గురువును దేవుడితో సమానంగా పూజించే సమాజం మనది

-గురువుల ద్వారానే భారత్ కు విశ్వగురు స్థానం
-ప్రపంచంలో అతి ప్రాచీన విద్యాలయాలు మన “గురు” కులాలే
-శ్రీ విశ్వగురు పూర్ణిమ వేడుకల్లో కృష్ణంరాజు

ఈ ప్రపంచంలో గురువులను దేవతలతో సమానంగా పూజిస్తున్న ఏకైక దేశం మనదేనని ఎ.పి. ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వి.వి.ఆర్. కృష్ణంరాజు అన్నారు. ఆయన నేడిక్కడ జరిగిన శ్రీ విశ్వగురు పూర్ణిమ వేడుకలకు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రపంచంలోని అత్యంత ప్రాచీన విద్యాలయాలు మన దేశంలోని గురుకులాలేనన్నారు. ఈ ప్రాచీన గురుకులాల పునాదులపైనే హైందవ ధర్మ విజ్ఞానం, ఆచార, సాంప్రదాయాలు నేటికి సజీవంగా నిలిచాయన్నారు. భారత్ కు లభించిన “విశ్వగురు” స్థానానికి గురువులే కారకులని కృష్ణంరాజు అన్నారు. ఈ సందర్భంగా2ఆయన శ్రీ గురు విశ్వస్పూర్తి రచించిన “అవగాహన స్పూర్తి” గ్రంధాన్ని ఆవిష్కరించారు. ఆద్యాత్మికతకు వైజ్ఞానికి ఉన్న సంబంధాలను శ్రీ గురు విశ్వస్పూర్తి ఈ గ్రంధంలో విపులంగా వివరించారని అన్నారు. మానవుడు తనను తాను శోధించుకోకుండా విశ్వశోధన చేస్తున్నాడని మనిషి తనలోని తనను ముందుగా అధ్యయనం చేయాలని ఈ గ్రంధంలో శ్రీ గురు విశ్వస్పూర్తి సలహా ఇచ్చారన్నారు. మనిషి మనస్సు, భావాలు, సజీవ నిర్జీవాలు, జీవం, భావం, ఆలోచన వంటి మానవ తత్వాలను ఈ గ్రంధంలో అద్భుతంగా ఆవిష్కరించిన శ్రీ గురువిశ్వ స్పూర్తి “మానవతత్వ చరిత్ర హితామహుడు”గా అవతరించారన్నారు. ఈ సభకు శ్రీ సత్య నృత్య సంగీత కళాశాల ప్రిన్సిపల్ బి.వి.ఎస్.ఆర్. మోహనరావు అధ్యక్షత వహించారు. టి. సత్యనారాయణ, డి.వెంకటరామారావు, డాక్టర్ ఎం. గౌరీపద్మ, డాక్టర్ భాగవతుల హేమలత తదితరులు ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి స్ఫూర్తి కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

Leave a Reply