఖ రాశా
రాష్ట్రంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను తొత్తుల్లా, కాళ్లకు చెప్పుల్లా వాడుకుంటున్నారని రఘురామకృష్ణం రాజు అన్నారు. ఎవరైనా ఐఏఎస్ , ఐపీఎస్ అధికారులు ఫీలయితే క్యాబినెట్ సెక్రటరీకి ఫిర్యాదు చేసుకోవచ్చని అన్నారు. తాను ఇప్పటికే క్యాబినెట్ కార్యదర్శి రాష్ట్రములోని పరిస్థితిపై ఫిర్యాదు చేశానని తెలిపారు.. చాలామంది మాజీ ఐపీఎస్ ఐఏఎస్ అధికారులతో, ప్రస్తుతం పని చేస్తున్న అధికారులతో మాట్లాడానని, రాష్ట్రంలో చాలా భయానక వాతావరణం నెలకొందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి తన ఇంట్లోనే లేనప్పుడు ఒక కలెక్టర్ స్థాయి అధికారులు ఎందుకు పిలిపించారో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లాలో చంద్రబాబు నాయుడు ను స్వాగతిస్తూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చింపివేశారని, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వారిని చావ బాదుతున్నారని అన్నారు.
మధ్య నిషేధం హామీతోనే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చామని, ప్లీనరీలో మాత్రం మధ్య నియంత్రణ అంటున్నారని రఘురామకృష్ణం రాజు ఎద్దేవ చేశారు. నవరత్నాల్లో మధ్య నిషేధం లోగో కూడా ఉన్నదని పేర్కొన్నారు.. మధ్య నియంత్రణ అంటే, గతంలో జనాభా నియంత్రణ మాదిరిగానా అంటూ ప్రశ్నించారు. మధ్య నిషేధానికి ఎవరి చొక్కా పట్టుకుంటారో, వారి చొక్కా పట్టుకావాలన్న ఆయన, మధ్య నిషేధమైనా చెయ్యి, లేదంటే ధరలలైనా నియంత్రించమని నిలదీయాలని సూచించారు. మధ్య నిషేధం చేయకుండా, నియంత్రణ అని చెప్పి, కొంప గోడు దోచుకుంటున్నారు… మీరేమీ బాగుపడతారు రా… మద్యానికి అలవాటు పడిన వారి భార్యలు ప్రశ్నించాలన్నారు. జగన్ రక్త పిశాచిగా మారారని ఆయనకు ఎన్ని చెప్పినా అరణరోదనేనని తనకు ఒక వ్యక్తి లేఖ రాశాడని రఘురామకృష్ణం రాజు వివరించారు. మద్యం స్టాప్ ఫుల్ గా ఉన్న 260 లేదంటే 385 రూపాయల మధ్యాన్ని బలవంతంగా అంటగడుతున్నారని చెప్పారన్నారు.. రాష్ట్రంలో జగన్ వల్ల ప్రజలు కష్టాల్లో ఉన్నారని, విజయమ్మకు ప్రజల కష్టాలు పట్టవని కొడుకు ,కూతురు బాగున్నారా ? అని మాత్రమే ఆలోచిస్తుందన్నారు. షర్మిలాకు వచ్చిన కష్టమేమిటో, ఎందుకు విజయమ్మ తల్లడిల్లి పోతున్నారో తెలియదన్నారు.. ప్లీనరీ అంటే కుటుంబ కార్యక్రమం లా జరగాలన్నారు. కానీ పార్టీ కోసం కష్టపడిన చెల్లి, ఇప్పుడు తల్లి వెళ్లిపోయారన్నారు.