– బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు
విజయవాడ: ప్రకాశం జిల్లా లోని పెద్దారవీడు మండలం రాజం పల్లి గ్రామంలో వెలసిన గొడ్డలి కొండ తిరుమల స్వామి దేవాలయం దగ్గర అక్రమంగా ఏర్పాటుచేసిన అన్యమత చిహ్నాలు తొలగించాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు.
పెద్దారవీడు మండలం రాజం పల్లి గ్రామం దగ్గర్లో వెలసిన గొడ్రాలికొండ తిరుమలనాథ స్వామి దేవాలయం ఈ ప్రాంతం హిందువులకు పరమ పవిత్రమైన ప్రదేశం అనేక వేలమంది స్వామిని పూజిస్తూ ఉంటారు, ఈ ప్రాంత ప్రజలందరూ కూడా తమ కోరికలు నెరవేర్చే కొంగు బంగారంగా స్వామివారిని భావిస్తుంటారు. అనేక శతాబ్దాలుగా సంతానం కలగని దంపతులు ఈ కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ చేసి అనంతరం అక్కడ వెలసిన తిరుమల స్వామి ఆ దేవాలయంలో ఉసిరిక చెట్టు చెట్టుకు తమ మొక్కులు కట్టి స్వామివారిని ప్రార్ధించి భక్తిప్రపత్తులతో చేసిన భక్తులకు అనేక వేల మందికి సంతాన భాగ్యం కలిగింది అని చెప్పి ఈ ప్రాంత ప్రజలు నమ్ముతుంటారు. ఇదే విషయాన్ని స్థానికులు భారతీయ జనతాపార్టీ దృష్టికి తీసుకుని వచ్చారు.
అభివృద్ధి చెందుతున్న ఈ దేవాలయం గిరి ప్రదక్షిణ చేసే ప్రదేశంలో ఈ మధ్య కాలంలో హిందూ ధర్మాన్ని హిందూ సంస్కృతిని దెబ్బతీసే విధంగా కొంతమంది అన్యమతస్తులు గొడ్రాలు కొండపై అన్యమత చిహ్నాలు అక్రమంగా అనుమతిలేకుండా ఏర్పాటు చేసి చర్చి నిర్మాణం చేస్తున్నారు ఈ చర్య ఈ ప్రాంతంలో మత విద్వేషాలు రెచ్చగొట్టడం తోపాటు ఈ ప్రాంత ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా సంస్కృతి దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారు.
భారతీయ జనతా పార్టీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు శ్రీనివాస్ నాయకత్వంలో ఆ ప్రాంతాన్ని పరిశీలించి అక్రమంగా ఏర్పాటు చేసినట్లు తొలగించాలని, చర్చి నిర్మాణానికి వారు చేస్తున్న ప్రయత్నాన్ని ఆపి ఈ ప్రాంతంలో హిందువుల మనోభావాలు కాపాడడం తో మతోన్మాదుల చర్యలను కట్టడి చేయాలని లేనియెడల భారతీయ జనతా పార్టీ ఉద్యమాన్ని నిర్మాణం చేస్తామని తెలపడం జరిగింది. ఇదే విషయాన్ని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు దృష్టికి తీసుకుని వచ్చారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి హిందూ మనోభావాలు దెబ్బతీసే గొడ్రాలికొండ దగ్గర ఏర్పాటు చేసిన అన్యమత చిహ్నాలను వెంటనే తొలగించాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ డిమాండ్ చేస్తోంది. సమస్య పరిష్కారం అయ్యే వరకు స్థానిక బిజెపి నాయకులకు దశల వారీ పోరాటం చేయాలని బిజెపి రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సోమువీర్రాజు సూచించారు.